12వేల మంది ఉద్యోగులను తొలగించనున్న టీసీఎస్‌

2026 ఏప్రిల్‌ నుంచి ఉద్యోగుల ఉద్వాసన;

Update: 2025-07-27 14:06 GMT
TCS CEO K Krithivasan
Click the Play button to listen to article

ప్రముఖ ఐటీ దిగ్గజం టీసీఎస్‌ భారీగా ఉద్యోగాల కోతకు సిద్ధమవుతోంది. 2026 ఏప్రిల్‌ నుంచి తమ ఉద్యోగుల సంఖ్యలో 2శాతం.. అంటే 12వేల మందిని తొలగించనుంది. భారత్‌తో పాటు వివిధ దేశాల్లో ఉన్న బ్రాంచీల్లో మొత్తం 6.13 లక్షల మంది పనిచేస్తున్నారు. టెక్నాలజీలో వస్తున్న మార్పులకు అనుగుణంగా తమ సంస్థను తీర్చిదిద్దే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు టీసీఎస్‌ సీఈవో కె.కృతివాసన్‌ తెలిపారు. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, జనరేటివ్ ఏఐ, మారుతున్న క్లయింట్ల డిమాండ్ల నేపథ్యంలో ఉద్యోగులను తొలగించక తప్పడం లేదని పేర్కొ్న్నారు. అయితే లేఆఫ్ ఉద్యోగులకు ముందుగానే నోటీసులు ఇస్తున్నామని, వారికి బీమా పొడిగింపు, అవుట్‌ ప్లేస్‌మెంట్ సపోర్టు కూడా ఇస్తామని కంపెనీ హామీ ఇచ్చింది. కాగా TCS నిర్ణయాన్ని మిగతా ఐటీ సంస్థలు కూడా అనుసరించే అవకాశం ఉందని ఐటీ నిపుణులంటున్నారు. కంపెనీల అవసరాలకు అనుగుణంగా నైపుణ్యాలను మెరుగుపరుచుకున్న వారు మాత్రమే ఉద్యోగాల్లో కొనసాగుతారని వారు చెబుతున్నారు.

Tags:    

Similar News