తెలంగాణలో భారీ కరెంటు బిల్లు ఎగ్గొట్టిందేవరో తెలుసా!

కరెంటు బిల్లు కట్టకపోతే ఫ్యూజ్ పెరికేస్తామని ప్రతి నెలా పదో తేదీ దాటగానే ఆటో చాటింపు వేస్తారు. ఈ చాటింపు అందిరికి వినిపించింది, ఆయనకు తప్ప...

Update: 2023-12-11 03:36 GMT
తెలంగాణ విద్యుత్ సంస్థలుకు ప్రభుత్వం బిల్లులు చెల్లించనే లేదు...

ప్రతినెల పదో తేదీ దాట గానే హైదరాబాద్ నగరంలో ఒక ఆటో చాటింపేసుకుంటు, బెదిరిస్తూ తిరుగుతూ ఉంటూంది. ఈ నెల కరెంటు బిల్లు తక్షణ మే చెల్లించని పక్షంలో ఎలాంటి నోటీసు లేకుండా మీ కరెంటును డిస్ కనెక్ట చేస్తామనేది ఈ బెదిరింపు.

ఇది బెదిరింపు లాగా కనిపించినా ఇందులో వాస్తవముంది. అదేంటే కరెంటును మన ఇళ్లకు డిస్ట్రిబ్యూషన్ చేస్తున్న సంస్థ ఈ కరెంటును కొనాలి, దానికి డబ్బు కావాలి. అదేవిధంగా ఈ సంస్థలో పనిచేసే ఉద్యోగులకు జీతాలివ్వాలి. దానికీ నిధులు కావాలి.అందువల్ల ఆటో చాటింపు మంచిదే. ప్రజలకు బాధ్యతను గుర్తు చేసేదే.

వినియోగదారులు డబ్బులివ్వకపోతే కరెంటు డిస్ట్రిబ్యూషన్ సంస్థ ఎలా నడుస్తుంది? అందువల్ల ప్రజలంతా టంచన్ గా కరెంటు బిల్లులు కడుతూ వుంటారు. కట్టని వాళ్లు చాలా చాలా తక్కువ. అది లెక్కలోకి రాదు.

నిత్యజీవితాసరాలకు కరెంటు వాడి బిల్లు కట్టకపోవడమనేది సాధారణ పౌరులెవరూ చేయరు. ఎందుకంటే, కరెంటు సరఫరా చేసే సంస్థ పనిచేయాలనే జ్ఞానం పౌరులందరికి ఉంది. లేనిది ప్రభుత్వానికి.గత ప్రభుత్వ ఈ ఆటోచాటింపు వినలేదా. విననట్లే ఉంది. ఎందుకంటే, రాష్ట్రంలో కరెంటు బిల్లులను కట్టకుండా ఎగ్గొంటింది కెసిఆర్ నాయకత్వంలోని తెలంగాణ ప్రభుత్వమే. ఇదేవరో కాంగ్రెసోలో బిజెపి వాళ్లో చేసిన ఆరోపణ కాదు. స్వయాన కరెంటోళ్లు బయట పెట్టిన వాస్తవం.

పేదలు, మధ్య తరగతి కుటుంబాల ప్రజలు ఠంచన్ గా కరెంటు బిల్లులు కడుతూంటే, ఒక్క బిల్లు కట్టకుండా ఎగ్గొట్టింది బిఆర్ ఎస్ ప్రభుత్వం. ప్రభుత్వం చేసిన ఘనకార్యాలన్నీ ముఖ్యమంత్రి ఖాతాలో పడినపుడు, బిల్లు కట్టకుండా ఎగ్గొట్టిన అపకీర్తి కూడా బిఆర్ఎస్ ప్రభుత్వాధినేత మీద పడాలి కదా?

కెసిఆర్ ప్రభుత్వం కరెంటు బిల్లు ఎగ్గొట్టిన విషయాన్ని ఆ శాఖ అధికారులు నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏర్పాటు చేసిన సమావేశం వెల్లడించారు. ఈ బిల్లులు ఎగ్గొట్టడంతో ఈ శాఖకు రావాలసి బకాయిలు దాదాపు 20 రెట్లు పెరిగాయి. గత ప్రభుత్వం ఏమీ చేయలేదు, ఆమాటకొస్తే, కాంగ్రెస్ ప్రభుత్వం నెహ్రూ కాలంనుంచి కూడా ఏ మీ చేయలేదని విమర్శిస్తూ వచ్చిన కెసిఆర్ ప్రభుత్వం గత పదేళ్లో ఏమిచేసిందో అధికారులు వెల్లడించారు.

2104లో తెలంగాణ ఏర్పడి, కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ముఖ్యమంత్రిగా ఏర్పడేనాటికి విద్యుత్ సంస్థలకు ప్రభుత్వం నుంచి రావలసిన బకాయీలు కేవలం రు. 1268 కోట్లే. ముఖ్యమంత్రిగా ఆయన దిగిపోయే నాటికి ఈ బకాయిలు రు. 28, 140 కోట్లకు చేరుకున్నాయి

ఇది ఎలా జరిగిందో నిన్నటి సమావేశంలో విద్యుత్ శాఖ అధికారుల పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చీ మరీ బయటపెట్టారు.

1. కాళేశ్వరంతో పాటు రాష్ట్రంలోని ఇతర ఎత్తిపోతల పథకాల నిర్వహణ కోసం వాడిన కరెంటు బిల్లుల బకాయిలు రూ.14,172 కోట్లు . 2014కు ముందు ఎత్తిపోతల పథకాల కరెంటు బకాయిలు రూ.103 కోట్లు మాత్రమే.

2. గత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చెప్పుకున్న మిషన్‌ భగీరథ కూడా కరెంటు బిల్లు ఎగ్గొట్టింది. ఈ పథకం అమలుకు వచ్చిన కరెంటు బిల్లు రూ.3,559 కోట్లు. ఈ బిల్లు చెల్లించలేదు.

3. హైదరాబాద్‌ మెట్రో వాటర్‌ సప్లై అండ్‌ సివరేజీ బోర్డు (జలమండలి) నుంచి పేరుకుపోయిన కరెంటు బిల్లు రూ.3,932 కోట్లు. పోయిన జీహెచ్‌ఎంసీ ఎన్నికలపుడు హైదరాబాద్‌ జంట నగరాల ప్రజలకు నల్లా నీళ్లను ఉచితంగా సరఫరా చేస్తామని కెటిఆర్ ప్రకటించారు. ఈ హామీని అమలుచేశారు. బాగుంది. దీనితో అదాయం లేని జలమండలి విద్యుత్‌ బిల్లులను చెల్లించలేక పోయింది. లెక్క ప్రకారం ఈ బిల్లును కట్టాల్సిందెవరు? ప్రభుత్వం. కాని బిల్లు కట్టలేదు. మిషన్‌ భగీరథ నీళ్లను సైతం గ్రామాల్లో ఉచితంగానే సరఫరా చేస్తుండటంతో ఆ విభాగం కూడా ఆదాయం లేక కరెంట్‌ బిల్లులను చెల్లించలేకపోయింది. మరిన ప్రభుత్వం కట్టాలిగా, కట్టలేదు.

4. బిల్లులు కట్టకపోవడమే, కాదు, కేంద్రం పంచాయితీలకువిడుదల చేసిన నిధులను కరెంటు బిల్లుల కింద రాష్ట్ర ప్రభుత్వమే జమచేసుంది. పోనీ ఈ డబ్బుతో కరెంటు బిల్లు చెల్లించవచ్చుగా. గ్రామ పంచాయతీలకు వస్తున్న కరెంటుబిల్లుల కోసం వచ్చిన రూ.3993 కోట్ల నిధులను పంచాయతీరాజ్‌ శాఖ ఖాతా నుంచి, మున్సిపాలిటీల విద్యుత్‌ బిల్లుల మొత్తం రూ.1183 కోట్లను రాష్ట్ర పురపాలక శాఖ ఖాతా నుంచి ప్రభుత్వం లాక్కుంది. ఇలా మొత్తం రూ.5,176 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం తన ఖాతాకు దారి మళ్లించింది. ఈ నిధులు రాజ్యాంగ నిబంధనల ప్రకారం స్థానిక సంస్థలకు కేంద్రప్రభుత్వం అందజేసిన నిధులు. ఈ విధంగా వివిధ ప్రభుత్వ విభాగాలు కట్టకుండా ఎగ్గొట్టిన బకాయిలు రూ.23,685 కోట్లు. దీనికి దారి మళ్లించిన లోకల్ బాడీస్ కేంద్ర నిధులను రూ.5,176 కోట్లు కలిపితే మొత్తం బకాయిలు రూ.28,861 కోట్లకు చేరాయి. ఈ విషయాలను అధికారులు వెల్లడించారు.

5. ఇక మరొక వింత జరిగింది. ట్రూప్ చార్జీల రూపంలో రూ.12,515 కోట్ల రాష్ట్ర ప్రభుత్వం బకాయిపడింది. ఆంధ్రాలో ట్రూఅప్ చార్జీలను ప్రజలనుంచి పిండేస్తున్నారు.ఇక్కడ అలా కాకుండా ప్రభుత్వం చెల్లిస్తుందని చెప్పారు. అయితే, చెల్లించలే. ఈ రెండు కలిపితే కలిపితే విద్యుత్ సంస్థలకు బిఆర్ ఎస్ ప్రభుత్వం ఎగ్గొట్టిన బిల్లులు రూ.40,655 కోట్లవుతాయి.

Tags:    

Similar News