బీహార్ రైతులకు తేజస్వి ఎన్నికల హామీ..

తమ కూటమి గెలిస్తే MSPపై అదనంగా వరి రైతులకు క్వింటాంకు రూ.300, గోధుమ రైతులకు రూ.400 బోనస్ చెల్లిస్తామని ప్రకటించిన ముఖ్యమంత్రి అభ్యర్థి..

Update: 2025-11-04 07:58 GMT
Click the Play button to listen to article

బీహార్‌(Bihar)లో ఇండియా కూటమి(I.N.D.I.A Alliance) అధికారంలోకి వస్తే.. రైతులకు కనీస మద్దతు ధర (MSP)కు బోనస్ చెల్లిస్తామని ఆర్జేడీ(RJD) నాయకుడు, కూటమి ముఖ్యమంత్రి అభ్యర్థి తేజస్వి యాదవ్ హామీ ఇచ్చారు. వరి రైతులకు కనీస మద్దతు ధరకు అదనంగా క్వింటాంకు రూ.300, అలాగే గోధుమ రైతులకు కనీస మద్దతు ధరకు అదనంగా రూ.400 ఇస్తామని మంగళవారం (నవంబర్ 4) పాట్నాలో జరిగిన విలేకరుల సమావేశంలో ప్రకటించారు. రాష్ట్రంలోని అన్ని ప్రాథమిక వ్యవసాయ రుణ సంఘాలు (PACS), ప్రాథమిక మార్కెటింగ్ సహకార సంఘాల (వ్యాపర్ మండల్) అధిపతులకు కూడా "ప్రజాప్రతినిధుల" హోదా ఇస్తామన్నారు.

"భారత కూటమి అధికారంలోకి వస్తే.. వరి రైతులకూ బోనస్‌గా క్వింటాంకు రూ. 300, గోధుమకు రూ. 400 చెల్లిస్తాం. అలాగే రాష్ట్రంలోని 8,400 వ్యాపార మండలాలు, PACSల నిర్వాహకులకు గౌరవ వేతనం ఇవ్వాలన్న ఆలోచనలో ఉన్నాం" అని తేజస్వి చెప్పారు.

నవంబర్ 6న పోలింగ్ జరగడానికి రెండు రోజుల ముందు తేజస్వి ఈ ప్రకటన చేశారు. 243 మంది సభ్యులున్న బీహార్ అసెంబ్లీకి నవంబర్ 6, నవంబర్ 11 తేదీల్లో రెండు దశల్లో పోలింగ్ జరగనుంది. 14న ఫలితాలను ప్రకటిస్తారు. 

Tags:    

Similar News