మెస్సీతో ఫొటో దిగాలంటే చాలా కాస్ట్లీ గురూ
మెస్సీ పక్కన 30 సెకన్లు నిలబడి ఫొటో దిగాలని అనుకునే వారు రు. 50 లక్షలు చెల్లించాలని స్వయంగా రేవంతే చెప్పాడు
ప్రపంచ ఫుట్ బాల్ రంగంలో లియొనల్ మెస్సీ పెద్ద దిగ్గజమనే చెప్పాలి. మెస్సీకి ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమంది అభిమానులున్నారు. దాదాపు 150కి పైగా దేశాలు ఫుట్ బాల్ ను ఆడుతున్నాయి. ఫుట్ బాల్ ప్రపంచానికి(Lionel Messi) మెస్సీని కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఫుట్ బాల్(Football star) దిగ్గజం కాబట్టి మ్యాచ్ ఫీజుతో పాటు అడ్వర్టైజ్మెట్ల ఎండార్స్ మెంట్ కు కూడా చాలా భారీగా డబ్బులు వసూలు చేస్తున్నాడు. ఇపుడు విషయం ఏమిటంటే ఈనెల 13వ తేదీన హైదరాబాద్(Hyderabad) లో ఎగ్జిబిషన్ మ్యాచ్(Exhibition Match) జరగబోతోంది. ఈనెల 8,9 తేదీల్లో ఫైదరాబాదులో (Telangana Rising)తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్-2047 జరగబోతోంది. రెండు రోజుల సదస్సు అయిపోయిన తర్వాత 13వ తేదీన ఉప్పల్ స్టేడియంలో(Revanth) రేవంత్ జట్టుకు మెస్సీ జట్టుకు మ్యాచ్ జరగబోతోంది.
ఎగ్జిబిషన్ మ్యాచ్ కోసం హైదరాబాద్ వస్తున్న ఈ ఫుట్ బాల్ దిగ్గజం కొన్నిగంటలు నగరంలోనే ఉండబోతున్నాడు. కాబట్టి మెస్సీని అభిమానించే సాకర్ ప్రేమికుల్లో కొందరైనా తనతో ఫొటో దిగాలని అనుకోవటం సహజం. అయితే మెస్సీ పక్కన 30 సెకన్లు నిలబడి ఫొటో దిగాలని అనుకునే వారు రు. 50 లక్షలు చెల్లించాలని స్వయంగా రేవంతే చెప్పాడు. మెస్సీతో ఫొటో దిగే అవకాశం కల్పించాలని విలేకర్లు అడిగినపుడు రేవంత్ పై విషయం చెప్పాడు. ‘‘అంతర్జాతీయ ఫుట్ బాల్ స్టార్ ఆటగాడు లియొనెల్ మెస్సీతో 30 సెకన్లు పక్కన నిలబడి ఫొటో దిగాలని అనుకుంటే రు.50 లక్షలు చెల్లించాల్సి ఉంటుంది’’ అని రేవంత్ చెప్పటంతో మీడియా మిత్రులకు షాక్ తగిలినట్లయ్యింది.
మెస్సీ కాస్ట్లీ అని తెలుసుకాని మరీ ఇంత కాస్ట్లీ అని తెలీదు. ఫొటో తీసుకోవటానికి రు. 50 లక్షలు చార్జి చేస్తున్న మెస్పీ మరి హైదరాబాదుకు రప్పించేందుకు ప్రభుత్వం ఇంకెంత ఖర్చు పెడుతోందో అనే సందేహం రావచ్చు. ఇదే విషయమై రేవంత్ మాట్లాడుతు ‘‘తాము ప్రభుత్వపరంగా ఏమీ ఖర్చు చేయటంలేదని, దానికి ప్రత్యేక స్పాన్సర్లు ఉన్నారు’’ అని వివరించారు. రు. 50 లక్షలు చెల్లించి మెస్సీతో ఎంతమంది ఫొటోలు దిగుతారో చూడాలి.