కారులో చిక్కుకుని.. ఊపిరాడక చిన్నారులు మృతి..
అందరూ పెళ్లి హడావుడిలో ఉండి కార్లో చిక్కుకున్న పిల్లలను గమనించలేదు. ఎంతసేపటికి చిన్నారులు కనిపించకపోవడంతో వెతుకాలట ప్రారంభించగా చిన్నారులను కార్లో గుర్తించారు.;
రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం దామరగిద్దలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఇన్నారులు ఇద్దరూ కారులో ఆడుకుంటుండగా డోర్స్ లాక్ అవడంతో ఈ ఘటన జరిగింది. ఇద్దరు చిన్నారులు ఊపిరి ఆడక మరణించారు. బంధువుల పెళ్లికి వచ్చిన అక్కాచెల్లెళ్ల పిల్లలు అన్మయశ్రీ(5), అభినయశ్రీ(4) ఆడుకుంటున్నారు. ఆడుకుంటూ ఆడుకుంటూ ఇంటి ముందు ఉన్న కారులోకి ఎక్కారు. అయితే వాళ్లు ఆడుకుంటున్న క్రమంలో కారు డోర్స్ లాక్ అయ్యాయి. పిల్లలు లోపలే చిక్కుకున్నారు. అందరూ పెళ్లి హడావుడిలో ఉండి కార్లో చిక్కుకున్న పిల్లలను గమనించలేదు. ఎంతసేపటికి చిన్నారులు కనిపించకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళనకు గురయ్యారు. ఇళ్లంతా వెతికారు. చివరకు కారులో స్పృహ కోల్పోయి ఉండటాన్ని గమనించారు. వెంటనే వారిని ఆసుపత్రికి తరలించారు. కాగా చిన్నారులు ఇద్దరూ అప్పటికే మరణించారని వైద్యులు చెప్పారు. కాగా ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకు దర్యాప్తు ప్రారంభించారు.