కెసిఆర్ మ్యాజిక్ ఫెయిలయింది... ఈ ఎన్నికల చిత్రవిచిత్రాలు ఇవే

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో భారత రాష్ట్ర సమితి ఓడిపోయింది. కాంగ్రెస్ అనూహ్య విజయం సాధించింది. ఈ ఎన్నిక ఎన్నో విచిత్రాలను విసిరింది. అవే ఇవి

Update: 2023-12-03 09:22 GMT
Revanth Redxy

తెలంగాణ లో ముఖ్య మంత్రి కె చంద్రశేఖర్ రావు (కెసిఆర్) మ్యాజిక్ పనిచేయలేదు.   బిఆర్ ఎస్ పార్టీ రెండు దఫాలు గెలిచి మూడో సారి కాంగ్రెస్ లో పార్టీ  చేతిలో పరాజయం ఎదుర్కొన్నది. హ్యాట్రిక్ కొట్టేందుకు ఆయన చేసిన మరిన్ని వాగ్దానాలను ప్రజలు తిరస్కరించారు. ఆయన విపరీతంగా భుజానేసుకుని తిరిగిన ధరణి యాప్, కాళేశ్వరం ప్రాజక్టు  ఆయన్ని కాపాడలేకపోయాయి. చివరకు ఆయన కట్టిన ఫైవ్ స్టార్ సెక్రెటేరియట్ కూడా ఆయనకు ఉపయోగపడలేదు. ఆయన అందులో ఎక్కవ కాలం పనిచేయకుండానే వెళ్లిపోవలసి వస్తున్నది.  తాను ఇష్టంగా వాస్తు ప్రకారం కట్టుకున్న భారీ అధికార నివాసం ప్రగతి భవన్ ని ఖాళీ చేయాల్సి వస్తున్నది. తెలంగాణ ఉద్యమనేతకు  ఇది ఒక  విచిత్రమయిన, ఇబ్బంది కరమయిన పరిణామం. తెలంగాణ రాష్ట్ర సమితిని   బిఆర్ ఎస్ అని   జాతీయ పార్టీ చేశాక  ఆయనకు ఎదురయిన పెద్ద పరాజయం ఇది. ఇక బిఆర్ ఎస్ భవితవ్యం ప్రశ్నార్థకమే.

ఈ నెల ౩౦ న పోలింగ్ జరిగింది. ఈ రోజు ఉదయం నుంచి ఓట్ల లెక్కింపు మొదలయింది.

నిరుద్యోగుల, ఆయన ప్రాజక్టుల్లో భూములుకోల్పోయిన పేదరైతుల, ధరణి యాప్ బాధితుల  ఆగ్రహం ఈ ఎన్నికలలో బిఆర్ ఎస్ ఓటమికి ప్రధాన కారణమని చెబుతున్నారు.

ఈ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అనూహ్య విజయం వైపు దూసుకుపోతున్నది. అందునా కెసిఆర్ తీవ్రంగా ద్వేషించిన వ్యక్తి చేతిలో ఆయన పరాజయం ఎదుర్కొంటున్నారు.

 కేవలం  పదేళ్లలోనే ముఖ్య మంత్రి కెసిఆర్ నాయకత్వంలోని భారత రాష్ట్ర సమితి ని ప్రజలు తిరస్కరించే పరిస్థితి ఏర్పడింది.  ఈ వార్త రాస్తున్నప్పటికి కాంగ్రెస్ ఎంత మెజారిటీ సాధిస్తుందో స్పష్టత లేకపోయినా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే మెజారిటీ సాధిస్తున్నదని తెేలిపోయింది. పిసిసి అధ్యక్షుడు ఎ రేవంత్ రెడ్డి కోడంగల్ నియోజకవర్గంలో గెలుపొందారు. అయితే, ఆయన పోటీ చేస్తున్న రెండో నియోజకవర్గంలో కామారెడ్డిలో బిజెపి నుంచి గట్టిపోటీ ఎదుర్కొని బిజెపిచేతలో ఓడిపోయారు.ఈ ఎన్నికల్లో ఎన్నో విచిత్రాలు ఎదురయ్యాయి.

తాను పోటీ చేసిన రెండో నియోజకవర్గం కామారెడ్డి లో బిజెపితో చేతిలో కెసిఆర్ ఓడిపోయారు...

 ఇక కాంగ్రెస్ కు సంబంధించి ఈ ఎన్నికల్లో  ముఖ్యమంత్రి పదవి ఆశిస్తున్న అనేక మంది కాంగ్రెస్ నేతలు గెలువబోతున్నారు. దీనితో పదవి కోసం తీవ్రమయిన పోటీ నెలకొనబోతున్నది. మాజీ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి హుజూర్‌నగర్ నుంచి విజయం సాధించారు. కోమటి రెడ్డి వెంకటరెడ్డి, సీతక్క కూడా విజయసాధించే దిశలో ఉన్నారు. మధిర నియోజకవర్గం నుంచి సిఎల్ పి నేత మల్లు భట్టి విక్రమార్క గెలుపొందారు.

గజ్వేల్ నియోజకవర్గంలో ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు ముందంజలో ఉన్నారు. ఆయనను ఓడిస్తానని శపథం చేసి పోటీకి దిగిన బిజెపి నేత ఈటల రాజేందర్ ఓటమిపాలవుతున్నారు. ఈటెల తన సొంత నియోజకవర్గం హుజూరాబాద్ లో కూడా వెనకబడి ఉన్నారు.

జనసేన పార్టీ అభ్యర్థులకు డిపాజిట్లు గత్లంతు. పోటీ చేసిన 8 స్థానాల్లోనూ ఘోరంగా ఓటమి పాలైన అభ్యర్థులు. తెలంగాణలో తొలిసారి ఎన్నికలబరిలోకి దూకిన జనసేన ఇది పెద్దపరాభవం.ఈసారి బిజెపితో పొత్తు పెట్టుకుని ఎనిమిది స్థానాలలో జససేన పార్టీ పోటీ చేసింది. పార్టీ అధినేత పవన్ కల్యాణ్ కూడా ప్రచారం చేశారు. అయితే, ఫలితం దక్కలేదు. అభ్యర్థులంతా డిపాజిట్లు కోల్పోయారు.

ఇక బిజెపి విషయానికి వస్తే తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు,కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి సొంత నియోజకవర్గం అంబర్‌పేటలో బీజేపీ అభ్యర్థి కృష్ణాయాదవ్ ఓటమిపాలయ్యారు. ఇది కిషన్ రెడ్డికి షాక్. ఈ ఎన్నికల్లో కిషన్ రెడ్డి పోటీ చేయలేదు గాని అంబర్ పేటను కాపాడుకునేందుకు బాగా ప్రయత్నించారు. అంబర్‌పేట బీజేపీ అభ్యర్థిగా కృష్ణయాదవ్‌ను ఎంపిక చేసి ఆయనను గెలిపించే బాధ్యతనును తీసుకున్నారు. అయినా కృష్ణాయాదవ్‌ను గెలిపించుకోవటంలో కిషన్ రెడ్డి విఫలమయ్యారు. మొత్తంగా భారతీయ జనతా పార్టీ ఎన్నిక‌ల్లో బాగా వెనుకబడి ఉంది. కిషన్ రెడ్డి పార్టీ అధ్యక్షుడిని చేసి బిజెపి పెద్ద తప్పు చేసిందని పార్టీనేతలే కాదు, ప్రజలూ భావించారు. బండి సంజయ్ ని తీసేయడం ఎవరికీ నచ్చలేదు, అది పార్టీకి ఉపయోగపడలేదు, అభ్యర్థులకు ఉపయోగపడలేదు. బిజెపి తెలంగాణ అధ్యక్షుడిగా కిషన్ రెడ్డి విఫలమయ్యారు. 

కామారెడ్డి బిజెపి అభ్యర్థి కె వెంకటరమణారెడ్డి (కెవిఆర్) గెలుపొందారు. నియోజకవర్గంలో కెసిఆర్ కు వ్యతిరేకంగా రైతులను కూడ దీసి రైతు వ్యతిరేక మాస్లర్ ప్లాన్ ను ఉపసంహరించుకునేలా చేశారు. ఆయన చాలా జాగ్రత్తగా క్యాంపెయిన్ చేసి, కెసిఆర్, రేవంత్ ఇద్దరూ పరాయివాళ్లు, నాన్ లోకల్స్, అని ప్రచారం చేసి ప్రజలను వప్పించారు. వాళ్లిద్దరిలో ఎవరూ గెలిచినా ఉప ఎన్నిక తప్పదని ఆయన చేసిన బలమయిన ప్రచారం  ప్రజలను ఆకట్టుకుంది. ఇది బిజెపి గెలుపు అనడం కంటే ఆయన వ్యక్తి గత విజయం అనడం సబబు. ఇలా అయన జెయింట్ కిల్లర్ అయ్యారు.

బీజేపీ నుండి పోటీ చేసిన ముగ్గురు ఎంపీలు సోయం బాపు రావు, బండి సంజయ్, ధర్మపురి అరవింద్ ఓడిపోతే కాంగ్రెస్ నుండి పోటీ చేసిన ముగ్గురు ఎంపీలు రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి గెలుపొందారు.

ఈరోజు నుండి తెలంగాణ ప్రజలకు స్వేచ్ఛ స్వాతంత్య్రం సౌభ్రాతృత్వం లభించింది. ఇది ప్రజాస్వామ్య విజయం అని ఎన్నికల మీద సిఎల్ పి నేత మల్లు భట్టి విక్రమార్క వ్యాఖ్యానిం చారు.

ఈ పార్టీతరఫున ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్ షా ప్రచారం చేశారు. బిసి నేతని ముఖ్య మంత్రి చేస్తా మన్నారు. ఎస్ సిల గ్యాటగరైజేషన్ చేస్తామన్నారు. ఈ ఎత్తుగడలను ప్రజలను విశ్వసించలేదు.ఆ పార్టీకి చెందిన ప్ర‌ధాన నాయ‌కులు క‌నీసం గట్టి పోటీ ఇవ్వ‌లేక‌పోయారు. క‌రీంన‌గ‌ర్ నుంచి పోటీ చేసిన బండి సంజ‌య్, హుజురాబాద్‌లో ఈట‌ల రాజేంద‌ర్, కోరుట్ల‌లో ధ‌ర్మ‌పురి అర‌వింద్, దుబ్బాక ర‌ఘునంద‌న్ రావు వెనకబడిపోయారు. ఈ వార్త రాస్తున్నప్పటికి గోషామహల్ నియోజకవర్గంలో బిజెపి రాజాసింగ్ అధికత్యతో ఉన్నట్లు సమాచారం.

సిరిసిల్ల నియోజ‌క‌వ‌ర్గంలో బీఆర్ఎస్ అభ్యర్థి ఐటి మంత్రి కెటి రామారావు అధిక్యంలో ఉన్నారు. ఆధిక్యంలో ఉంది. ఇదే విధంగా ద్దిపేటలో మంత్రి హరీశ్‌ రావు భారీ మెజార్టీతో దూసుకుపోతున్నారు. ఓట్ల లెక్కింపు ప్రారంభమైనప్పటి నుంచి ప్రతి రౌండ్‌లో తన ఆధిక్యాన్ని పెంచుకుంటూ పోతున్నారు. అనేక మంది క్యాబినెట్ మంత్రులు ఓటమిపాలవుతున్నారు. అయితే, స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి బాన్స్ వాడ నుంచి గెలుపొందారు. కానీ,పాలకుర్తి నియోజకవర్గంలో తొలిసారి పోటీ చేసిన యశస్వి రెడ్డి అనే మహిళ చేతిలో సీనియర్ నాయకుడు, మంత్రి ఎర్రబల్లి దయాకర్ రెడ్డి ఓటమి పాలయ్యారు.

తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు రేవంత్ రెడ్డిని డీజీపీ అంజనీ కుమార్ మర్యాదపూర్వకంగా కలిశారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ ఆధిక్యం దిశగా దూసుకెళ్తున్న నేపథ్యంలో డీజీపీ రేవంత్ రెడ్డిని కలవడం ఆయనే కాబోయే ముఖ్యమంత్రి అనేందుకు సూచనగా ప్రజలు చెప్పుకుంటున్నారు.

 


Tags:    

Similar News