కన్నడ గురించి కమల్ కు ఏం తెలుసు: కర్ణాటక ముఖ్యమంత్రి

తమిళం నుంచి కన్నడ పుట్టిందని వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన నటుడు కమల్ హసన్;

Update: 2025-05-28 11:56 GMT
కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, నటుడు కమల్ హసన్

తమిళ నటుడు కమల్ హసన్ కన్నడ భాష గురించి చేసిన వ్యాఖ్యలపై కర్ణాటక సీఎం సిద్దరామయ్య స్పందించారు. కన్నడ, తమిళం నుంచి పుట్టిందనే వ్యాఖ్యలను ఆయన కౌంటర్ ఇచ్చారు.

కన్నడ రాష్ట్ర భాష, గొప్ప చరిత్ర గురించి కమల్ హసన్ కు తెలియలేదని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య బుధవారం పరోక్షంగా విమర్శలు గుప్పించారు. ముఖ్యమంత్రి విలేకరులతో మాట్లాడుతూ.. ‘‘కన్నడకు సుదీర్ఘ చరిత్ర ఉంది. పాపం కమల్ కు దానికి గురించి తెలియదు’’ అన్నారు.

బీజేపీ విమర్శలు..
కర్ణాటక అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు ఆర్. అశోక ఈ వివాదాస్పద నటుడిపై తీవ్ర విమర్శలు గుప్పించారు. కర్ణాటకలో కమల్ హసన్ సినిమాలన్నింటిని బహిష్కరించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.
‘‘కర్ణాటకలో కమల్ హాసన్ సినిమాలన్నింటిని బహిష్కరించాలని నేను ప్రభుత్వాన్ని కోరుతున్నాను. లేకుంటే అతను మానసిక రోగిలా ప్రవర్తిస్తూనే ఉంటాడు’’ అని అశోక అన్నారు.
‘‘కన్నడ భాషకు మళ్లీ ఇబ్బంది రావద్దని కమల్ హసన్ ను హెచ్చరించడానికి ముఖ్యమంత్రి సిద్దరామయ్య, ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్, రాహుల్ గాంధీ, స్టాలిన్ లను ఉపయోగించుకోగలరా? లేదా కర్ణాటక కాంగ్రెస్ పార్టీకి కన్నడ కంటే హై కమాండ్ భక్తి, రాజకీయ పొత్తు ముఖ్యమా? ’’ అని ఆయన ఎక్స్ లో పోస్ట్ చేశారు.
‘‘కన్నడ, తమిళ భాష నుంచి పుట్టింది’’ అనే అర్థరహిత మాటలతో ఆరున్నర కోట్ల మంది కన్నడిగుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసిన కమల్ హసన్, రాహుల్ గాంధీ, అతని స్నేహితుడు, తమిళనాడు ముఖ్యమంత్రి శ్రీ స్టాలిన్ ముఖ్య స్నేహితులు’’ అని పోస్ట్ లో పేర్కొన్నారు.
బేషరతుగా క్షమాపణ చెప్పాలి
కర్ణాటక బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బివై విజయేంద్ర కూడా కమల్ వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కమల్ హసన్ తన సొంత మాతృభాషను కీర్తించుకునే ప్రయత్నంలో కన్నడ భాషను అగౌరవపరిచారన్నారు.
కమల్ వ్యాఖ్యలను ఆయన అహాంకారపూరితమైనవిగా అభివర్ణించారు. తమిళనటుడు బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కమల్ హసన్ ను సంకుచిత మనస్తత్వం కలిగిన వ్యక్తిగా విమర్శించాడు.
శతాబ్దాలుగా భారత్ లో సహ ప్రపంచంలోని అనేక ప్రాంతాలలో కన్నడ భాష ప్రముఖ స్థానం ఆక్రమించిందన్నారు. కన్నడను అవమానించే ముందు కన్నడ చిత్రాలలో కూడా నటించిన ఆయన కన్నడ ప్రజల దాతృత్వాన్ని మరిచిపోయి, తన కృతజ్ఞత లేని వ్యక్తిగా తన బుద్దిని బయటపెట్టుకున్నారని అన్నారు.
‘‘దక్షిణ భారతదేశ సామరస్యాన్ని తీసుకురావాల్సిన కమల్ హసన్ గత కొన్ని సంవత్సరాలుగా హిందూ మతాన్ని అవమానిస్తూ, మతపరమైన మనోభావాలను దెబ్బతీస్తునే ఉన్నాడు.
ఇప్పుడు 6.5 కోట్ల కన్నడిగుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసి కన్నడను అవమానించాడు. కమల్ హసన్ వెంటనే కన్నడిగులకు బేషరుతుగా క్షమాపణ చెప్పాలి’’ అని ఎక్స్ పై సుదీర్ఘమైన పోస్ట్ లో విజయేంద్ర అన్నారు.
తమిళిసై ఏమన్నారు..
తమిళనాడు బీజేపీ నాయకురాలు, తెలంగాణ మాజీ గవర్నర్ తమిళి సై సౌందరరాజన్ కూడా ఈ నటుడిని విమర్శించారు. భాషల గురించి మన అభిప్రాయాలు వ్యక్తం చేసే సమయంలో జాగ్రత్తగా ఉండాలన్నారు.
మనం వివాదాస్పదంగా కాకుండా నిర్మాణాత్మకంగా ఉండాలి. కమల్ హసన్ డీఎంకే సంతృప్తి పరచడానికి ఇతర భాషలను విమర్శిస్తాడు’’ అని అన్నారు.
కమల్ వ్యాఖ్యలపై కన్నడిగుల ఆగ్రహం
కన్నడిగులను ఆదరించే వర్గాల నుంచి కూడా హసన్ తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నాడు. కర్ణాటక రక్షణ వేదిక అధ్యక్షుడు ప్రవీణ్ శెట్టి మాట్లాడుతూ.. తన సినిమాలు కర్ణాటకలో ప్రదర్శించబడాలని కోరుకుంటే, కన్నడ, కన్నడిగులను అవమానించడం మానేయాలి హెచ్చరించింది.
‘‘ఈ రోజు మనం అతనికి గట్టి హెచ్చరిక జారీ చేస్తున్నాము’’ మీరు కర్ణాటకలో వ్యాపారం చేసి మీ సినిమాలు ప్రదర్శించాలనుకుంటే కన్నడ, కన్నడిగులను అవమానించడం మానేయండి.
మీరు ఒక సినిమాను ప్రమోట్ చేయడానికి ఇక్కడ ఉన్నారు. కానీ కర్ణాటక రక్షణ వేదిక మీ ముఖానికి నలుపురంగు పూయాలని వచ్చే సమాయానికే మీరు పారిపోయారని అన్నారు.
మీడియా నివేదికల ప్రకారం.. చెన్నైలో జరిగిన తన రాబోయే చిత్రం థగ్ లైఫ్ ఆడియో విడుదల కార్యక్రమంలో కమల్ హసన్ మాట్లాడుతూ.. తన సహనటుడు కన్నడ రాజ్ కుమార్ తో మీరు వేరే రాష్ట్రంలో నివసిస్తున్న నా కుటుంబం మీ భాష తమిళం నుంచి పుట్టింది. కాబట్టి మీరు కూడా ఆ వరుసలో చేరారు’’ అని కమల్ చెప్పడంతో వివాదం ప్రారంభం అయింది.
Tags:    

Similar News