నిర్మాణ రంగంలో స్వదేశీ వస్తువులనే వాడండి: కిషన్ రెడ్డి

హైటెక్స్ క్రెడాయ్ కార్యక్రమంలో కేంద్రమంత్రి సూచన;

Update: 2025-08-17 14:18 GMT

హైదరాబాద్ లో నిర్మాణ రంగం అభివృద్ది చెందుతోందని, వినియోగదారుల మేలు కొరకు నిర్మాణరంగ సంస్థలు కృషి చేయాలని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. హైటెక్స్‌లో నిర్వహించిన క్రెడాయ్‌ కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ప్రపంచవ్యాప్తంగా వస్తోన్న విప్లవాత్మక మార్పుల దృష్ట్యా బిల్డర్స్‌ స్వదేశీ వస్తువులనే వినియోగించాలని సూచించారు. నిర్మాణ రంగానికి ప్రభుత్వ సహకారం తప్పక ఉంటుందన్నారు. నిర్మాణ రంగ వ్యాపారులు ఇళ్ల నిర్మాణం నాణ్యతలో కాంప్రమైజ్ కావొద్దన్నారు.

‘‘ఇప్పటికే గ్రేటర్ హైదరాబాద్‌.. ఐటీ, ఫార్మా రంగాల్లో చొచ్చుకెళ్తోంది. నిర్మాణం రంగంలోనూ చొచ్చుకెళ్తోంది’’ అని కిషన్ రెడ్డి అన్నారు. అంతర్జాతీయ విమానాశ్రయాలు, జాతీయ రహదారులు మౌలిక వసతుల కల్పనలో రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం చేయూత అందజేస్తోందన్నారు. వరంగల్‌లో విమానాశ్రయం రాబోతోంది. ఆదిలాబాద్‌లోని డిఫెన్స్‌ ఎయిర్‌పోర్టును ప్రజా ఎయిర్‌పోర్టుగా మార్చేస్తున్నాం అని కిషన్ రెడ్డి చెప్పారు. ఎంఎంటీఎస్‌ రైళ్లను ఇక నుంచి ఏసీ రైళ్లుగా మారుస్తాం అని ఆయన హామి ఇచ్చారు. ‘‘సాంకేతిక కారణాలతో మెట్రో పెండింగ్‌లో ఉంది. దాన్ని త్వరలోనే పూర్తి చేయనున్నాం’’ అని కిషన్ రెడ్డి వివరించారు. ‘‘సికింద్రాబాద్‌లో రూ.720 కోట్లతో రైల్వే పనులు, హైదరాబాద్‌-విజయవాడ గ్రీన్‌ ఫీల్డ్‌ నేషనల్‌ హైవే త్వరలో పూర్తి చేస్తాం’’అని కిషన్‌రెడ్డి తెలిపారు
Tags:    

Similar News