పవన్ కల్యాణ్‌పై బండి సంజయ్ సెటైర్లు
అల్లు అర్జున్ ఎపిసోడ్‌పై స్పందించిన ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. తెలంగాణ సీఎం రేవంత్‌ను కొనియాడారు.;
బన్నీ విషయంలో రేవంత్ చేసింది కరెక్టేనన్నారు. ఒక సీఎం హోదాలో రేవంత్ స్పందించారని, లేకుంటే ప్రజలు విమర్శించి ఉండేవారని పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు. ఇన్నాళ్లూ ఈ అంశంపై మౌనంగా ఉన్న పవన్.. సోమవారం చేసిన వ్యాఖ్యలు రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా అల్లు అర్జున్ ఎపిసోడ్‌పై స్పందించిన ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. తెలంగాణ సీఎం రేవంత్‌ను కొనియాడారు. మారాయి. తాజాగా వీటిపై కేంద్రమంత్రి, తెలంగాణ బీజేపీ నేత బండి సంజయ్ ఘాటుగా స్పందించారు. పవన్ కల్యాణ్‌పై సెటైర్లు వేశారు. పవన్‌కు రేవంత్ రెడ్డిలో ఏం అంత మంచి కనిపించిందో అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. అల్లు అర్జున్‌కు, రేవంత్‌కు ఎక్కడో ఏదో విషయంలో చెడిందని, అందుకే రేవంత్.. పుష్ప-3 చూపించారంటూ విమర్శలు చేశారు. ఇచ్చిర ఆరు గ్యారెంటీలను అటకెక్కించినందుకు, నెలకు రూ.2500 ఇస్తామని నమ్మించి మహిళలను మోసం చేసిందుకు రేవంత్ రెడ్డి నచ్చారేమో పవన్‌కు అంటూ ఎద్దేవా చేశారు.
‘‘తెలంగాణలో రేవంత్ రెడ్డి సర్కార్ ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో క్రైమ్ రేట్ పెరిగింది. మహిళలకు భద్రత కరువైంది. అత్యాచార ఘటనల సంఖ్య గణనీయంగా పెరిగింది. రాష్ట్రంలో కమీషన్ల దందా జోరుగా సాగుతోంది. ఏ పని చేయాలన్నా కాంగ్రెస్‌కు 8 నుంచి 14శాతం కమిషన్ ఇవ్వాలి. ఓ ముగ్గురు మంత్రులు విచ్చలవిడిగా కమిషన్ల దందా నడిపిస్తున్నారు. ఆ అంశంపై విచారణ జరుగుతోంది. అతి త్వరలోనే సదరు మంత్రుల పేర్లు బయటపెడతాం. కమీషన్ల విషయంలో కాంగ్రెస్ మంత్రుల మధ్యా అంతర్యుద్ధం సాగుతోంది. ఆ విభేదాలు త్వరలోనే బయటపడతాయి’’ అని బండి సంజయ్ సంచలన ఆరోపణలు చేశారు.
పవన్ ఏమన్నారంటే..
‘‘చట్టం అందరికీ సమానమే. ఇలాంటి సంఘటనల్లో పోలీసులను తప్పుపట్టను. అల్లు అర్జున్, ఆయన టీమ్ గోటితో పోయే దానిని గొడ్డలి దాకా తెచ్చుకున్నారు. తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మరణించడం నన్ను తీవ్రంగా కలచి వేసింది. బాధిత కుటంబాన్ని అల్లు అర్జున్ కానీ, ఆయన తరపున ఎవరో ఒకరు ముందుగానే వెళ్లి పరామర్శించి ఉంటే చాలా బాగుండేది. బాధిత కుటుంబానికి తాము అండగా ఉంటామని భరోసా ఇచ్చి ఉంటో బాగుండేది. తమ ప్రమేయం లేకుండా తప్పు జరిగి పోయిందని విచారం వ్యక్తం చేసుంటే బాగుండేది. అల్లు అర్జున్ మొత్తం ఎపిసోడ్లో మానవత్వ దృక్పథం లోపించిందన్నారు. సంఘటన జరిగిన తర్వాత రేవతి కుటంబాన్ని పరామర్శించి, భరోసా ఇవ్వక పోవడం వల్లే ప్రజల్లో ఆగ్రహం వచ్చింది. అల్లు అర్జున్ ఎపిసోడ్లో ముందు వెనుక ఏమి జరిగిందో తెలియదు. కానీ తన వల్లే ఒకరు చనిపోయారనే వేదన అల్లు అర్జున్‌లో ఉంది. భద్రత గురించి ఆలోచించే చిరంజీవి ముసుగేసుకొని తన సినిమాలను చూసే వారు. నేను కూడా నా సినిమాలను అలానే చూశాను. సినిమా అంటే ఒక టీమ్, అందరి భాగస్వామ్యం ఉండాలి, కానీ ఇక్కడ అల్లు అర్జున్ ఒక్కడినే దోషిగా మార్చారు. ఇది కరెక్టు కాదు’’ అని పవన్ కల్యాణ్ తన అభిప్రాయం వ్యక్తం చేశారు.