‘ఆ దేశానికి వచ్చి క్రికెట్ ఆడలేం’

పాకిస్తాన్ లో వచ్చే ఏడాది జరగనున్న ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫికి భారత్ పాల్గొనబోదని బీసీసీఐని ఉటంకిస్తూ జాతీయ మీడియా కథనం పేర్కొంది.

Update: 2024-07-11 10:17 GMT

పాకిస్తాన్ లో వచ్చే ఏడాది జరగనున్న ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫిలో భారత జట్టు పాల్గొనట్లేదని ఓ జాతీయా మీడియా కథనం పేర్కొంది. భారత్ ఆడే మ్యాచ్ లను దుబాయ్ లేదా శ్రీలంక లో తమ మ్యాచ్ లు ఆడేందుకు బీసీసీఐ ఒత్తిడి తీసుకొచ్చే అవకాశం ఉందని బోర్డులోని ఒక వర్గం సోర్స్ ను ఉటంకిస్తూ మీడియా కథనం పేర్కొంది.

"భారత్, ఛాంపియన్స్ ట్రోఫీ 2025 కోసం పాకిస్థాన్‌కు వెళ్లదు. దుబాయ్ లేదా శ్రీలంకలో తన మ్యాచ్‌లను నిర్వహించమని ICCకి చెబుతుంది" అని BCCI మూలాన్ని ఉటంకిస్తూ ఓ వార్తా సంస్థ పేర్కొంది. భారత్, పాకిస్తాన్ దేశాల మధ్య ఉద్రిక్త సంబంధాల కారణంగా ద్వైపాక్షిక క్రికెట్ సిరీస్‌లు ఆడట్లేదు. భారత క్రికెట్ జట్టు పాకిస్థాన్ పర్యటనపై ప్రభుత్వమే నిర్ణయం తీసుకుంటుందని బీసీసీఐ అధికారులు తెలిపారు.
పొరుగు దేశం సీమాంతర ఉగ్రవాదాన్ని నిలిపివేసే వరకు భారత్-పాక్ మధ్య ద్వైపాక్షిక క్రికెట్ జరగదని భారత ప్రభుత్వం నిర్ద్వంద్వంగా ప్రకటించింది.
ఆసియా కప్ 2023కు పాకిస్తాన్ ఆతిథ్యం ఇచ్చింది. అయితే భారత్ మాత్రం పాకిస్తాన్ వెళ్లడానికి నిరాకరించింది. తమ మ్యాచ్ లు హైబ్రిడ్ పద్ధతిలో శ్రీలంకలో ఆడాలని నిర్ణయించింది. లేకపోతే టోర్నీ నుంచి తప్పుకుంటామని పేర్కొంది. భారత్ లేకపోతే టోర్నీ కళ తప్పే అవకాశం ఉండటంతో పాకిస్తాన్ విధిలేక ఒప్పుకుంది. ఇప్పుడు ముందస్తు నివేదికల ప్రకారం ఐసీసీ ఛాంపియన్ ట్రోఫిని కూడా హైబ్రిడ్ పద్ధతిలోనే నిర్వహించాలని కోరుతోంది. 
అయితే ఈ విషయంపై అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ఇప్పటి వరకు స్పందించలేదు. షెడ్యూల్ ముసాయిదా ప్రకారం, మార్చి 1న లాహోర్‌లో భారత్, పాకిస్థాన్ తలపడనున్నాయి.
ఐసీసీ మాత్రం కచ్చితంగా పాకిస్తాన్ లో ఆడాలని ఒత్తిడి చేస్తే బీసీసీఐ టోర్నిని బహిష్కరించే అవకాశం ఉంటుంది. ఇదే జరిగితే టోర్నీల విఫలం అవుతుంది. ఐసీసీకి తీవ్ర స్థాయిలో నష్టం జరుగుతుంది. స్పోర్ట్స్ గ్రూప్ కూడా ఈ ప్రతిపాదనపై అంగీకరించకపోవచ్చు. కావునా పాకిస్తాన్ పై తీవ్ర ఒత్తిడి ఉంటుంది. టోర్నీ విఫలమైతే పాక్ క్రికెట్ బోర్డు కూడా మరింత నష్టాల్లో కూరుకుపోయింది. అందుకే హైబ్రిడ్ పద్దతిలోనే మ్యాచ్ లు జరిగే అవకాశం ఉంటుంది.
Tags:    

Similar News