సీఎస్కే వర్సె స్ ముంబై: రేపు ఆన్ లైన్ లో అందుబాటులోకి రానున్న టికెట్లు
తొలి మ్యాచ్ కు అందుబాటులో ఉండని ముంబై కెప్టెన్ హార్డిక్ పాండ్యా;
By : The Federal
Update: 2025-03-18 06:59 GMT
ఐపీఎల్ సమరానికి తేదీలు, షెడ్యూల్ రాగా తాజాగా చెన్నై సూపర్ కింగ్స్, ముంబై తో తలపడే మ్యాచ్ టిక్కెట్ల ఆన్ లైన్ లో అమ్మకాల వివరాలను ఫ్రాంచైజీ ప్రకటించింది.
రుతురాజ్ గైక్వాడ్ నేతృత్వంలోని సీఎస్కే మార్చి 23న తన తొలి మ్యాచ్ ను చెన్నై చెపాక్ వేదికగా ముంబాయితో తలపడనుంది. ఈ మ్యాచ్ తోనే చెన్నై తన ఐపీఎల్ టోర్నీని ప్రారంభించనుంది.
గత సీజన్ లో ముంబై జట్టుకు కెప్టెన్ వ్యవహరించిన హర్డిక్ పాండ్యా స్లో ఓవర్ రేట్ కారణంగా ఈ మ్యాచ్ కు అందుబాటులో ఉండట్లేదు. ఐపీఎల్ చరిత్రలో సీఎస్కే, ముంబై జట్లది విజయవంతమైన ప్రస్థానం. ఒక్కో జట్టు ఐదు టైటిళ్లను కైవసం చేసుకున్నాయి. ఈ సంవత్సరమే ధోని ఐపీఎల్ కు వీడ్కోలు పలుకుతాడని పుకార్లు ఉన్నాయి.
ఈ రెండు జట్ల పోరు కోసం అభిమానులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. రెండు జట్లలో హర్డ్ హిట్టర్లకు కొదవలేదు. వారు ఆకాశమే హద్దుగా చెలరేగుతుంటే గెలుపు ఎవరిని వరిస్తుందో చెప్పడం చాలా కష్టం. రాత్రి 7.30 నిమిషాలకు ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది.
ఎక్కడ కొనాలి..
మార్చి 19న బుధవారం ఉదయం పదిగంటలకు టికెట్లు అందుబాటులోకి వస్తాయి.
టికెట్ ధరలు ఈ విధంగా ఉన్నాయి.
స్టాండ్లు సీ/డీ/ఈ లోయర్ రూ. 1700
ఐ/జే/కే అప్పర్ స్టాండ్ రూ. 2500
సీ/డీ/ఈ అప్పర్ స్టాండ్ రూ. 3500
కేఎంకే టెర్రస్: రూ. 7500
ఈ టికెట్లు చెన్నై సూపర్ కింగ్స్ . కామ్ తో పాటు డిస్ట్రిక్ట్. ఇన్ లో అందుబాటులో ఉంటాయి.
మార్చి 22న ఈడెన్ గార్డెన్స్ లో తొలిమ్యాచ్
ఐపీఎల్ 18 వ ఎడిషన్ మార్చి 22న కోల్ కతలోని ఈడెన్ గార్డెన్స్ లో ప్రారంభమవుతుంది. డిఫెండింగ్ ఛాంపియన్స్ కోల్ కత నైట్ రైడర్స్ తో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్ తలపడనుంది.
కేకేఆర్ కు అజింక్య రహనే, ఆర్సీబీ కి రజత్ పాటిదార్ నాయకత్వం వహిస్తున్నారు. ఈ ఇద్దరు ఆయా జట్లకు కొత్తగా నాయకత్వం స్వీకరించారు. ఐపీఎల్ 2025 లో పది జట్లు 74 మ్యాచ్ లు ఉంటాయి. మే 25న ఫైనల్ ఈడెన్ గార్డెన్స్ లో జరుగుతుంది.
సీఎస్కే స్క్వాడ్ :
వేలంలో కొనుగోలు చేసినవి(20): నూర్ అహ్మద్ రవిచంద్రన్ అశ్విన్, డెవాన్ కాన్వే, ఖలీల్ అహ్మద్, రచిన్ రవీంద్ర, రాహుల్ త్రిపాఠి, అన్షుల్ త్రిపాఠి, కుర్రాన్, గుర్జాప్ నీత్ సింగ్, నాథన్ ఎల్లిస్, దీపక్ హుడా, జామీ ఒవర్టన్, విజయ్ శంకర్, వంశ్ బేడీ, రామకృష్ణ నగర్, ముఖేష్ చౌదరీ, షేక్ రషీద్, ఆండ్రీ సిద్దార్థ్, శ్రేయాస్ గోపాల్..
రిటైన్డ్ ప్లేయర్లు.. రుతురాజ్ గైక్వాడ్, మతీషా పతిరన, శివమ్ దూబే, రవీంద్ర జడేజా, ఎంఎస్ ధోనీ
ముంబాయి ఇండియన్స్..
ట్రెంట్ బౌల్ట్, దీపక్ చాహర్, విల్ జాక్స్, నమన్ ధీర్, అల్లా ఘజన్ ఫర్, ర్యాన్ జాడ్, రియాన్ జాడ్, రీస్ టోప్లి, రాబిన్ మింజ్, కర్ణ్ శర్మ, విఘ్నేష్ పుత్తూర్, అర్జున్ టెండూల్కర్, బెవాన్ జాన్ జాకబ్స్, వెంకట సత్యనారాయణ, రాజ్ వా, కృష్ణన్, అశ్వనీ కుమార్
రిటైన్డ్ ప్లేయర్లు: బూమ్రా, సూర్యకుమార్ యాదవ్, హార్డిక్ పాండ్యా, రోహిత్ శర్మ, తిలక్ వర్మ