అంతా కలవరించి పలవరించిన ‘మారుతి 800’ కు నలభైయేళ్లు

భారతీయుల కార్ కలను నిజం చేసి, రోడ్లకు వన్నెతెచ్చిన ఈ బుల్లికారు పుట్టి ఇప్పటికి 40 యేళ్లు... అయినా ఇపుడు అదొక తీపి గురుతే...

Update: 2023-12-14 08:52 GMT
Maruti 800 (1996) (source: Wikimedia commons)


పుట్టుకతోనే ప్యాసింజర్ కార్ మార్కెట్ లీడర్ గా తయారయిన ‘మారుతి ౮౦౦’ కారుకు కు 40 యేళ్లు పడ్డాయి. ఇంకా అక్కడక్కడ ఈ కార్లు కనిపిస్తూనే ఉంటాయి. చవకైనా, మేలు రకం కారును తయారు చేసేందుకు మారుతి, జపాన్ కు చెందిన సుజుకి మోటార్స్  జాయింట్ వెంచర్‌ ఫలితం ఈ బుల్లికారు.  ఒక చిన్నకారును, ప్రజలందరికి అందుబాటులో ఉండే కారును తయారుచేసేందుకు ఈ  ఒప్పందం కుదుర్చుకోవడం భారతీయ ప్యాసెంజర్ వాహన రంగంలో పెద్ద పరిణామం.  భారతీయరోడ్ల మీదికి ఒక బుల్లి కారు జరజర దూసుకుపోతూ కనిపించి కనువిందు చేసేందుకు బాట వేసిన ఒప్పందం అది. అపుడపుడే విస్తరిస్తున్న భారతీయ మధ్యతరగతి కుటుంబాల కారు కలని ఈ జాయింట్ వెంచర్ నెరవేర్చింది.

అంతవరకు ఎవరో సంపన్నులకు, ప్రభుత్వాధికారులకు, కొంత మంది రాజకీయ నాయకులకు పరిమితమయిన కారు, మొట్టమొదటి సారి 1983 లో మధ్య తరగతి కుటుంబాలకు చేరువయింది.

ప్రయాణం ఇలా ప్రారంభం

ఇది 1971లో అప్పటి భారత ప్రభుత్వం ప్రజల కార్ల తయారీ వేటలో పడింది. అపుడు ఈ ఐడియాకు పోటీదారు వోక్స్‌వ్యాగన్‌ మాత్రమే.

మారుతీ భారతీయ కస్టమర్ల కోసం ఒక మన్నికయిన సరసమయిన కార్ ను పరిచయం చేయాలని నిర్ణయించుకున్నాక అనేక అంతర్జాతీయ కంపెనీలతో  చర్చలు జరిపింది. వోక్స్‌వ్యాగన్‌తో సహా చాలా మంది తయారీదారులతో మాట్లాడింది. జెట్టాను భారత మార్కెట్లోకి తీసుకురావాలనుకుంది. కానీ వివిధ కారణాల వల్ల అవి విజయవంతం కాలేదు. ఈ కార్లవేటలో భాగంగా మారుతి బృందం జపాన్‌ను సందర్శించింది. అపుడు సుజుకి తయారు చేసిన SS80 కారును చూసింది. ఆ కారుమాయలో పడింది. 

అపుడు సంజయ్ గాంధీ మారుతీ ఉద్యోగ్ మేనేజింగ్ డైరెక్టర్ గా ఉండేవారు. ఈ SS80ని చూసినప్పుడు, ఇదే భారతీయ పరిస్థితులకు తగిన కారు దానిని భారతదేశంలో ప్రవేశపెట్టాలని ఆయన నిర్ణయించారు.

అంతే, ఒప్పందం కుదిరింది. కారు నమూనా తయారుయింది. కారుకి మారుతి 800 పేరుపెట్టారు.

మారుతి ఉద్యోగ్, సుజుకి వెంచర్ ఫిబ్రవరి 24, 1981న ప్రారంభమైంది. 1983లో మారుతి 800 కారును విడుదల చేసింది. ఇంత తక్కువ కాలంలో కారును మార్కెట్ లోకి విడుదల చేయడం కూడా ఒక రికార్డే

కారు నమూనా తయారయింది. అది అన్ని అంచనాలను అందుకుంది, చివరకు 1983లో ఉత్పత్తి ఈ కారుకు కస్టమర్ల నుండి విపరీతమైన స్పందన లభించింది. ఈ పోటీ వల్ల ఎలాంటి గందరగోళం ఏర్పడకుండా ఉండేందుకు మొదటి కస్టమర్‌ను లాటరీని తీయడం ద్వారా ఎంపిక చేశారు.

ఇండియన్ ఎయిర్‌లైన్స్ ఉద్యోగి హర్పాల్ సింగ్ కు లాటరి తగిలింది. మొట్టమొదటి మారుతీ 800ని మార్కెట్ లో కొని ఇంటికి తీసుకెళ్లిన అదృష్టవంతుడాయనే. అయితే, భారతదేశపు మొట్టమొదటి మారుతీ 800 కారు తాళం చెవిని కంపెనీ అప్పటి ప్రధాని ఇందిరా గాంధీకి అందజేసింది.

ఆ కారు భారతదేశాన్ని ఉర్రూత లూగించింది. కారుకోసం జనం విపరీతంగా ఎగబాడ్డారు. రెండింతలు రేటిచ్చి కొనేందుకు సిద్ధమయ్యారు. అప్పట్లో మారుతీ 800 ధర రూ.47,500 మాత్రమే. తన కారును విక్రయిస్తే దాదాపు లక్ష రూపాయలిచ్చేందుకు కూడా హర్ పాల్ సింగ్ కు చాలామంది ఆఫర్ చేశారు .

DIA 6479 నంబర్ తో హర్పాల్ సింగ్ మారుతీ 800 కారు ఢిల్లీలో రిజిస్టర్ చేయబడింది. 2010లో ఆయన మరణించే వరకు ఆ కారు అతని వద్దే ఉండింది.

హర్పాల్ సింగ్ భార్య 2012లో మరణించిన తరువాత, అతని పిల్లలు దానిని ఉపయోగించకపోవడంతో కారు మూలన పడింది. కాలక్రమంలో అనేక మంది కార్లు గరాజులలో పడి ఉడిపోయాయి. ఇంటర్నెట్ వచ్చాక ఇలాంటి కార్లన్నీ అందరికంట పడటం మొదలయింది. మారుతి 800 కార్ల చిత్రాలు తెగ వైరలయ్యాయి చాలా మంది అప్పటి యజమానుల నుండి కారును తిరిగి కొనుగోలు చేశారు కూడా. దీనితో కార్ల విడిభాగాలకు గిరాకి పెరిగింది.

మారుతి సుజుకి ఈ కారు కి అవసరమయిన అన్ని విడి భాగాలు అందుబాటులోకి తెచ్చి సరికొత్త మారుతి 800 రోడ్ల మీదకు వచ్చేందుకు సాయం చేసింది.

అయితే, కారు వయసు మీరడంతో  రోడ్లపై నడపడానికి అధికారులనుంచి అభ్యంతరాలు మొదలయ్యాయి. దీనితో ఈ కార్లు కనమరుగు కావడం మొదలయింది.  అయితే, ఈ కార్ల విప్లవానికి తీపి గురుతుగా  మారుతి సుజుకి ఒక మారుతి 800 కారును కంపెనీ ప్రధాన కార్యాలయంలో ప్రదర్శనకు ఉంచాలని నిర్ణయించుకుంది.కారు లోపలి భాగానికి కూడా పూర్వ వైభవానికి తీసుకు వచ్చి ప్రదర్శనలో పెట్టారు.

విశేషమేమిటంటే, ఈ కంపెనీ కేవలం 13 నెలల్లో డిజైన్ రూపొందించి ఉత్పత్తికి కూడా వెళ్ళి రికార్డు సృష్టించింది.  ఆ  రోజుల్లో రోడ్లమీద ఈ బుల్లి కారు తిరుగుతూ ముచ్చట కొలిపింది. దాన్కొక విశేషంగా జనం తిలకించారు.

1997 వరకు భారతీయ రోడ్లపై ఉన్న మొత్తం కార్లలో 80 శాతం పై వాటా మారుతి 800 దే.

దీని తర్వాత మారుతి సుజుకి కార్ల విస్తరణ మొదలయింది.

ఓమ్ని, ఎస్టీమ్, జెన్, 1000తోకార్లు వచ్చాయి. విశేష ఆదరణ పొందాయి.

తర్వాత కిజాషి, గ్రాండ్ విటారా వంటి మోడళ్లతో లగ్జరీ విభాగంలోకి ప్రవేశించింది గాని, అది విఫలమైంది.

నెక్సా (NEXA) తో తిరిగొచ్చింది. మారుతీని ప్రీమియం బ్రాండ్‌గా ఎలివేట్ చేసింది. బాలెనతో మారుతి నుండి ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ విభాగంలో బెస్ట్ సెల్లర్ ఉద్భవించింది.

రీసేల్ వాల్యూకు పర్యాయపదం

మారుతి కార్ల మరొక విశేషం రీసేల్ వాల్యూ. కొన్న తర్వాత, మూడు నాలుగేళ్లు వాడినా 40-50 శాతం తక్కువ కాకుండా రీసేల్ చేసుకోవచ్చు. ఇది బ్రాండ్ మారుతి విశ్వసనీయత.

Tags:    

Similar News