చోటే భాయ్ ను బడే భాయ్ ఎందుకు కాపాడుతున్నట్టు: కెటిఆర్ ట్వీట్

ఎస్ ఎల్ బిసీ సొరంగమార్గం కూలిపోవడానికి కారణాలను అన్వేషిస్తాం;

Update: 2025-09-14 12:59 GMT

ఎస్ఎల్ బిసి(SLBC)సొరంగం ఘటన జరిగి 200 రోజులు గడుస్తున్నా కేంద్రం ఇంతవరకు ఎందుకు స్పందించడం లేదని బిఆర్ఎస్ BRS ప్రెసిడెంట్ కెటిఆర్ KTRఅన్నారు. ఎక్స్ వేదికగా ఆయన చేసిన ట్వీట్ తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. కాళేశ్వరం  kaleshwaram     ప్రాజెక్టులో వచ్చిన చిన్న సమస్యకే కేంద్రం నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ బృందాన్ని ఆఘమేఘాల మీద పంపించిందని కెటిఆర్ గుర్తు చేశారు. కేంద్రం ఇంత వరకు ఒక బృందాన్ని సైతం పంపించలేకపోయిందని కెటిఆర్ దుయ్యబట్టారు. బిజెపి బడే భాయ్ తెలంగాణలో చోటే భాయ్ ను ఎందుకు కాపాడుతున్నట్టు అని కెటిఆర్ ప్రశ్నించారు. ఎస్ ఎల్ బిసీ ఘటనలో కాంగ్రెస్ Congressప్రభుత్వం  ఆరు మృత దేహాలను కూడా వెలికి తీయలేకపోయిందని ఆయన విమర్శించారు. బాధితులకు ఇంత వరకు నష్ట పరిహారం కూడా ఇవ్వలేకపోయిందని ఆయన పేర్కొన్నారు.

బిఆర్ఎస్ మళ్లీ అధికారంలో వచ్చిన రోజున ఎస్ ఎల్ బిసీ ఘటనలో చనిపోయిన ఆరుగురి కుటుంబాలకు న్యాయం చేస్తామని, ఎస్ఎల్ బిసీ ప్రమాదానికి బాధ్యులైన వారికి శిక్షలు పడేట్టు చేస్తామని ఆయన హెచ్చరించారు. కాంగ్రెస్ విధ్వంసం చేసిన ప్రతీ దానితో బాటు ఎస్ ఎల్ బిసి సొరంగం కూలిపోవడానికి గల కారణాలను అన్వేషిస్తామని కెటిఆర్ తన ట్వీట్ లో పేర్కొన్నారు.

రేవంత్ ప్రభుత్వంలో ..

ఎస్‌ఎల్‌బీసీ సొరంగం మార్గంలో జరిగిన ప్రమాదంతో ఈ ప్రాజెక్టు ఒక్కసారిగా వార్తల్లో ఎక్కింది. ఈ ప్రమాదంలో ఆరుగురు చిక్కుకుపోయారు. వారిని రక్షించేందుకు రెస్క్యూ ఆపరేషన్‌ సుదీర్ఘంగా కొనసాగినప్పటికీ ఫలితం లేకపోయింది. అయితే ఈ ప్రాజెక్టును ఎందుకు చేపట్టారు, అసలు ఉద్దేశం ఏమిటి, పనులు ఎప్పుడు ప్రారంభమయ్యాయి, పనులు పూర్తయితే ఎవరికి లాభం చేకూరుతుంది వంటి విషయాలు ఆసక్తికరంగా మారాయి.

ఉమ్మడి నల్లగొండ జిల్లాలో సాగునీరు, ఫ్లోరైడ్ ఫీడిత గ్రామాలకు తాగునీటిని అందించేందుకు ఎస్ఎల్బీసీ సొరంగ మార్గం రూపకల్పనకు 1979 లోనే ఈ ప్రాజెక్టు పై పలు దఫాలు చర్చలు ప్రారంభమై 1982 జూలై 29న 480 కోట్ల రూపాయలతో సొరంగ మార్గం పనులకు అప్పటి ఉమ్మడి ఏపీ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. జీవో కూడా విడుదల చేసింది. కానీ సొరంగ మార్గం ఆలస్యం అవుతుందని ప్రభుత్వం ఉహించింది.

2005లో దివంగత సీఎం రాజశేఖర్ రెడ్డి హయంలో ఎస్ఎల్బీసీ సొరంగం మార్గం ప్రాజెక్టు మళ్లీ తెరపైకి వచ్చింది. 2008 కోట్ల అంచనా వ్యయంతో 2005 ఆగస్టు 11 పరిపాలన అనుమతులు లభించినప్పటికీ సొరంగ మార్గం డిజైన్ లోపం వల్ల సంక్లిష్టత నెలకొంది. శ్రీశైలం టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ మీదుగా భూమి ఉపరితలం నుంచి అర కిలోమీటర్ లోతులో ఈ సొరంగమార్గం ప్రతిపాదించింది వైఎస్ ప్రభుత్వం ఏకకాలంలో రెండు వైపులా రెండు టిబీఎం మిషన్ల ద్వారా ఈ సొరంగం పనులు వేగంగా ప్రారంభమయ్యాయి.

హెలికాప్టర్ ప్రమాదంలో వైఎస్ రాజశేఖరరెడ్డి చనిపోయిన తర్వాత తెలంగాణ ఉద్యమం ఊపందుకోవడంతో ముఖ్యమంత్రులుగా ఉన్న కొణిజేటి రోజశయ్య, కిరణ్ కుమార్ రెడ్డిలు ఈ ప్రాజెక్టుపై పెద్దగా ఆసక్తికనబరచలేదు. ప్రత్యేక తెలంగాణలో కెసీఆర్ ప్రభుత్వం ఎస్ఎల్ బిసీ పనులకు ఉత్సాహం ప్రదర్శించిం లేదు.

పదేళ్ల తర్వాత అధికారంలో వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఎస్ఎల్ బిసీ ప్రాజెక్టును ప్రతిష్టాత్మకంగా తీసుకుని పనులు ప్రారంభించగానే ప్రమాదం జరిగి ఆరుగురు సొరంగంలోనే ఇరుక్కుపోయారు.

Tags:    

Similar News