హైవే హోటళ్లలో అపరిశుభ్రత, ఫుడ్ సేఫ్టీ అధికారుల కొరడా

హైవేలపై ఉన్న హోటళ్లలో అన్ హైజీన్ పరిస్థితులున్నాయని ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీల్లో తేలింది.

Update: 2025-11-02 02:14 GMT
హైవే హోటల్ లో కుళ్లిన పండ్లు

తెలంగాణ రాష్ట్రంలోని జాతీయ రహదారులపై ఉన్న బడా హోటళ్లలో అపరిశుభ్ర పరిస్థితులు వెలుగుచూశాయి. సంగారెడ్డి, వరంగల్, జోగులాంబ గద్వాల్ జిల్లాల మీదుగా వెళుతున్న నేషనల్ హైవే 65, 163,44 ల పకకన ఉన్న 12 పెద్ద హోటళ్లలో అపరిశుభ్ర పరిస్థితులు నెలకొన్నాయని తెలంగాణ ఫుడ్ సేఫ్టీ ఎన్ ఫోర్స్ మెంట్ డ్రైవ్ లో వెల్లడైంది.

- ఆహార భద్రతా అధికారులు 9వ నంబరు జాతీయ రహదారిపై ఉన్న రుద్రారం ద ప్యాలెస్ హోటల్ లో 107.5 కిలోల కుళ్లన పండ్లు, ఆహారపదార్థాలను కనుగొన్న అధికారులు లైసెన్సును సస్పెండ్ చేశారు.
-జాతీయ రహదారులపై ఉన్న ఉత్సవ్, అతిథి, మినర్వా, వివేరా, తాజ్ ప్యాలెస్ హోటళ్లలో కాలం చెల్లిన ఆహార పదార్థాలు, సింథటిక్ రంగులు, అపరిశుభ్ర పరిస్థితులు ఉన్నాయని తనిఖీల్లో వెల్లడైంది.



 15 హోటళ్లకు నోటీసులు

కాలం చెల్లిన, కుళ్లిన పండ్లు, ఆహార పదార్థాలను ఫుడ్ సేఫ్టీ అధికారులు సీజ్ చేశారు. 8 హోటళ్లకు మెరుగు పర్చుకోవాలని నోటీసులు జారీ చేశారు. మరో ఏడు హోటళ్ల నుంచి శాంపిళ్లను సేకరించి ఫుడ్ లాబోరేటరీకి పరీక్షల కోసం పంపించారు.ప్రజారోగ్యాన్ని దెబ్బతీసే హోటళ్లపై కొరడా ఝళిపిస్తామని తెలంగాణ ఫుడ్ సేఫ్టీ డైరెక్టర్ డాక్టర్ సి శివలీల ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు.


Tags:    

Similar News