వరంగల్ పార్లమెంట్ విజేత ఎవరు..?
వచ్చే లోక్ సభ ఎన్నికల్లో మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన తీర్పును ఓటర్లు కంటిన్యూ చేస్తారా లేక విలక్షణమైన తీర్పు ఇస్తారా. కాంగ్రెస్ టికెట్ కు తీవ్రంగా పోటీ
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత వరంగల్ పార్లమెంట్ కు మూడుసార్లు ఎన్నికలు జరిగాయి. 2014 ఎన్నికల్లో టిఆర్ఎస్ అభ్యర్ధిగా బరిలో నిలిచిన కడియం శ్రీహరి విజయం సాదించారు. ఆతర్వాత శ్రీహరి రాజీనామా చెయ్యడంతో ఉపఎన్నిక రావడం, టిఆర్ఎస్ నుంచి పోటీ చేసిన పసునూరి దయాకర్ గెలుపొందారు. 2019 లో జరిగిన ఎన్నికల్లో సైతం దయాకర్, సమీప కాంగ్రెస్ అభ్యర్ది దొమ్మాటి సాంబయ్యపై 3 లక్షలపైచిలుకు మెజారిటీతో విజయం సాదించారు. కాగా ఈ నియోజక వర్గం ఎస్సీ రిజర్వుడు. వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గంలో జనాభా 15 లక్షల 37 వేల 781 ఉంది. ఇందులో 59.99% శాతం గ్రామీణ ప్రాంతాల వారు కాగా, 40.01% శాతం పట్టణ ప్రాంతాల్లో ఉంటున్నారు.
అయితే, గత ఎన్నికలకు ఈ సారి చాలా తేడా ఉంది. గతంలో ఇక్కడ ప్రతిపక్ష పార్టీలు పోటీ పెట్టేందుకు జంకేవి. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసేందుకు ఎవరూ ముందుకు వచ్చే వారు . కాదు, కానీ సారి కాంగ్రెస్ నుంచి చాలా మంది పోటీపడుతున్నారు. ప్రతిపక్షంలోకి వచ్చిన బిఆర్ ఎస్ నుంచే పెద్దగా పోటీ లేదు.
వరంగల్ పార్లమెంట్ పరిధిలో 7 అసెంబ్లీ నియోజక వర్గాలున్నాయి. స్టేషన్ ఘన్ పూర్, పాలకుర్తి, పరకాల, వరంగల్ తూర్పు, వరంగల్ పశ్చిమ, వర్దన్నపేట, భూపాలపల్లి ఉన్నాయి. 2013లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఈ 7 నియోజక వర్గాల్లో 6 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాదించగా, ఒక స్థానంలో బిఆర్ఎస్ గెలుపొందింది. మెత్తంగా 7 నియోజక వర్గాల్లో పోలైన ఓట్లను పరిశీలిస్తే కాంగ్రెస్ కు 6 లక్షల 63 వేల 556 ఓట్లు రాగా, బిఆర్ఎస్ కు 5 లక్షల 3వేల 298, బిజేపికి లక్షా 56 వేల 638 ఓట్లు మాత్రమే వచ్చాయి. గత 2019 పార్లమెంట్ ఎన్నికల్లో 3 లక్షలకు పైగా మెజారిటీ సాదించిన బిఆర్ఎస్, ప్రస్తుతం మాత్రం వాటిని కాపాడుకోలేక పోయింది. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ దే పైచేయిగా నిలిచిందని చెప్పవచ్చు. ఇదే కాంగ్రెస్ లో టికెట్ కాంక్షించే వారి సంఖ్య తీవ్రమయిందుకు కారణం.
వరంగల్ పార్లమెంట్(SC)
మొత్తం ఓటర్ల సంఖ్య- 15,37,781అసెంబ్లీ విన్నర్ -2023 | BRS | BJP | CONGRESS |
స్టేషన్ ఘన్ పూర్ - కడియం శ్రీహరి (BRS) | 1,01,696 | 4,984 | 93,917 |
పాలకుర్తి - యశస్విని రెడ్డి (CONGRESS) | 79,214 | 2,982 | 1,26,848 |
వరంగల్ పశ్చిమ - రాజేందర్ రెడ్డి (CONGRESS) | 57,318 | 30,826 | 72,649 |
వరంగల్ తూర్పు - కొండా సురేఖ (CONGRESS) | 42,783 | 52,105 | 67,757 |
పరకాల - ప్రకాశ్ రెడ్డి (CONGRESS) | 64,632 | 38,735 | 72,573 |
వర్ధన్నపేట - నాగరాజు (CONGRESS) | 87,238 | 12,275 | 1,06,696 |
భూపాలపల్లి - సత్యనారాయణ రావు | 70,417 | 14,731 | 1,23,116 |
ఏదిఏమైనా అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కు అనుకూలంగా ఇచ్చిన తీర్పును ఓటర్లు కంటిన్యూ చేస్తారా, లేదా విలక్షణమైన తీర్పు ఇస్తారా అనేది వేచి చూడాలి...