Congress MLC Jeevanreddy|జీవన్ రెడ్డికి కాంగ్రెస్ షాక్ తప్పదా ?

పీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్(PCC President Bomma Mahesh) జరిగిన ముఖ్యనేతల సమావేశంలో కూడా జీవన్నే అభ్యర్ధిగా డిసైడ్ చేశారు.;

Update: 2025-01-12 04:30 GMT
Congress MLC Jeevan Reddy

కాంగ్రెస్ సీనియర్ నేత, సిట్టింగ్ ఎంఎల్సీ జీవన్ రెడ్డికి షాక్ తప్పేట్లులేదు. నిజామాబాద్ గ్రాడ్యుయేట్ ఎంఎల్సీ ఎన్నికలు తొందరలోనే జరగబోతున్నాయి. నిజామాబాద్ గ్రాడ్యుయేట్ నియోజకవర్గం అంటే కరీంనగర్, మెదక్, ఆదిలాబాద్ జిల్లాల్లోని గ్రాడ్యుయేట్లు ఓటర్లుగా ఉంటారు. మార్చి 29వ తేదీతో జీవన్ రెడ్డి(Jeevan Reddy) పదవీకాలం ముగుస్తుంది. అందుకనే ఈలొపే ఎన్నికలుజరగాలని కేంద్ర ఎన్నికలకమీషన్ నిర్ణయించింది. ఈమేరకు నోటిఫికేషన్ కూడా విడుదలచేసింది. ప్రతిపక్షపార్టీలు తమఅభ్యర్ధులను రెడీచేసుకుంటున్నాయి. ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్ పార్టీ తరపున ఎలాగూ సిట్టింగే కాబట్టి జీవనే పోటీచేస్తారని అందరూ అనుకున్నారు. ఈమధ్యనే గాంధీభవన్లో(Gandhi Bhavan) పీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్(PCC President Bomma Mahesh) జరిగిన ముఖ్యనేతల సమావేశంలో కూడా జీవన్నే అభ్యర్ధిగా డిసైడ్ చేశారు. ఈ మేరకు ప్రతిపాదనను పార్టీ అధిష్టానానికి పంపారు కుడా.

అయితే చివరినిముషంలో తెరవెనుక ఏమిజరిగిందో ఏమోకాని సడెన్ గా ఇపుడు జీవన్ రెడ్డి స్ధానంలో కొత్త అభ్యర్ధిని పార్టీ పరిశీలిస్తున్నట్లు ప్రచారం పెరిగిపోతోంది. జీవన్ దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీ(Congress Party)లోనే కంటిన్యు అవుతున్నారు. గతంలో ఎంఎల్ఏగా, మంత్రిగా కూడా పనిచేశారు. ఎంపీగా కేసీఆర్(KCR) కు వ్యతిరేకంగా కరీంనగర్ పార్లమెంటుస్ధానంలో పోటీచేసి కొద్దిపాటి తేడాతో ఓడిపోయారు. పార్టీపట్ల నిబద్ధత కలిగిన గుర్తింపున్న జీవన్ ప్లేసులో కొత్త అభ్యర్ధిని వెతుకుతున్నారన్న ప్రచారం చాలా ఆశ్చర్యంగా ఉంది. ఇపుడున్న రాజకీయ పరిస్ధితుల్లో సీటులో గెలవటం కాంగ్రెస్ కు చాలా ప్రతిష్టాత్మకమని అందరికీ తెలిసిందే. జీవన్ పార్టీలోనే కాకుండా కరీంనగర్ తో పాటు ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ జిల్లాల్లో కూడా బాగా పాపులర్.

అలాంటి జీవన్ ప్లేసులో పార్టీ కొత్తఅభ్యర్ధిని వెతకాలని ఆలోచించటం వెనుక కారణం ఏమిటంటే ఆర్ధికకోణమే అని పార్టీవర్గాల సమాచారం. ఆర్ధికంగా జీవన్ గొప్పస్ధితిలో లేరని తెలుస్తోంది. గ్రాడ్యుయేట్ల ఓట్లు తక్కువగానే ఉంటాయి కాని నాలుగుజిల్లాల్లో ఓటర్లను పార్టీవైపు ఆకర్షించాలంటే చాలాడబ్బులు ఖర్చవుతాయి. భారీమొత్తంలో అవబోయే ఖర్చును సిట్టింగ్ ఎంఎల్సీ పెట్టుకోలేరని పీసీసీ అనుమానిస్తోంది. అందుకనే జీవన్ ప్లేసులో ఆల్ఫోన్స్ విద్యాసంస్ధల అధినేత నరేందర్ రెడ్డి, పార్టీలో సీనియర్ నేతలు ప్రసన్నహరికృష్ణ, వెల్చాల రాజేందర్ రావు, మాజీ డీఎస్పీ గంగాధర్ పేర్లు పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. అభ్యర్ధి ఎవరైనా వారంలోనే పార్టీ అధిష్టానం ఖరారుచేసి ప్రకటించే అవకాశాలున్నాయి.


పైనచెప్పిన వారిలో వెల్చాల రాజేందర్ ఈమధ్యనే కరీంనగర్ పార్లమెంటు అభ్యర్ధిగా పోటీచేసి ఓడిపోయారు. అలాగే అల్ఫోన్స్ విద్యాసంస్ధల అధినేత నరేందర్ రెడ్డి ఆర్ధికంగా బాగాపటిష్టంగా ఉన్నట్లు పార్టీవర్గాల టాక్. ఇక్కడే చిన్న మెలిక ఉంది. అదేమిటంటే రేవంత్ రెడ్డి(Revanth) గట్టిగా తలచుకుంటే జీవన్ రెడ్డి పోటీకి ఆర్ధిక అంశం అన్నది పెద్దసమస్యకాబోదు. మరి రేవంత్ మనసులో ఏముందో తెలీదు. అందుకనే పైనాలుగు జిల్లాల్లోని పార్టీ సీనియర్ నేతల అభిప్రాయాలను పార్టీ తీసుకుంటోంది. ఎందుకంటే అభ్యర్ధి ఎంపికలో సీనియర్ల అభిప్రాయాలు కూడా ముఖ్యమే. మరి పార్టీఅధిష్టానం ఎవరిపేరును ప్రకటిస్తుందో చూడాలి.

Tags:    

Similar News