72వ మిస్ వరల్డ్ పోటీల్లో న్యాయనిర్ణేతలు ఎవరంటే...
72వ మిస్ వరల్డ్ పోటీల్లో న్యాయనిర్ణేతల్లో సినీనటీనటులు, హైదరాబాద్ ప్రముఖులకు స్థానం లభించింది.;
By : The Federal
Update: 2025-05-31 14:48 GMT
72వ మిస్ వరల్డ్ పోటీల్లో న్యాయనిర్ణేతల్లో సినీనటీనటులు, హైదరాబాద్ ప్రముఖులకు స్థానం లభించింది.అందాల పోటీలకు జడ్జిలుగా మిస్ వరల్డ్ సీఈఓ జూలియా మోర్లీ, బాలీవుడ్ ప్రముఖ నటుడు సోనూ సూద్,మెఘా ఇంజినీరింగ్ డైరెక్టర్ సుధారెడ్డి, సినీనటుడు రానా దగ్గుబాటి, తెలంగాణ ఐఎఎస్ అధికారి జయేష్ రంజన్, మాజీ మిస్ వరల్డ్ మనూషి చిల్లర్, సినీనటి నమ్రత శిరోద్కర్, డోనా వాళ్ల్ వ్యవహరించారు.
మిస్ వరల్డ్ గ్లోబల్ అంబాసిడర్ గా సుధా రెడ్డి
మిస్ వరల్డ్ గ్లోబల్ అంబాసిడర్ గా సుధా రెడ్డిని నియమించారు.సుధారెడ్డికి జ్ఞాపికను అందించిన మిస్ వరల్డ్ సిఈఓ జూలియా మోర్లీ అందజేశారు. తనను మిస్ వరల్డ్ గ్లోబల్ అంబాసిడరుగా నియమించడం తనకెంతో ఆనందంగా ఉందని సుధా రెడ్డి చెప్పారు. మిస్ వరల్డ్ పోటీలకు అద్భుతమైన ఏర్పాట్లు చేసిన తెలంగాణ ప్రభుత్వానికి, టూరిజం శాఖకు సుధారెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.
ఒక్కో ఖండం నుంచి 10 మంది ఫాస్ట్ ట్రాక్ విన్నర్ లను ఫైనల్ ఈవెంట్ కు పరిచయం చేశారు. వారిలో ఖండాల వారీగా టాప్ సుందరిని ఎంపిక చేశారు. అందాల పోటీల్లో తెలంగాణ ఎఫ్ డీ సీ ఛైర్మన్ దిల్ రాజు,చిరంజీవి, హీరో విజయ్ దేవరకొండ తదితరులు పాల్గొన్నారు.