రోహిత్ , ఆకాశ్ దీప్ కు నెట్ ప్రాక్టీస్ లో గాయాలు?
బాక్సింగ్ డే టెస్ట్ ముందు టీమిండియాకు ఎదురుదెబ్బ;
బాక్సింగ్ డే టెస్ట్ ముందు భారత్ కు ఆందోళన కలిగించే అంశం. భారత కెప్టెన్ రోహిత్ శర్మ, యువ ఫాస్ట్ బౌలర్ ఆకాశ్ దీప్ నెట్ లో ప్రాక్టీస్ చేస్తున్న సందర్భంగా గాయాలయ్యాయని తెలుస్తోంది. మెల్ బోర్న్ అవుట్ డోర్ ప్రాక్టీస్ అరేనాలో త్రో డౌన్ లను ఎదుర్కొంటున్న సమయంలో రోహిత్ శర్మ మోకాలికి బలంగా బంతి తగలడంతో ఫిజియో వచ్చి చికిత్స చేయాల్సి వచ్చింది.
అలాగే ఆకాశ్ దీప్ కు సైతం బంతి తగలడంతో గాయంతో కాసేపు ప్రాక్టీస్ కు విరామం ఇవ్వాల్సి వచ్చింది. అయితే రోహిత్ గాయంపై అందరూ ఆందోళన చెందుతున్నారు. ఫిజియే చికిత్స తరువాత ప్రాక్టీస్ మొదలు పెట్టినప్పటికీ అంత సౌకర్యంగా ఉండకపోవడంతో రోహిత్ ఐస్ పెట్టుకుని కనిపించాడు.
అయితే రెండు సాధారణ గాయాలని ప్రస్తుతానికి ఆకాశ్ దీప్ వెల్లడించారు. "మీరు క్రికెట్ ఆడుతున్నప్పుడు ఇలాంటి దెబ్బలు సర్వసాధారణం. ఈ (ప్రాక్టీస్ పిచ్) వికెట్ వైట్ బాల్ కోసం అని నేను అనుకుంటున్నాను, అందుకే బంతి కొన్నిసార్లు తక్కువగా బౌన్స్ అవుతోంది. "కానీ శిక్షణలో ఈ దెబ్బలు మామూలే. దానివల్ల పెద్దగా ఆందోళనలు ఏమీ లేవు" అని ఆకాష్ విలేకరుల సమావేశంలో అన్నారు.