తెలంగాణ ప్రజలకు వీఐపీల విశ్వావసు నామ సంవత్సర శుభాకాంక్షలు

తెలంగాణ ప్రజలకు ప్రధాని మోదీ, తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, సీఎం రేవంత్ రెడ్డి, ప్రతిపక్షనేత కేసీఆర్ విశ్వావసు నామ సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.;

Update: 2025-03-30 05:03 GMT

ఉగాది పర్వదినం సందర్భంగా రవీంధ్రభారతిలో జరిగిన పంచాంగ శ్రవణ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి, చీఫ్ సెక్రటరీ ఎ శాంతికుమారి పాల్గొన్నారు. హైదరాబాద్‌లోని రాజ్ భవన్‌లో జరిగిన ఉగాది (తెలుగు నూతన సంవత్సర) వేడుకలకు గౌరవనీయులైన తెలంగాణ గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.


మోదీ ఉగాది శుభాకాంక్షలు
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉగాది సందర్భంగా తెలుగు ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ‘‘ఇది ఆశ, ఉత్సాహాలతో ముడిపడి ఉన్న ప్రత్యేక పండుగ ఉగాది అని మోదీ పేర్కొన్నారు. ఈ కొత్త సంవత్సరం ప్రతి ఒక్కరి జీవితాల్లో ఆనందాన్ని, శ్రేయస్సును, విజయాలను తీసుకురావాలని మోదీ ఆకాంక్షించారు. సంతోష, సామరస్యాల స్ఫూర్తి వృద్ధి చెందుతూ మరింతగా వర్ధిల్లాలని మోదీ ఆకాంక్షించారు.

అందరి జీవితాల్లో ఆనందాలు నింపాలి : సీఎం రేవంత్ రెడ్డి
శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది పండుగ సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. కొత్త సంవత్సరంలో ప్రజలకు శుభం కలగాలని, దేవి దేవతల కరుణాకటాక్షాలు అందరి జీవితాల్లో ఆనందాలు నింపాలని ఆకాంక్షించారు.‘‘చైత్ర శుద్ధ పాడ్యమిన నవ వసంత ఆగమనం తెలుగు వారి సంబురం..షడ్రుచుల సమ్మేళనం కష్టసుఖాలను సంయమననంతో స్వీకరించాలనే సందేశం సకల జనహిత పాలనలో తెలంగాణ రైజింగ్ గమనం’’ అని సీఎం పేర్కొన్నారు. ఉగాది పండుగ అందరి జీవితాల్లో ఆనందాలు నింపాలని సీఎం రేవంత్ రెడ్డి ఆకాంక్షించారు.

తెలుగు సంస్కృతికి అద్దం పట్టే ఉగాది

విశ్వావసు నామ ఉగాది సందర్భంగా తెలంగాణ రాస్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఉగాది తెలుగు సంస్కృతికి అద్దం పడుతుందని ఆయన పేర్కొన్నారు. రాజ్ భవన్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాడుగుల నాగఫణి శర్మ పంచాంగ శ్రవణం చేశారు.

రాష్ట్ర ప్రజలకు కేసీఆర్ ఉగాది శుభాకాంక్షలు

సాగునీరుతో సమృద్ధిగా పంటలు పండేలా ప్రజలను దీవించాలని ప్రకృతి మాతను కేసీఆర్ ప్రార్థించారు. ప్రకృతితో మమేకమై, వ్యవసాయ ఉత్పత్తి సంబంధాలలో పరస్పర సహకారం ప్రేమాభిమానాలతో పాల్గొనే సబ్బండ వర్ణాలకు, ఉగాది గొప్ప పర్వదినం అని కేసీఆర్ పేర్కొన్నారు. రైతన్నలు, సబ్బండ వర్గాల సంక్షేమం దిశగా, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్యాచరణ చేపట్టి, ప్రజల జీవితాల్లో మరింతగా గుణాత్మక మార్పును తీసుకురావాలని ఆశించారు. అప్పుడే విశ్వావసు నామ నూతన సంవత్సరానికి సంపూర్ణత లభిస్తుందని కేసీఆర్ అన్నారు.ఉగాది పచ్చడి మాదిరి, జీవితంలో షడ్రుచులను ఆస్వాదిస్తూ ప్రతీ సందర్భాన్ని వివేచనతో ఎదుర్కోవడం ద్వారానే మంచి చెడులు అర్థమై జీవితానికి పరిపూర్ణత చేకూరుతుందని తెలిపారు.ఈ నూతన సంవత్సరంలో సాగునీరు తాగునీరు పుష్కలంగా లభించి, సమృద్ధిగా పంటలు పండి, ప్రజల జీవితాల్లో సుఖసంతోషాలు వెల్లివిరిసేలా దీవించాలని ప్రకృతి మాతను కేసీఆర్ ప్రార్థించారు.


Tags:    

Similar News