కీలుగుర్రాలు తెలుసు, నీటి గుర్రాలు తెలుసు.. మరి ఈ గెలుపు గుర్రాలెవరు? ఎన్నికలొచ్చినప్పుడల్లా వినబడే మాటిది. మొన్నటి దాకా తెలంగాణలో వినపడిన ఈ పదం ఇప్పుడు ఆంధ్రాలో మార్మోగుతోంది. మొన్నీమధ్య మిగ్ జామ్ తుపాను వచ్చి రాష్ట్రమంతా అతలాకుతలమైంది. పరామర్శకు పోయిన చంద్రబాబును టీడీపీ నేతలు కలిశారట. కలిసినోళ్లు ఏదో పార్టీ వ్యవహారాలు మాట్లాడి రాక.. సార్, మా టికెట్లన్నారట. అంతే చంద్రబాబు ఇంతెత్తున ఎగిరిపడ్డారు. ముదురు బ్యాచీల్నీ, పొన్ను కర్ర బ్యాచీల్నీ పక్కన బెట్టి కోడెగిత్తల్ని తీసుకువస్తానన్నారు. వాళ్లు ఎవరయ్యా అంటే గెలుపు గుర్రాలన్నాడట. ఇప్పుడది రాష్ట్ర మంతటా చర్చనీయాంశమైంది. తెలుగుదేశం నాయకుల గుండెల్లో గుబులు రేకిత్తిస్తోంది.
టీడీపీ కసరత్తు ఎలా ఉందంటే...
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు గెలుపు గుర్రాల వేటలో ఉన్నారు. 2024 ఎన్నికల్లో గెలవకపోతే ఇక చాన్సే లేదంటున్న చంద్రబాబు సమర్ధులెవరో, డబ్బులున్నోళ్లు ఎవరో, వాళ్ల బలాబలాలేమిటో కాగితాలు కలాలు తీసుకుని అంచనా వేస్తున్నారని సమాచారం. అభ్యర్థుల ఎంపిక గతంలో మాదిరి కాకుండా పూర్తి స్థాయిలో సర్వేలు చేయించారు. ఎక్కడెక్కడి నుంచో సర్వే సంస్థల్ని, సలహా సంస్థల్ని పిలిపించి మాట్లాడి, రహస్య నివేదికలు తెప్పించినట్టు సమాచారం. ఇప్పటికే ఐదు సర్వే సంస్థల ద్వారా సర్వేలు పూర్తి చేసినట్లు విశ్వసనీయ సమాచారం. ఈ సర్వే సంస్థలు ఇచ్చిన రిపోర్టుల ఆధారంగా ఎవరు బెస్ట్ అనే విషయాన్ని పరిగణలోకి తీసుకోనునన్నారు. జిల్లాల వారీగా గెలుపు తథ్యం అనుకున్న అభ్యర్థుల జాబితా రెడీ అయినట్లు సమాచారం.
పవన్ కల్యాణ్ తో మాట్లాడిన తర్వాతే...
అభ్యర్థులను ప్రకటించే ముందు తెలుగుదేశం, జనసేన పార్టీల ముఖ్యులు కూర్చుని చర్చించాలని నిర్ణయించారు. టీడీపీ పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పలు సార్లు పొత్తుల విషయంపై చర్చించారు. జనసేన ఆశిస్తున్న నియోజకవర్గాల వివరాలు తెలుగుదేశం పార్టీకి అందాయి. అందులో టీడీపీ తప్పనిసరిగా పోటీ చేయాలనుకుంటున్న స్థానాల విషయం ఒక కొలిక్కి రావాల్సి ఉంది.
30 సీట్ల వరకు జనసేనకు...
కనీసం 30 స్థానాల వరకు పొత్తులో టీడీపీ జనసేనకు కేటాయించే అవకాశాలు కనిపిస్తున్నాయి. జనసేన పార్టీ 50 అసెంబ్లీ, ఐదు పార్లమెంట్ స్థానాలు అడిగినట్లు విశ్వసనీయ సమాచారం. అయితే 30 అసెబ్లీ స్థానాలు, ఒకటీ లేక రెండు ఎంపీ స్థానాలు ఇచ్చేందుకు సూత్రపాయంగా టీడీపీ అంగీకారానికి వచ్చిందని జనసేన వర్గాలు చెబుతున్నాయి. ఇదే విషయాన్ని టీడీపీ వర్గాలు కూడా ధృవీకరిస్తున్నాయి. ఏయే నియోజకవర్గాలు ఏ పార్టీకి కేటాయించాలనేది మరో వారం రోజుల్లో ఖరారయ్యే అవకాశం ఉన్నట్లు తెలుగుదేశం పార్టీ వర్గాల ద్వారా తెలిసింది.
ఎంతమందికి టికెట్లు గల్లంతవుతాయో...
అభ్యర్థుల మొదటి జాబితా సిద్ధమైనందున డిసెంబరు ఆఖరు వారంలో ప్రకటించేందుకు తగిన ఏర్పాట్లు తెలుగుదేశం పార్టీ చేసింది. అదే సమయంలో జనసేన మొదటి జాబితాను కూడా ప్రకటిస్తారు. తెలుగేదేశం పార్టీకి సంబంధించి ఇప్పటి వరకు 80 నుంచి 90 మంది అభ్యర్థులు ఖరారైనట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. పొత్తు విషయంలో బీజేపీని కలుపుకోవాలా.. వద్దా అనే విషయం తేలాల్సి ఉంది. జనసేన, టీడీపీ బీజేపీని ఆహ్వానిస్తే పొత్తు పెట్టుకునేందుకు బీజేపీ సుముఖంగా ఉన్నట్లు సమాచారం. ఇది టీడీపీ, జనసేనకు ప్లస్సా మైనస్సా అనే విషయంలో చర్చలు సాగుతున్నట్లు సమాచారం.
ఇప్పటికే 80 సీట్లపై కసరత్తు పూర్తి...
అభ్యర్థుల ఎంపిక ఎప్పటికి పూర్తవుతుందనే విషయాన్ని టీడీపీ ఎస్‌ఎన్ పాడు ఇన్‌చార్జ్, మాజీ ఎమ్మెల్యే బిఎన్ విజయకుమార్‌ను ఫెడరల్ ప్రశ్నించగా ఇప్పటికే దాదాపు సగానికి పైన ఎంపిక పూర్తయినట్లు తెలిపారు. ఈ నెలాఖరుకు అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉందన్నారు. జనసేనతో పొత్తు ఉన్నందున ఇరు పార్టీల వారు చర్చించి ఒకేసారి అభ్యర్థులను ప్రకటించేందుకు ఆలోచిస్తున్నారన్నారు.
తొలి జాబితాలో 80 మంది?
కీలుగుర్రాలు తెలుసు, నీటి గుర్రాలు తెలుసు.. మరి ఈ గెలుపు గుర్రాలెవరు? ఎన్నికలొచ్చినప్పుడల్లా వినబడే మాటిది. మొన్నటి దాకా తెలంగాణలో వినపడిన ఈ పదం ఇప్పుడు ఆంధ్రాలో మార్మోగుతోంది. మొన్నీమధ్య మిగ్ జామ్ తుపాను వచ్చి రాష్ట్రమంతా అతలాకుతలమైంది. పరామర్శకు పోయిన చంద్రబాబును టీడీపీ నేతలు కలిశారట. కలిసినోళ్లు ఏదో పార్టీ వ్యవహారాలు మాట్లాడి రాక.. సార్, మా టికెట్లన్నారట. అంతే చంద్రబాబు ఇంతెత్తున ఎగిరిపడ్డారు. ముదురు బ్యాచీల్నీ, పొన్ను కర్ర బ్యాచీల్నీ పక్కన బెట్టి కోడెగిత్తల్ని తీసుకువస్తానన్నారు. వాళ్లు ఎవరయ్యా అంటే గెలుపు గుర్రాలన్నాడట. ఇప్పుడది రాష్ట్ర మంతటా చర్చనీయాంశమైంది. తెలుగుదేశం నాయకుల గుండెల్లో గుబులు రేకిత్తిస్తోంది.
టీడీపీ కసరత్తు ఎలా ఉందంటే...
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు గెలుపు గుర్రాల వేటలో ఉన్నారు. 2024 ఎన్నికల్లో గెలవకపోతే ఇక చాన్సే లేదంటున్న చంద్రబాబు సమర్ధులెవరో, డబ్బులున్నోళ్లు ఎవరో, వాళ్ల బలాబలాలేమిటో కాగితాలు కలాలు తీసుకుని అంచనా వేస్తున్నారని సమాచారం. అభ్యర్థుల ఎంపిక గతంలో మాదిరి కాకుండా పూర్తి స్థాయిలో సర్వేలు చేయించారు. ఎక్కడెక్కడి నుంచో సర్వే సంస్థల్ని, సలహా సంస్థల్ని పిలిపించి మాట్లాడి, రహస్య నివేదికలు తెప్పించినట్టు సమాచారం. ఇప్పటికే ఐదు సర్వే సంస్థల ద్వారా సర్వేలు పూర్తి చేసినట్లు విశ్వసనీయ సమాచారం. ఈ సర్వే సంస్థలు ఇచ్చిన రిపోర్టుల ఆధారంగా ఎవరు బెస్ట్ అనే విషయాన్ని పరిగణలోకి తీసుకోనునన్నారు. జిల్లాల వారీగా గెలుపు తథ్యం అనుకున్న అభ్యర్థుల జాబితా రెడీ అయినట్లు సమాచారం.
పవన్ కల్యాణ్ తో మాట్లాడిన తర్వాతే...
అభ్యర్థులను ప్రకటించే ముందు తెలుగుదేశం, జనసేన పార్టీల ముఖ్యులు కూర్చుని చర్చించాలని నిర్ణయించారు. టీడీపీ పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పలు సార్లు పొత్తుల విషయంపై చర్చించారు. జనసేన ఆశిస్తున్న నియోజకవర్గాల వివరాలు తెలుగుదేశం పార్టీకి అందాయి. అందులో టీడీపీ తప్పనిసరిగా పోటీ చేయాలనుకుంటున్న స్థానాల విషయం ఒక కొలిక్కి రావాల్సి ఉంది.
ఇప్పటికే 80 సీట్లపై కసరత్తు పూర్తి...
అభ్యర్థుల ఎంపిక ఎప్పటికి పూర్తవుతుందనే విషయాన్ని టీడీపీ ఎస్‌ఎన్ పాడు ఇన్‌చార్జ్, మాజీ ఎమ్మెల్యే బిఎన్ విజయకుమార్‌ను ఫెడరల్ ప్రశ్నించగా ఇప్పటికే దాదాపు సగానికి పైన ఎంపిక పూర్తయినట్లు తెలిపారు. ఈ నెలాఖరుకు అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉందన్నారు. జనసేనతో పొత్తు ఉన్నందున ఇరు పార్టీల వారు చర్చించి ఒకేసారి అభ్యర్థులను ప్రకటించేందుకు ఆలోచిస్తున్నారన్నారు.
మొదటి జాబితాలో 18 మంది..
ప్రస్తుతం టీడీపీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న 18 మంది ఎమ్మెల్యేలు మొదటి జాబితాలో ఉన్నారు. జనసేనకు పిఠాపురం, భీమవరం, కాకినాడ, రాజమండ్రి రూరల్, నర్సాపురం, ఆళ్లగడ్డ, తెనాలి, గాజువాక, తిరుపతి, కైకలూరు, అమలాపురం, రాజోలు, పాతపట్నం, భీమిలి స్థానాలు ఇప్పటికే ఖరారు చేసినట్లు విశ్వసనీయ సమాచారం. రెండు పార్టీలు అభ్యర్థులను ఖరారు చేసిన తర్వాత ఒకేసారి ప్రకటించాలనే ఆలోచన చేస్తున్నారు. క్షేత్ర స్థాయిలో ప్రచారం కూడా రెండు పార్టీలు కూడా ఒకేసారి మొదలు పెట్టాలని చంద్రబాబు, పవన్ కల్యాణ్ ప్లాన్ చేస్తున్నట్టు టీడీపీ గుంటూరు జిల్లా నాయకుడు ఎం.శ్రీనివాస్ చెప్పడం గమనార్హం.