డాక్టర్‌కు చిక్కులు తెచ్చిన డేటింగ్ యాప్..
ఓయో రూమ్‌లో కలిసిన తర్వాత నుంచి డబ్బులు ఇవ్వాలని బ్లాక్‌మెయిల్ చేస్తున్న యువకుడు.
ఓ యువకుడు తనను బ్లాక్‌మెయిల్ చేస్తున్నాడంటూ ఓ డాక్టర్.. మాదాపూర్ పోలీసులను ఆశ్రయించారు. డాక్టర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటన ప్రస్తుతం స్థానికంగా హాట్ టాపిక్‌గా మారింది. అసలేమైందంటే.. మాదాపూర్‌లోని ఓ ఆసుపత్రిలో డాక్టర్‌గా పనిచేస్తున్న వ్యక్తి.. గే డేటింగ్ యాప్ ‘గ్రైండర్’లో ఓ యువకుడితో చాటింగ్ చేశాడు. కొన్ని రోజులు చాటింగ్ చేసుకున్న వారు కలుసుకోవాలని అనుకున్నారు. ప్లాన్ ప్రకారం ఓయో రూమ్ బుక్ చేసుకున్నారు. రూమ్‌కి వెళ్లిన తర్వాత వైద్యుడిపై రెండో యువకుడు అత్యాచారానికి ప్రయత్నించాడు. అందుకు నిరాకరించిన వైద్యుడు.. రెండో యువకుడిపై వాగ్వాదానికి దిగాడు. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన నిందితుడు.. డాక్టర్‌ను బ్లాక్ మెయిల్ చేయడం ప్రారంభించాడు.
తాము ఓయో రూమ్‌లో ప్రైవేట్‌గా కలుసుకున్న సంగతి.. వైద్యుడి ఇంట్లో చెప్తానని బెదిరించాడు. చేసేదేమీ లేక ఆ యువకుడికి వైద్యుడు రూ.5వేల ఇచ్చి.. అక్కడి నుంచి వెళ్లిపోయాడు. అయితే యువకుడు వైద్యుడిని వదలలేదు. వెంబడించి.. డాక్టర్ పనిచేసే ఆసుపత్రి తెలుసుకున్నారు. అక్కడకు కూడా వెళ్లి రచ్చరచ్చ చేశాడు యువకుడు. దీంతో ఏం చేయాలో అర్థంకాక వైద్యుడు.. పోలీసులను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు. అంతేకాకుండా ప్రతి ఒక్కరూ కూడా ఇటువంటి డేటింగ్ యాప్‌ల ద్వారా జరిగే మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.