తిరుచానూరులో ఉప రాష్టప్రతి సిపి రాధాకృష్ణన్ పర్యటన
అమ్మవారి ఆశీస్సులు పొందారు
By : The Federal
Update: 2025-09-25 10:03 GMT
భారత ఉప రాష్ట్రపతి శ్రీ రాధాకృష్ణన్ గురువారం మధ్యాహ్నం తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకున్నారు.
ఆలయం వద్దకు చేరుకున్న ఉపరాష్ట్రపతికి అర్చకులు సంప్రదాయబద్ధంగా పూర్ణకుంభ స్వాగతం పలికారు. ఆయన ఆలయంలోని ధ్వజస్తంభానికి మొక్కుకుని శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం ఆశీర్వాద మండపంలో టీటీడీ చైర్మన్ శ్రీ బీ.ఆర్.నాయుడు, జేఈవో శ్రీ వీరబ్రహ్మం అమ్మవారి ప్రసాదాలు అందజేసి శేష వస్త్రంతో సత్కరించారు.