ప్రపంచ క్రికెట్ జాతర నేటి నుంచే! ఎక్కడ, ఎప్పుడు, ఎలా?

అడుగో కోహ్లీ.. ఇడిగో రోహిత్... అబ్బా భలే మిస్సయ్యాంరా.. ఇలా అరుపులు, కేకలు, నిట్టూర్పులతో సాగే ఐసీసీ ఛాంపియన్స్ ట్రోపీ ఈవేళ పాకిస్తాన్ లో ప్రారంభం కానుంది;

Update: 2025-02-19 02:20 GMT
Indian Team (file Photo)
ఇప్పుడు ఏ ఇద్దర్ని కదిలించినా ఆ క్రికెట్ ముచ్చటే.. బెట్టింగుల సందడే.. ఏ జట్టుకు ఛాంపియన్ అయ్యే ఛాన్స్ ఉందనే దాని మొదలు ఏ బాలుకి ఎన్ని పరుగులు వస్తాయో లెక్కలు గట్టే పందెగాళ్లు రావడంతో.. మ్యాచ్ ఉందంటే టీవీలు వదలని ఓ కొత్తతరం తెరపైకి వచ్చింది. ఇంతకీ విషయమేమిటో తెలుసుగా.. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ. ఈ ట్రోఫీని ఈసారి పాకిస్తాన్ నిర్వహిస్తోంది.
వన్డేల్లో ప్రపంచకప్‌ తర్వాత, అత్యంత ఆసక్తి రేకెత్తించే, రసవత్తరంగా సాగే ట్రోఫీ ఛాంపియన్స్‌ ట్రోఫీ. 2017 తర్వాత రద్దయి, మళ్లీ ఇప్పుడు పునరుజ్జీవం పొందనున్న టోర్నీకి పాకిస్థాన్, యూఏఈ సంయుక్తంగా ఆతిథ్యమివ్వనున్నాయి. ఆతిథ్య జట్టు పాకిస్థానే అయినప్పటికీ.. ఆ దేశంలో పర్యటించేందుకు భారత్‌ అంగీకరించని నేపథ్యంలో, రోహిత్‌ సేన ఆడే మ్యాచ్‌లకు దుబాయ్‌ వేదిక కానుంది.

PHOTO CURTESY INSTAGRAM

ఫిబ్రవరి 20 గురువారం బంగ్లాదేశ్‌ మ్యాచ్‌తో భారత్‌ తన పోరాటాన్ని ఆరంభిస్తుంది. అంతకంటే ముందు, బుధవారం పాకిస్థాన్, న్యూజిలాండ్‌ తొలి మ్యాచ్‌లో తలపడతాయి. ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికా, అఫ్గానిస్థాన్‌ టోర్నీలో తలపడుతున్న మిగతా జట్లు. వెస్టిండీస్, శ్రీలంక టోర్నీకి అర్హత సాధించలేకపోయాయి.
దాదాపు మూడు దశాబ్దాల తర్వాత ఓ ప్రధాన టోర్నమెంట్‌ జరుగుతుండడంతో పాకిస్థాన్‌లో ఎటు చూసినా క్రికెట్‌ సందడి కనిపిస్తోంది. 1996 వన్డే వరల్డ్‌కప్‌ తర్వాత భద్రతా కారణాల రీత్యా ఇక్కడ ఎలాంటి ఐసీసీ టోర్నీలు జరుగలేదు. మళ్లీ ఇన్నాళ్లకు ఈనెల 19 నుంచి ఐసీసీ చాంపియన్స్‌ ట్రోఫీకి పాక్‌ ఆతిథ్యమిస్తోంది. ఇందుకోసం కరాచీ, లాహోర్‌, రావల్పిండిలోని స్టేడియాలను ఆధునికీకరించారు.
ఫిబ్రవరి 19న ఆరంభ పోరులో పాక్‌-కివీస్‌ కరాచీలో తలపడనున్నాయి. అయితే టీమిండియా పాక్‌కు రాకపోవడంతో అభిమానుల్లో తీవ్ర నిరాశ నెలకొంది. తమ దేశంలో భారత జట్టును కూడా ఇష్టపడతారని, అలాగే విరాట్‌కు పెద్ద ఎత్తున ఫ్యాన్స్‌ ఉన్నారంటూ పాకిస్తానీయులు చెబుతున్నారు. ఈనెల 23న హాట్ ఫేవరెట్స్ అయిన ఇండియా-పాక్ దుబాయిలో తలపడనున్నాయి. మరోవైపు టోర్నీ సందర్భంగా పోలీసులు గట్టి భద్రతను ఏర్పాటు చేశారు.
శ్రీలంక జట్టుపై ఉగ్రవాదుల దాడి...
1996 ప్రపంచకప్‌ను శ్రీలంక, భారతదేశంతో కలిసి ఆతిథ్యమిచ్చిన తర్వాత మొదటిసారి అంతర్జాతీయ స్థాయి ఐసీసీ టోర్నమెంట్‌ను పాకిస్తాన్ నిర్వహించనుంది. ఫిబ్రవరి 19న ప్రారంభమవుతున్న ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ- 2025కి పాకిస్తాన్ దాదాపు 30 ఏళ్ల తర్వాత ఆతిథ్యం ఇస్తోంది. 2025 ఛాంపియన్స్ ట్రోఫీలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని ప్రధాన జట్లు పాకిస్తాన్‌లో ఆడేందుకు సిద్ధపడగా భారత్ మాత్రం భద్రతాకారణాల రీత్యా అక్కడికి వెళ్లడం లేదు. భారత్ హైబ్రిడ్ మోడల్ లో తమ హోం మ్యాచ్‌లను యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో(UAE) ఆడనుంది. UAEలో భారత్, పాకిస్తాన్ జట్లు తలపడనున్నాయి. ఈ హై-వోల్టేజ్ పోరుకు అభిమానుల్లో భారీ ఆసక్తి నెలకొంది.
2009లో లాహోర్‌లో శ్రీలంక జట్టుపై ఉగ్రదాడి జరిగిన తర్వాత పాకిస్తాన్ క్రికెట్ అభిమానులు ప్రత్యక్షంగా అంతర్జాతీయ క్రికెట్‌ను ఆస్వాదించలేకపోయారు. భద్రతా కారణాలతో దాదాపు దశాబ్దం పాటు అంతర్జాతీయ జట్లు పాకిస్తాన్ పర్యటనలకు దూరంగా ఉండిపోయాయి. 2019లో శ్రీలంక జట్టు టెస్టు క్రికెట్ కోసం తిరిగి పాకిస్తాన్‌కు వచ్చింది. ఆ తర్వాత మెల్లగా అంతర్జాతీయ క్రికెట్ జట్లు తిరిగి పాకిస్తాన్ రావడం మొదలైంది.
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ అంటే ఏమిటి?
ఎనిమిది దేశాల పరిమిత ఓవర్ల ఈ టోర్నమెంట్ 2017లో జరిగింది. ఇంగ్లండ్ లో జరిగిన ఆ ఫైనల్‌లో పాకిస్తాన్, భారతదేశాన్ని ఓడించింది. ఛాంపియన్స్ ట్రోఫీ 1998లో ప్రారంభమై, తొలుత ప్రతి రెండేళ్లకోసారి జరిపేవారు. తరువాత ఇది నాలుగేళ్లకు ఒకసారి నిర్వహించేందుకు మార్పు చేశారు. వన్డే క్రికెట్‌లో ప్రపంచకప్ తరువాత అత్యంత ప్రతిష్టాత్మక టోర్నమెంట్‌గా దీనిని పరిగణిస్తారు. 2008 ఛాంపియన్స్ ట్రోఫీ పాకిస్తాన్‌కు కేటాయించారు. అయితే భద్రతా కారణాల వల్ల 2009లో దాన్ని దక్షిణాఫ్రికాకు మార్చారు. 2021 ఛాంపియన్స్ ట్రోఫీని భారత్ ఆతిథ్యమివ్వాల్సి ఉండగా, దానిని టీ20 ప్రపంచకప్‌గా మార్చి UAEలో నిర్వహించారు.
2025 ఛాంపియన్స్ ట్రోఫీలో పాల్గొనే 8 జట్లు 2023 ప్రపంచకప్ ర్యాంకింగ్స్ ఆధారంగా ఎంపికయ్యాయి. పాకిస్తాన్ ఆతిథ్య దేశంగా అర్హత పొందింది.
🔥 ఆసక్తికరమైన మ్యాచులు
📌 భారత్ 🆚 పాకిస్తాన్ – ఈ టోర్నమెంట్‌లో అత్యంత హై-వోల్టేజ్ మ్యాచ్
📌 ఇంగ్లాండ్ 🆚 ఆస్ట్రేలియా – వన్డే క్రికెట్‌లో మూడుచరిత్ర కలిగిన పోటీ
📌 దక్షిణాఫ్రికా 🆚 న్యూజిలాండ్ – ఎప్పుడూ చివరి వరకూ ఉత్కంఠభరితంగా కొనసాగే మ్యాచ్
⭐ టాప్ ప్లేయర్స్ - ఎవరి మీద ప్రత్యేక దృష్టి?
🏏 బ్యాట్స్‌మెన్:
🔹 విరాట్ కోహ్లీ (భారతదేశం) – అనుభవం కలిగిన మ్యాచ్విన్నర్
🔹 బాబర్ ఆజమ్ (పాకిస్తాన్) – స్టైలిష్ బ్యాట్స్‌మన్
🔹 స్టీవ్ స్మిత్ (ఆస్ట్రేలియా) – టెక్నికల్ మాస్టర్
🔹 బెన్ స్టోక్స్ (ఇంగ్లాండ్) – హిట్టింగ్ స్పెషలిస్ట్
🔥 బౌలర్లు:
🔹 షాహీన్ అఫ్రీది (పాకిస్తాన్) – పవర్‌ప్లే‌లో డేంజరస్ బౌలర్
🔹 జస్ప్రీత్ బుమ్రా (భారతదేశం) – డెత్ ఓవర్ల స్పెషలిస్ట్
🔹 మిచెల్ స్టార్క్ (ఆస్ట్రేలియా) – టోర్నమెంట్‌లో బెస్ట్ వికెట్ టేకర్
🔹 రషీద్ ఖాన్ (అఫ్ఘానిస్థాన్) – మేజిక్ స్పిన్నర్
📊 గణాంక విశ్లేషణ - వరల్డ్ కప్ రికార్డులు
✅ అత్యధిక పరుగులు: సచిన్ టెండూల్కర్ (2278)
✅ అత్యధిక వికెట్లు: గ్లెన్ మెక్‌గ్రాత్ (71)
✅ అత్యుత్తమ వ్యక్తిగత స్కోరు: మార్టిన్ గప్తిల్ (237*)
✅ అత్యంత విజయవంతమైన జట్టు: ఆస్ట్రేలియా (5 టైటిల్స్)
📺 వరల్డ్ కప్ లైవ్ స్ట్రీమింగ్ & ప్రసారం
📡 టీవీ ఛానల్స్: Star Sports, Sony, Sky Sports, Fox Cricket
📲 ఆన్‌లైన్ స్ట్రీమింగ్: Hotstar, ESPN+, Amazon Prime
🔮 ఫలితాల అంచనా - ఎవరు గెలుస్తారు?
📢 నిపుణుల అంచనా ప్రకారం భారత్, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, పాకిస్తాన్ జట్లు టాప్-4లోకి వచ్చే అవకాశం ఉంది. అయితే, క్రికెట్ అనూహ్య మలుపులతో కూడిన గేమ్ కాబట్టి, అఫ్ఘానిస్థాన్, శ్రీలంక, న్యూజిలాండ్ వంటి జట్లు కూడా ఆశ్చర్యపరిచే అవకాశముంది.
23న ఇండియా వర్సెస్ పాక్ మహా సమరం!
ఫిబ్రవరి 23న క్రికెట్ ప్రపంచం శ్వాస ఆపి ఎదురుచూచే హై-వోల్టేజ్ పోరు – భారతదేశం 🆚 పాకిస్తాన్! ప్రపంచకప్‌లలోనే కాకుండా, మొత్తం క్రికెట్ చరిత్రలో అత్యంత ఆసక్తికరమైన రైవల్రీల్లో ఇది ఒకటి. ఈ మ్యాచ్ దుబాయ్ వేదికగా జరగనుంది, అంతేకాకుండా కోట్లాది అభిమానులు టీవీల ముందు కూర్చొని ఉత్కంఠభరితంగా చూడబోతున్నారు.
సొంతగడ్డపై భారీ అంచనాలతో పాక్...
ఎప్పుడో 1996లో వన్డే ప్రపంచకప్‌నకు భారత్, శ్రీలంకలతో కలిసి ఉమ్మడిగా ఆతిథ్యమిచ్చింది పాకిస్థాన్‌. ఆ తర్వాత ఆ దేశంలో ఏ ఐసీసీ టోర్నీ జరగలేదు. ఈ నేపథ్యంలో ఛాంపియన్స్‌ ట్రోఫీ నిర్వహణను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పాక్‌.. ప్రదర్శన పరంగా కూడా తన ప్రత్యేకతను చాటాలనుకుంటోంది. సొంతగడ్డపై భారీ అంచనాల మధ్య బరిలోకి దిగుతున్న ఆ జట్టు.. టోర్నీలో శుభారంభం చేయాలని ఆశిస్తోంది. అయితే తొలి మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ రూపంలో ఆ జట్టుకు కఠిన సవాలే ఎదురవుతోంది. ఛాంపియన్స్‌ ట్రోఫీకి సన్నాహకంగా జరిగిన ముక్కోణపు సిరీస్‌లో కివీస్‌.. పాక్‌ను లీగ్‌ దశలోనే కాక ఫైనల్లోనూ ఓడించింది. కివీస్‌ ఇటీవల నిలకడగా రాణిస్తోంది. బ్యాటింగ్‌లో విలియమ్సన్, కాన్వే, మిచెల్, లేథమ్, ఫిలిప్స్‌.. బౌలింగ్‌లో హెన్రీ, డఫీ, శాంట్నర్, ఒరూర్క్, బ్రాస్‌వెల్‌లతో ఆ జట్టు బలంగా కనిపిస్తోంది. ఫిలిప్స్‌ బంతితో.. బ్రాస్‌వెల్, శాంట్నర్‌ బ్యాటుతోనూ సత్తా చాటగలరు. ముక్కోణపు సిరీస్‌ సంగతి పక్కన పెడితే.. పాకిస్థాన్‌ కూడా ఇటీవల బాగానే ఆడుతోంది. బాబర్‌ అజామ్, ఫఖర్‌ జమాన్, రిజ్వాన్, సల్మాన్‌ అఘా బ్యాటింగ్‌లో చక్కటి ఫామ్‌లో ఉన్నారు. షహీన్‌ అఫ్రిది, హారిస్‌ రవూఫ్, నసీమ్‌ షా, అబ్రార్‌ అహ్మద్‌లతో పాక్‌ బౌలింగ్‌కూ ఢోకా లేదు. కానీ ఎప్పుడు ఎలా ఆడుతుందో తెలియని అనిశ్చితే పాక్‌కు ప్రతికూలం. ఈ మ్యాచ్‌కు ఆతిథ్యమివ్వనున్న కరాచి స్టేడియం పిచ్‌ బ్యాటింగ్‌కు ప్రసిద్ధి. స్పిన్నర్ల ప్రభావం ఉంటుంది. 
Tags:    

Similar News