సీఎం ఆదేశాలు బేఖాతర్, స్టేడియంలో దేవిశ్రీ ప్రసాద్ ఈవెంట్
తెలంగాణలోని స్టేడియంలోను క్రీడేతర కార్యక్రమాలకు ఇవ్వమని సీఎం జారీ చేసిన ఆదేశాలను తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ బేఖాతరు చేసింది.
By : The Federal
Update: 2024-10-16 09:08 GMT
ఎల్బీ స్టేడియాన్ని ఫుట్ బాల్ గ్రౌండులాగా తీర్చిదిద్దుతామని సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల ప్రకటించారు. ‘‘గచ్చిబౌలి స్టేడియాన్నిరూ.20 కోట్లు ఖర్చు పెట్టి ఆధునీకరించి ఫుట్ బాల్ గేమ్స్ ఆడుకునేలా చేశాం, ఎల్బీ స్టేడియాన్ని కూడా అభివృద్ధి చేసి నగరంలోని పేద క్రీడాకారులకు అందుబాటులోకి తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. యువత వ్యసనాల వైపు వెళ్లకుండా క్రీడలపై దృష్టి సారించాలి’’అని సీఎం ఎ రేవంత్ రెడ్డి కోరారు.
- సీఎం స్టేడియాలను అభివృద్ధి చేసుండగా స్పోర్ట్సు అథారిటీ మాత్రం క్రీడా మైదానాలను వాణిజ్య కార్యక్రమాలకు అద్దెకు ఇస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలను స్పోర్ట్సు అథారిటీ బేఖాతరు చేస్తుంది.
గచ్చిబౌలి స్టేడియంలో భారీ సెట్
సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలను స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ అధికారాలు బేఖాతరు చేశారు.గచ్చిబౌలి స్టేడియం లో సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ ఈవెంట్ నిర్వహించేందుకు అనుమతించారు.ఈనెల 19వతేదీన గచ్చిబౌలి ఫుట్ బాల్ స్టేడియంలో దేవిశ్రీ ఈవెంట్ నిర్వహించనున్నారు. ఈ ఈవెంట్ కోసం స్టేడియంలోని అథ్లెటిక్ ట్రాక్ పై భారీ సెట్ వేశారు.
స్టేజి నిర్మాణం కోసం స్టేడియం లో భారీగా గుంతలు తవ్వారు.ఇలాంటి ఈవెంట్స్ వల్ల క్రీడాకారుల సాధనకు ఆటంకం అని క్రీడాభిమానుల ఆవేదన వ్యక్తం చేశారు.
క్రీడాకారుల ఆగ్రహం
సీఎం రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చాక స్టేడియంను ఇటీవలే రూ. 20 కోట్లు ఖర్చు పెట్టి బాగు చేశారు స్టేడియాలను ఇకపై క్రీడేతర కార్యక్రమాల నిర్వహణకు, ఈవెంట్స్ ఇవ్వమని సీఎం స్వయంగా ప్రకటించాక కూడా స్పోర్ట్సు అథారిటీ తీరు మార్చుకోలేదు. దీనిపై క్రీడాకారులు ఆగ్రహం వ్యక్తం చేశారు.