‘మేమా, కొండా ఫ్యామిలీనా..? ఒకటి చూజ్ చేసుకోండి!’

చిలికి చిలిక గాలివానలా మారిన వరంగల్ కాంగ్రెస్ పంచాయితీ. పార్టీ క్రమశిక్షణ కమిటీని నిలదీసిన నేతలు.;

Update: 2025-07-10 12:12 GMT

‘మేము కావాలో.. కొండా కుటుంబం కావాలో పార్టీ తేల్చుకోవాలి’ అని కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ మల్లు రవికి వరంగల్ నేతలు స్పష్టం చేశారు. వారు చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర చర్చలకు దారితీస్తున్నాయి. తెలంగాణ కాంగ్రెస్‌లో వరంగల్ పంచాయితీ రోజురోజుకు ముందురుతోంది. కొండా ఫ్యామిలీ వర్సెస్ వరంగల్ నేతల వివాదంలో పార్టీ క్రమశిక్షణ కమిటీ కూడా ఎటూ తేల్చుకోలేని పరిస్థితిలో మీనమేషాలు లెక్కేస్తుంది. ఈ అంశంపై చర్చిండం కోసమే గురువారం.. పార్టీ క్రమశిక్షణ కమిటీ ఛైర్మన్ మల్లురవి.. వరంగల్ నేతలతో భేటీ అయ్యారు.

ఈ చర్చలో భాగంగానే వరంగల్ నేతలంతా కూడా పార్టీకి తాము కావాలో? కొండా ఫ్యామిలీ కావాలో? తేల్చుకోవాలని స్పష్టం చేశారు. తామే మాటలు పడి.. ఇప్పుడు తామే వచ్చి.. సంజాయిషీలు ఇచ్చుకోవాలి, వివరణ ఇచ్చుకోవాలి అనడం ఏమాత్రం సబబు కాదని వారు అన్నారు. వరంగల్ కాంగ్రెస్‌లో చెలరేగిన వివాద జ్వాలలు చల్లారంటే కొండా ఫ్యామిలీపై చర్యలు తీసుకోవాల్సిందేనని డిమాండ్ చేశారు. గాంధీభవన్‌లో జరిగిన క్రమశిక్షణ సమావేశంలో కడియం శ్రీహరి, నాయిని రాజేందర్ రెడ్డి, రేవూరి ప్రకాశ్‌రెడ్డి, కేఆర్‌ నాగరాజు, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, కుడా ఛైర్మన్‌ వెంకట్రామిరెడ్డి పాల్గొన్నారు.

మాకూ ఫ్రీ హ్యాండ్ ఇవ్వండి..

‘‘క్రమశిక్షణ కమిటి ముందుకు రావాలంటేనే అమానంగా ఉంది. తిట్లు తిన్నది మేము.. కమిటీ ముందు హాజరుకావాల్సిందీ మేమే. కమిటీ కూడా మమ్మల్నే పిలుస్తుంది. ఇలా చేయడం ద్వారా కమిటీ ఎలాంటి సంకేతాలివ్వాలనుకుంటుంది. కొండా మురళీపై చర్యలు తీసుకోవాల్సిందే. లేదంటే మాకు కూమా ఫ్రీ హ్యాండ్ ఇవ్వండి. ఈ విషయంలో మేము కావాలో, కొండా ఫ్యామిలీ కావాలో తేల్చుకోండి’’ అని మల్లు రవికి వరంగల్ నేతలు తేల్చి చెప్పారు. సమావేశం ముగిసిన అనంతరం.. ఈ చర్చలపై మల్లు రవి స్పందించారు. ఈ సమావేశంలో వరంగల్ వివాదంపై చర్చించామని, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల అభిప్రాయాలు తెలుసుకున్నామని తెలిపారు.

Tags:    

Similar News