మోదీ ‘రామాయణ యాత్ర’ దక్షిణాదిలో ఏం ప్రయోజనం ?

శ్రీరాముడి పేరుతో ఉత్తరాది నుంచి దక్షిణాదికి ప్రధాని చేసిన యాత్ర ఓటర్లను తనవైపు తిప్పుకుంటుందా? మోడీపై ఉన్న వ్యతిరేకత ఏదైనా ఉంటే అది బయటపడకుండా ఉంటుందా?

Update: 2024-01-22 07:33 GMT

దేశవ్యాప్తంగా అయోధ్య ఉత్సవాల విషయమే మాట్లాడుతున్నారు. రామ్ లల్లా ప్రాణప్రతిష్ట కంటే ముందు ప్రధాని నరేంద్ర మోడీ, రామాయణం లో శ్రీరాముడు తిరిగిన ప్రదేశాలను సందర్శించారు. జనవరి 12 ప్రధాని నరేంద్ర మోడీ గోదావరీలోని పంచవటి తీరం నుంచి ఈ యాత్ర ప్రారంభించారు.

తరువాత వరుసగా ఆంధ్రప్రదేశ్ లోని లేపాక్షి, కేరళలోని త్రిపయర్, తరువాత తమిళనాడులోని శ్రీరంగం, రామేశ్వరంలోని ధనుష్కోడీ వెళ్లారు. అక్కడ 22 పుణ్యస్నానాలు, ప్రార్థనలు చేసి అనంతరం అయోధ్య బయలుదేరారు. అ పదకొండు రోజులు ప్రధాని కేవలం కఠిన ఉపవాసం, నేలపై శయనించారు.

ప్రధాని చేసిన ఈ యాత్రపై పలువురు తమ అభిప్రాయాలు వ్యక్తం చేశారు. కొందరు ఈ యాత్ర దక్షిణాదిలో హిందూ చైతన్యం కలిగించేందుకు చేశారని, వచ్చే లోక్ సభ ఎన్నికలకు ఇది ఉపయోగపడుతుందని వ్యాఖ్యానిస్తున్నారు. మరికొంతమంది ఈ యాత్ర వల్ల బీజేపీకి ఏం లాభం లేదని అభిప్రాయపడుతున్నారు.

బీజేపీ తమిళనాడు యూనిట్ వైస్ ప్రెసిడెంట్, అధికార ప్రతినిధి నారాయణన్ తిరుపతి మాట్లాడుతూ " ప్రధాని మోడీ చేసిన ఈ యాత్ర రాజకీయాలకు సంబంధం లేదు. ఇదీ దేశాన్ని ఏకం చేయడానికి చేసిన యాత్ర మాత్రమే, రాముడికి దేశంతో ఉన్న అనుబంధాన్ని చూపడానికి ప్రధాని చేసిన ప్రయత్నం ఇది " అని ఆయన వివరించే ప్రయత్నం చేశారు.

ఇదీ దక్షిణాదిపై ఎలాంటి ప్రభావం చూపుతుంది అని ప్రశ్నించినప్పుడు " ప్రధానికి చాలా చోట్ల ఘన స్వాగతం లభించింది. ఆలయాలు శుభ్రం చేయడం, దీపాలు వెలిగించే కార్యక్రమాలు దేశమంతా ఆచరిస్తోంది. ఇప్పటికే అయోధ్య మొత్తం కిటకిటలాడుతోంది. దక్షిణాది నుంచి ముఖ్యంగా తమిళనాడు నుంచి అనేకమంది ఈ వేడుకల్లో పాల్గొంటున్నారు" అని ఆయన వివరించే ప్రయత్నం చేశారు.

మోదీ ప్రయాణించిన యాత్రపై సీనియర్ జర్నలిస్ట్ ఆర్ రంగరాజ్ పలు సందేహలు లేవనెత్తారు. ప్రధాని రాముడి పేరుతో రాజకీయాలు చేస్తున్నారని అన్నారు. ఇక్కడ జాతీయ ప్రయోజనాలు ఏమి లేవని, కేవలం దక్షిణాది రాజకీయ ప్రయోజనాలు మాత్రమే ఉన్నాయని అన్నారు.

దక్షిణ భారత దేశంలో రాముడు ఎక్కడా కూడా ప్రత్యక్షంగా దేవాలయాలను సందర్శించినట్లు చారిత్రక ఆధారాలు లేవన్నారు. ఈ యాత్ర ఉత్తర భారతంలో ఓట్లు రాల్చవచ్చు. కానీ దక్షిణ భారతంలో అదే స్థాయి ఫలితాలు ఇవ్వకపోవచ్చని అభిప్రాయపడ్డారు. అంతకుముందు తమిళనాడు విభాగం తలపెట్టిన వేల్ యాత్ర సరైన ఫలితాలు ఇవ్వకపోవడంతో ఆఖరి అస్త్రంగా దీనిని ప్రయోగించారని అభిప్రాయపడ్డారు. "

అలాగే తమిళనాడు ప్రజలు ఆది నుంచి శైవారాధనలో ఉన్నారని, ఇక్కడ రామ్ కార్డుతో ఎలాంటి ప్రయోజనాలు బీజేపీ ఆశించివద్దని అన్నారు. రామాలయ ప్రతిష్టాపనకు, తమిళనాడుకు నేరుగా ఎలాంటి సంబంధం లేదని అన్నారు. హిందూ చైతన్యం వేరు, ఓట్లు పొందడం వేరు అని ఆయన చెప్పారు.

తమిళనాడు ఓటు బ్యాంకు పై కన్నేసింది

ఫెడరలిజం, ద్రావిడ పార్టీల ఆధారంగా పరిశోధన చేసిన రీసెర్చ్ స్కాలర్ ‘ అలము’ ను ఫెడరల్ సంప్రదించింది. ఈ విషయం ఆమె అభిప్రాయాలను పంచుకున్నారు.

తమిళనాడులో బలంగా ఉన్న ద్రావిడ పార్టీల ఓటు బ్యాంకును చీల్చేందుకు ఈ యాత్రను ప్రధాని చేపట్టారని అభిప్రాయపడ్డారు. " తమిళనాడు సంప్రదించినప్పుడల్లా ఇక్కడ భాష, సంస్కృతులను ప్రశంసిస్తారు. కానీ ఆయనకు మాత్రం ఆశించిన మద్దతు రావట్లేదు, లోక్ సభ ఎన్నికల ముందు ఏకత్వం పేరుతో మతతత్వాన్ని వ్యాప్తి చేయడానికి వచ్చారు, ఇందుకు రాముడి పేరును వాడుకున్నారు " అని చెప్పారు.

" బ్రాహ్మణుల ప్రాబల్యం ఉన్న ప్రాంతాలలో మాత్రమే వారు బీజేపీకీ ఓటు వేయడానికి ప్రయత్నిస్తారు. కానీ అది కూడా కచ్చితంగా చెప్పలేము" అన్నారు. తమిళనాడులో అనేక ఏళ్లుగా బహుజనులు లబ్దిపొందుతున్నారు. ఫెడరలిజం గురించి లోతుగా అధ్యయనం చేసి తన ప్రయోజనాలను పొందుతున్న రాష్ట్రం ఇదీ. ఇక్కడ రావణుడిని బాధితుడుగా చూస్తారని అభిప్రాయం వ్యక్తం చేశారు. తమిళనాడు నుంచి ఆశించిన ఫలితాలు బీజేపీకీ రావని అన్నారు.

Tags:    

Similar News