ప్రముఖ బేకరీ పేస్ట్రీలో ఫంగస్..సోషల్ మీడియాలో వైరల్

హైదరాబాద్ నగరంలోని ఓ ప్రముఖ బేకరీలోని పేస్ట్రీలో ఫంగస్ వెలుగుచూసింది. చిన్న పిల్లలు తినే పేస్ట్రీలో ఫంగస్ వెలుగుచూసిన ఘటన సోషల్ మీడియాలో సంచలనం రేపింది.

Update: 2024-05-28 01:06 GMT
పేస్ట్రీలో ఫంగస్ (ఫొటో : ఎక్స్ సౌజన్యంతో)

హైదరాబాద్ నగరంలోని సైనిక్‌పురి ప్రాంతానికి చెందిన ప్రీతి బిస్వాస్ అనే మహిళ 5వ అవెన్యూ బేకర్స్ నుంచి ఎక్లెయిర్ పేస్ట్రీని కొన్నారు. ఇంటికి వచ్చాక ఈ పేస్ట్రీ ప్యాక్ ను విప్పి చూడగా ఫంగస్ కనిపించడంతో షాక్ కు గురయ్యారు.

- ఫంగస్ ఉన్న పేస్ట్రీని ఫొటోలు తీసి దాన్ని ఎక్స్ లో పోస్టు చేసి తెలంగాణ ఫుడ్ సేఫ్టీ కమిషనరుకు జత చేశారు. సైనిక్ పురి ప్రాంతంలో 30 ఏళ్లుగా ఉన్న ప్రముఖ బేకరీలో ఫంగస్ పేస్ట్రీ వెలుగుచూసిందని ప్రీతి బిస్వాస్ పెట్టిన పోస్టుకు సోషల్ మీడియాలో మూడు లక్షలకు పైగా వీక్షణలు వచ్చాయి.
- బేకరీ పేస్ట్రీలో ఫంగస్ రావడంపై నెటిజన్లు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. బేకరీల్లో పరిస్థితి సురక్షితంగా లేదని చాలా భయానకంగా ఉందని ఓ నెటిజన్ వ్యాఖ్యానించారు. ‘‘నేను నా సోదరుడితో కలిసి కొన్ని సంవత్సరాల క్రితం ఈ బేకిరీకి వెళ్లాను, బర్గర్ చుట్టూ కీటకాలు, ఈగలు ఉండటం చూసి, బేకరీకి వెళ్లడం మానుకున్నాను’’ అని మరో నెటిజన్ తెలిపారు.

సోషల్ మీడియాలో వైరల్
ఈ బేకరీ బాగోతంపై వినియోగదారుల ఫోరంలో దావా వేయండి అని మరో నెటిజన్ సూచించారు. పిల్లలు తినే బేకరీ వస్తువులు ఇలా ఫంగస్ చేరి ఉండటంపై కఠిన చర్యలు తీసుకోవాలని నెటిజన్లు డిమాండ్ చేశారు. మొత్తంమీద పేస్ట్రీలో ఫంగస్ పోస్టు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఫంగస్ పై నెటిజన్ల ఆందోళన
సోషల్ మీడియాలో పేస్ట్రీలో ఫంగస్ పై ఇంత పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నా తెలంగాణ ఫుడ్ సేఫ్టీ కమిషనర్ కానీ, జీహెచ్ఎంసీ ఆహార భద్రతా విభాగం నుంచి స్పందన లేదని ప్రీతి బిస్వాస్ గుర్తించారు. ఆహార భద్రతా సమస్యలను పరిష్కరించడానికి మరింత సమర్ధవంతమైన ప్లాట్ ఫారమ్ అవసరమని ప్రీతి మరో ట్వీట్ చేశారు. ఆహార కల్తీని, కాలం చెల్లిన ఆహార పదార్థాలను విక్రయిస్తున్న వారిపై ఫుడ్ ఇన్ స్పెక్టర్లు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రీతి ప్రశ్నించారు.

చిన్నారులూ జర జాగ్రత్త
హైదరాబాద్ నగరంలో ఏ ఫుడ్ బేకరీని ఇకపై విశ్వసించలేమని ప్రీతి వ్యాఖ్యానించారు. సైనిక్‌పురిలోని ప్రసిద్ధ బేకరీ 5వ అవెన్యూ బేకర్స్ 30 ఏళ్లుగా ఉందని, ఈ బేకరీ పేస్ట్రీలో ఫంగస్ కనిపించిందని ప్రీతి ఎక్స్ పోస్టులో పేర్కొన్నారు. చిన్నపిల్లలకు బేకరీల్లోని కాలం చెల్లిన ఆహార పదార్థాలు తినిపించకండి అంటూ నెటిజన్లు సూచించారు.

బట్టబయలైన టాప్ రెస్టారెంట్ల బాగోతం

హైదరాబాద్ నగరంలో పేరొందిన టాప్ రెస్టారెంట్ల బాగోతం తెలంగాణ ఫుడ్ సేఫ్టీ టాస్క్ ఫోర్స్ తనిఖీల్లో వెలుగుచూసింది. చిచా అస్లీ హైదరాబాదీ ఖానా రెస్టారెంట్ వంటగదిలో సింథటిక్ ఫుడ్ కలర్స్ ను అధికారులు కనుగొన్నారు. ప్యారడైజ్ ఫుడ్ కోర్టులో ధార బ్రాండ్ ప్యాకేజ్డ్ వాటర్ బాటిళ్లలో టీడీఎస్ స్థాయి 73 పీపీఎం ఉన్నట్లు పరీక్షల్లో తేలింది. లక్డీకాపూల్ లోని ప్రముఖ ద్వారకా రెస్టారెంట్‌లో చెడిపోయిన డెజర్ట్‌ను తిన్న తర్వాత తనకు వాంతులు, విరేచనాలు అయ్యాయని 35 ఏళ్ల మహిళ ఫిర్యాదు చేసింది. పలు ప్రముఖ హోటళ్లలోని కిచెన్లు అపరిశుభ్రంగా, బొద్దింకలతో ఉన్నాయని ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీల్లో తేలింది.










Tags:    

Similar News