నెరవేరని కెసిఆర్ కల, నెరవేర్చనంటున్న రేవంత్

ఆ ఒక్క కల కెసిఆర్ నెరవేర్చుకోలేకపోయారు. పదేళ్లలో అన్నీ తన కిష్టంగా మార్చుకున్నా, ఆ ఒక్క విషయంలో మాత్రం వెనకబడి పోయారు. అది నెరవేరుతుందా?

Update: 2023-12-15 03:41 GMT

పదేళ్లు అధికారంలో ఉన్నపుడు ముఖ్యమంత్రి కెచంద్రశేఖర్ రావు తన కలలను చాలా మటుకు నెరవేర్చుకున్నారు. తనకు నచ్చని సెక్రెటేరియట్ ను కూల్చి కొత్తది కట్టుకున్నారు. తనకు నచ్చని క్యాంపు అఫీసులోకి కాలుమోపకుండా కొత్తది కట్టుకున్నారు. ఇంకొక్క కల ఉండింది. మరొక కూల్చి ఇంకొక చొటకట్టాలనుకున్నారు.  ఆ కల నెలవేరలేదు. అదేంటంటే కొత్త అసెంబ్లీ కట్టడం. అది కడితే,ఆయనకు నిజాం తర్వాత అంత కీర్తి దక్కేది. ఎందుకంటే, ఇపుడున్న అసెంబ్లీ కట్టింది నిజామే కాబట్టి. దాని స్థానంలో కొత్త అసెంబ్లీ కట్టిన ఘనత ఆయనకే దక్కేది. ఎలాగైనా సరే అసెంబ్లీ కట్టించితీరాలన్నది ఆయన కోరిక. దానిని అనేక సార్లు ఆయన అసెంబ్లీలో వెల్లడించారు. సభల్లో నొక్కి చెప్పారు. ఒక సారి అసెంబ్లీలో ఏమన్నారంటే...




 


“మనం ఉన్న అసెంబ్లీ ఎలా ఉంది. శాసనసభ నుంచి శాసనమండలి కి వెళ్లాలంటే ఎలా వెళ్లాలి? ఎన్ని వంపులు తిరగాలి.  అసెంబ్లీ దగ్గిర పార్కింగ్ కు జాగా ఏది? అన్ని వసతులతో కొత్తది కట్టాలి. ఖర్చు రూ.500 కోట్ల  లోపు ఉండేలా  నిర్మించేందుకుప్లాన్ వేస్తున్నా. కొత్త శాసనసభని తెలంగాణ ప్రజలకు చారిత్రక కట్టడం అందిస్తాం,” అన్నారు. కానీ ఈ సారి ఓడిపోయారు. పోనీ కొత్త ముఖ్యమంత్రి కడతారా అంటే, అలా కనిపించడం లేదు. అధికారంలో చేపట్టిన కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఎ రేవంత్ రెడ్డి కొత్త అసెంబ్లీ గురించి చాలా స్పష్టమయిన విధానం ప్రకటించారు.

"ప్రస్తుతం ఉన్న శాసనసభ భవనాలను సమర్థవంతంగా వినియోగించుకుంటాం. కొత్తగా ఎలాంటి భవనాలూ నిర్మించబోము. అయితే అసెంబ్లీ మంత్రులు, ఎమ్మెల్యేలు కలిసి మాట్లాడుకునేందుకు వీలుగా సెంట్రల్‌ హాల్‌ను . సెంట్రల్‌హాల్‌లోకి పరిమిత సంఖ్యలో మీడియాకు అనుమతి ఉంటుంది," అని అన్నారు. దీనితో ఆయనరేవంత్ తన దర్జాలకు, విలాసాలకు, విశ్వాసాలకు అనుగుణంగా కొత్త నిర్మాణాలు చేపట్టరని, బాధ్యతాయుతంగా నిధులు ఖర్చుచేస్తూ మెరుగయిన పాలన అందించేందుకు కృషి చేస్తారని భావించవచ్చు.

ఇలాంటి ఆసక్తికరమయిన నిర్ణయాలను ఆయన నిన్న విలేకరులతో మాట్లాడుతూ సూచన ప్రాయంగా వెల్లడించారు. ఆ నిర్ణయాలు ఏమిటంటే...

1. TSPSC పేపర్ల లీకేజీల పై హైకోర్టు సిటింగ్‌ జడ్జితో విచారణ. ఈ మేరకు హైకోర్టులో అఫిడవిట్‌ దాఖలు చేస్తారు. హైకోర్టు సిటింగ్‌ న్యాయమూర్తి తో విచారణ కోరాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇపుడున్న స్వరూపంతో టిఎస్ పిఎస్ సి నియామకాల ప్రక్రియనుముందుకు తీసుకెళ్తే ఉద్యోగార్థులకు నమ్మకం ఉండదు. కొత్త కమిషన్‌ కొత్త చైర్మన్‌, కొత్త సభ్యులతో ఉద్యోగాల భర్తీ, పరీక్షల నిర్వహణ చేపడతారు.

2. శాఖలన్నీ గందరగోళంగా ఉన్నాయి. ప్రజలకు తెలియాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. మంత్రులతో చర్చించి అన్ని శాఖలపై శ్వేతపత్రాలు విడుదల చేస్తారు.

3. ముఖ్యమంత్రిగా సొంత కారే వినియోగం. గత ముఖ్యమంత్రి వాడిన కాన్వాయ్‌తో ముందుకు సాగడం. సొంత కారుకే బుల్లెట్‌ ఫ్రూఫ్‌ స్టిక్కరింగ్‌ . కొత్త బుల్లెట్‌ ఫ్రూఫ్‌ కాన్వాయ్‌ కొనాలంటే మళ్లీ రూ.50 కోట్లు ఖర్చు, అంత వృథా వద్దు. ఉన్న కాన్వాయ్‌ కార్ల సంఖ్య కూడా తగ్గింపు.

4. మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రం (ఎంసీఆర్‌హెచ్‌ఆర్డీసీ)లో ఒకవైపు ఖాళీగా ఉన్న ఒకటిన్నర ఎకరాల స్థలంలో అతిథి భవనం . ఎవరైనా ముఖ్యమైన సందర్శకులు వచ్చినప్పుడు వారిని కలిసేందుకు ఆ అతిథి భవనాన్ని ఉపయోగిస్తారు. అక్కడ ఉన్న ఖాళీ స్థలంలో ఒక ఆట మైదానం.

5. మరోవైపు ప్రగతి భవన్‌లోని ఒక మందిరంలో ప్రజావాణి., గత సీఎం కేసీఆర్‌ ఉన్న భవనాన్ని డిఫ్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు కేటాయించారు. అక్కడ ఇంకో భవనం, మరో రెండు పాత భవనాలు కూడా ఉన్నాయన్నారు. ఒక భవనాన్ని సీఎం క్యాంప్‌ కార్యాలయంగా ఉపయోగిస్తారు. మరొక దానిని ఇప్పుడు ఒక మంత్రికి కేటాయించడమో, ఎవరైనా అతిథులు వస్తే ఉండేందుకు గెస్ట్‌హౌ్‌సగా ఉపయోగిస్తారు.

6. ఖాళీగా ఉన్న మరో భవనంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్ధులకు స్కిల్‌ డెవల్‌పమెంట్‌ సెంటర్‌ను ఏర్పాటు.

7. మరోవైపు ప్రస్తుతం ఉన్న శాసనసభ భవనాలను సమర్థవంతంగా వినియోగించుకుంటాం. కొత్తగా ఎలాంటి భవనాలూ నిర్మించరు.

8. అయితే అసెంబ్లీ మంత్రులు, ఎమ్మెల్యేలు కలిసి మాట్లాడుకునేందుకు వీలుగా సెంట్రల్‌ హాల్‌ను . సెంట్రల్‌హాల్‌లోకి పరిమిత సంఖ్యలో మీడియాకు అనుమతి ఉంటుంది.

9. మెట్రో రైలు విస్తరణకు రాయదుర్గం నుంచి ఎయిర్‌పోర్టు మార్గం సరైనదికాదు. అందుకే ఎయిర్‌పోర్టు మెట్రోలైన్‌ రూట్‌ను మార్పు. పాతబస్తీ ప్రాంతం మీదుగా ఎయిర్‌పోర్టుకు తక్కువ దూరంలో చేరుకోవచ్చు. పాతబస్తీ మీదుగా విమానాశ్రయానికి 25 కిలోమీటర్లే. అదే రాయదుర్గం నుంచి అయితే 50కిలోమీటర్లు అవుతుంది. దూరం పెరగడం వల్ల నిధులు వృథా.

10. గత ప్రభుత్వం వ్యవసాయానికి కరెంటు 12, 13 గంటలకు మించి ఇవ్వలేదని చెప్పారు. ఈ అంశంపై అందరితో చర్చించి సమయం వచ్చినపుడు శ్వేతపత్రం విడుదల చేస్తారు.

11. రాష్ట్రంలో ఇప్పటికే 54 కార్పొరేషన్ల చైౖర్మన్లను తొలగిస్తూ ఉత్తర్వులిచ్చామని, మరో ఇద్దరు చైర్మన్‌లు మిగిలిపోయారని, వారినీ తొలగిస్తూ ఉత్తర్వులిస్తారు. 

12. ధరణి విషయంలో  అధికారులు చెప్పేదంతా పూర్తిగా విన్నారు.  తర్వాత ఆ విధానంలో ఉన్న 33 మాడ్యూల్స్‌పైన ప్రశ్నలు వేశారు. వాటిలో కొన్నింటికి సమాధానాలు వచ్చాయి. కొన్నింటికి రాలేదు. వారం రోజుల్లో సమగ్ర నివేదిక ఇవ్వాల్సిందిగా ఆదేశించారు. అపుడు మరోసారి దీనిపై సమీక్ష

Tags:    

Similar News