ఈ గ్యాస్ కేసు మీ పరిధిలోకి రాదు

ప్రపంచంలోనే అత్యంత దారుణ పారిశ్రామిక విపత్తులో ఒకటిగా పేరుగాంచిన 1984 నాటి భోపాల్ గ్యాస్ లీక్ కేసు జనవరి 6 కి వాయిదా పడింది. ఈ కేసు భోపాల్ కోర్టు పరిధిలోకి రాదని అమెరికా కార్పొరేట్ సంస్థ అయినా డౌ కెమికల్స్ వాదించడంతో జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ జడ్డీ మహేశ్వరి విచారణను వాయిదా వేశారు.

Translated by :  Chepyala Praveen
Update: 2023-11-29 17:25 GMT

ఈ కేసు పరిధిని 2012లోనే హైకోర్టు నిర్ణయించిందని పిటిషనర్ల తరఫున వాదించిన న్యాయవాదీ అవి సింగ్ పేర్కొన్నారు. అందువల్ల యూనియన్ కార్బైడ్ ను కొనుగోలు చేసిన డౌ కెమికల్స్ ను ఈ కేసులో నిందితుడిగా చేర్చాలని న్యాయస్థానాన్ని అభ్యర్థించినట్లు పీటీఐ వార్త సంస్థకు తెలిపారు. ఈ కేసులో డౌ కెమికల్స్ తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది, చత్తీస్ గఢ్ మాజీ అడ్వేకేట్ జనరల్ రవీంద్ర శ్రీ వాస్తవ, సందీప్ గుప్తా వాదిస్తున్నారు. డౌ కెమికల్స్ కార్పొరేట్ సంస్థ అని, అంతర్జాతీయ చట్టాల ప్రకారం నమోదైన కారణంగా స్థానిక చట్టాల ప్రకారం విచారణ చేయడం వీలుకాదని కోర్టుకు విన్నవించినట్లు మీడియాకు వెల్లడించారు. హైకోర్టు కి కూడా ఈ కేసు పరిధిని తేల్చే అధికారం లేదని కోర్టు ముందు ఉంచినట్లు చెప్పారు. ఈ పారిశ్రామిక దుర్ఘటనపై విచారణ జరపాలని కోరుతూ కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ, భోపాల్ గ్రూప్ ఫర్ ఇన్ఫర్మేషన్ అండ్ యాక్షన్ సహ పలువురు పిటిషన్లు దాఖలు చేశారు. కాగా, 1984 డిసెంబర్ 2 వ తేదీ రాత్రి భోపాల్ సమీపంలో ఉన్న యూనియన్ కార్బైడ్ కెమికల్ ఫ్యాక్టరీ నుంచి మిథైల్ ఐసోసైనేట్ అనే విషవాయువు లీక్ అయింది. ఈ దుర్ఘటనలో 3000 వేల మంది నిద్రలోనే మరణించారు. లక్ష మంది తీవ్రంగా ప్రభావం అయ్యారు. కాగా ఈ కంపెనీ అమెరికాలోని మిచిగాన్ రాష్ట్రంలో ఉంది. యూనియన్ కార్బైడ్ ను డౌ కెమికల్స్ కొనుగోలు చేసింది. ఒప్పందం అమలులోకి వచ్చిన తరువాత కొన్ని రోజులకే భోపాల్ లో గ్యాస్ లీక్ జరిగింది. అందువల్ల ఈ కంపెనీని సైతం నిందితుడి జాబితాలో చేర్చాలని పిటిషనర్లు, దర్యాప్తు సంస్థలు కేసు దాఖలు చేశాయి.

Tags:    

Similar News