‘‘ముఖ్యమైన ప్రాజెక్ట్ లకు కేంద్రం నిధులు ఇవ్వడం లేదు‘‘

కేంద్ర ప్రభుత్వంపై మరోసారి విమర్శలు చేసిన ముఖ్యమంత్రి సిద్ధరామయ్య;

Translated by :  Chepyala Praveen
Update: 2025-05-15 09:40 GMT
కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య

కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు అదనపు నిధులు ఇవ్వకపోవడం పక్కన పెడితే బడ్జెట్ లో ప్రకటించిన గ్రాంట్లను సైతం విడుదల చేయడం లేదని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య విమర్శలు చేశారు. భద్ర ఆనకట్ట ప్రాజెక్ట్ నిధులు, పేదలు, వృద్దులు పెన్షన్లు, ఎంజీఎన్ఆర్ఎన్జీఎస్ పథకాల వంటి నిధులు రాష్ట్రానికి రావడం లేదని అన్నారు.

జిల్లా అభివృద్ది సమన్వయ, పర్యవేక్షణ కమిటీల పనితీరుపై సమీక్షా సమావేశానికి  సిద్ధరామయ్య అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడారు. కేంద్రం వాటాను రాష్ట్రానికి తీసుకురావడానికి కృషి చేయాలని కమిటీ సభ్యులకు సూచించారు.
భద్ర అప్పర్ రివర్ ప్రాజెక్ట్ కు రూ. 5,300 కోట్లు ఇస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్ బడ్జెట్ లో ప్రకటించారని, కానీ ఇప్పటి వరకూ రాష్ట్రానికి ఒక్క రూపాయి కూడా రాలేదని సిద్ధరామయ్య చెప్పారు.
ఎగువ భద్ర ప్రాజెక్ట్ చిక్కమగళూర్, చిత్రదుర్గ, దావణగెరె, తుమకూరు జిల్లాలో సుమారు 2.25 లక్షల హెక్టార్లకు సాగునీరు అందించాలని లక్ష్యంగా పెట్టుకుంది.ఇందుకోసం 19 టీఎంసీలతో ప్రాజెక్ట్ నిర్మించబోతున్నారు. అలాగే అదనంగా పది టీఎంసీలతో వాణి విలాస్ రిజర్వాయర్ సామర్థ్యాన్ని పెంచడానికి ప్రణాళికలు వేశారు.
15 వ ఆర్థిక సంఘం ఈ ప్రాజెక్ట్ కు కేంద్రం ప్రత్యేకంగా రూ. 5,495 కోట్లు అందించాలని చెప్పంది. ఇందులో సరస్సు ఫెరిఫెరల్ రింగ్ రోడ్డు కోసం కలిపి మొత్తం 11,495 కోట్లు అవసరమని తేలింది. కానీ ఇప్పటి వరకూ రాష్ట్రానికి నిధులు రాలేదని సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు.
మన రాష్ట్రం నుంచి రూ. 4.5 లక్షల కోట్ల పన్నులు చెల్లిస్తున్నాం. కేంద్రం నుంచి రాష్ట్రానికి కొద్ది మొత్తంలో సాయం కూడా రావట్లేదు. కేంద్ర నిధులతో కూడిన ప్రాజెక్ట్ లకు వారు డబ్బుల ఇవ్వరు. కానీ రాష్ట్ర ప్రభుత్వం అభివృద్దికి డబ్బు లేదని మీరు(బీజేపీ) ఆరోపిస్తారని ముఖ్యమంత్రి అన్నారు.
సామాజిక భద్రతా పథకంలోని వితంతు పెన్షన్, వికలాంగుల పెన్షన్ పథకాలకు రాష్ట్ర గ్రాంట్ రూ. 5,666. 95 కోట్లు కాగా, కేంద్ర గ్రాంట్ రూ. 559.61 కోట్లు కానీ కేంద్రం ఇప్పటి వరకూ కేవలం 113. 92 కోట్లు మాత్రమే విడుదల చేసిందని సీఎం అన్నారు.
సామాజిక ప్రథకాలకు ఇచ్చే గ్రాంట్లలో కూడా కేంద్రం కోత పెడితే ఎలా నిర్వహించాలని ఆయన ప్రశ్నించారు. తాను సీతారామన్ ను రెండుసార్లు కలిశానని, నిధుల కోసం కూడా అభ్యర్థన చేశానని, కానీ దానిని ఆమె పట్టించుకోలేదని ఆయన పేర్కొన్నారు.
కర్ణాటక కు చెందిన బీజేపీ ఎంపీలు మౌనంగా ఉండటంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘మీరు కలిసి నిర్ణీత సమయంలోగా గ్రాంట్లను విడుదల చేయడానికి ప్రయత్నించాలి. మీ బాధ్యత నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నించకూడదు’’ అని సీఎం తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు.
రెండు సంవత్సరాలుగా రాని నిధులు..
కేంద్ర ప్రభుత్వం రెండేళ్లుగా సామాజిక భద్రతకు సంబంధించిన నిధులను పెండింగ్ లో పెట్టిందని ఆయన చెప్పారు. ఇంత చిన్న మొత్తం కూడా కేంద్రం ఎందుకు నిధులు ఇవ్వడం లేదని ప్రశ్నించారు.
రాష్ట్ర ప్రజలు సమకూర్చే చాలా ప్రాజెక్ట్ లపై ప్రధాని, కేంద్రం పేర్లు ఉన్నాయని అయినప్పటికీ తమకు రావాల్సిన నిధులు కొంచెం కూడా రావడం లేదని అన్నారు. ఎంపీలు ఎందుకు దీనిపై ప్రశ్నించకూడదని అన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం తరఫున కేంద్రానికి, కేంద్ర మంత్రులు, ప్రధానికి రాసిన లేఖల వివరాలను ఆయన ఈ సందర్భంగా ఆయన విడుదల చేశారు. ఆ లేఖల్లోని పలు అంశాలను ఆయన చదివి వినిపించారు.
ఎంజీఎన్ఆర్ఈజీఎస్ నిధులు..
మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి హమీ పథకం కింద నిధులు రావడం లేదని అధికారులు సిద్దరామయ్య దృష్టికి తీసుకెళ్లారు. పెండింగ్ లో ఉన్న వివిధ రకాల కేంద్ర పెన్షన్ నిధుల గురించి కూడా వారు సమావేశానికి తెలియజేశారు.
ఈ పథకానికి సంబంధించి కార్యాచరణ ప్రణాళికను మూడు నెలల్లోగా రూపొందించాలని సిద్దరామయ్య అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో ఈ పథకంలో అక్రమాలకు పాల్పడిన అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, క్రిమినల్ కేసు నమోదు చేయాలని సిద్దరామయ్య వారిని ఆదేశించారు.
గత ఆర్థిక సంవత్సరంలో కేంద్ర పథకాల కింద కేంద్రం వాటా రూ. 22,758 కోట్లని అందులో కేంద్రం రూ. 18,561 కోట్లు మాత్రమే విడుదల చేసిందని, ఇంకా రూ. 4,195 కోట్లు ఇంకా పెండింగ్ లో ఉన్నాయని సీఎంఓ తెలిపింది. జల్ జీవన మిషన్ కింద 2023 -24 లో రూ. 7,656 కోట్లు, 2024-25 లో రూ. 3,233 కోట్లు కేంద్రం విడుదల చేయలేదని కూడా అధికారులు తెలిపారు.
ఇంతకుముందు 2024 నాటికే దేశంలోని గ్రామీణ ప్రాంతాలలో జల్ జీవన్ మిషన్ కింద సురక్షిత మంచినీటిని అందించాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకోగా ప్రస్తుతం దానిని 2028 కి సవరించారు.
తరువాత విలేకరులతో మాట్లాడిన సిద్ధరామయ్య .. 67 కేంద్ర ప్రాయోజిత పథకాలకు కేంద్రం, రాష్ట్రప్రభుత్వం రెండింటి నుంచి విరాళాలు ఉంటాయని అన్నారు. కేంద్ర గ్రాంట్లు సాధారణంగా ఆర్థిక సంవత్సరం చివరలో విడుదల చేస్తారని చెప్పారు. కేంద్రం ప్రతీకార రాజకీయాలను పాల్పడుతున్నారా? అని ప్రశ్నించగా తాను వాటిపై వ్యాఖ్యానించనని సీఎం అన్నారు.
Tags:    

Similar News