370 ఆర్టికల్ రద్దు సబబే : సుప్రీంకోర్టు

జమ్మూ కాశ్మీర్ భారత్‌లో చేరినప్పుడు సార్వభౌమాధికారాన్ని కూడా కోల్పోయిందని, అదే విధంగా భారత్‌లో విలీనమైన మరుక్షణమే దాని రాజ్యాంగ సభ కూడా ఉనికిని కోల్పోయింది.

Update: 2023-12-11 09:24 GMT

రాజ్యాంగంలోని ఆర్టికల్ 370 ప్రకారం జమ్మూ కాశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని రద్దు చేస్తూ కేంద్రం తీసుకున్న చర్యను సుప్రీంకోర్టు ఈ రోజు సమర్థించింది. అంతేకాదు,  వచ్చే ఏడాది ఎన్నికలు నిర్వహించాలని కూడా ఆదేశించింది.

ఆర్టికల్ 370 అనేది భారతదేశంలో జమ్మూ కాశ్మీర్ విలీనాన్ని సులభతరం చేయడానికి తీసుకువచ్చిన తాత్కాలిక నిబంధన అని మాత్రమేనని భారత ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ ఐదురుగు సభ్యుల బెంచ్ తరఫున మెజారిటీ తీర్పును Supreme Court Backs Scrapping Of J&K Autonomyతీర్పును చదివి చెప్పారు.

జమ్ము కాశ్మీర్ హోదా ఇతర రాష్ట్రాలతో సమానంగానే ఉండాలని చెబుతూ వచ్చే సెప్టంబర్ 30 లోగా నిర్వహించాలని కూడా ఆయన ఆదేశించారు.

జమ్మూ కాశ్మీర్ భారత్‌లో చేరినప్పుడు సార్వభౌమాధికారాన్ని కూడా కోల్పోయిందని, అదే విధంగా భారత్‌లో విలీనమైన మరుక్షణమే దాని రాజ్యాంగ సభ కూడా ఉనికిని కోల్పోయిందని సుప్రీంకోర్టు పేర్కొంది.

"జమ్ము కాశ్మీర్ రాజ్యాంగ సభ శాశ్వత సంస్థగా ఏర్పాటుచేయలేదు. ఇది రాజ్యాంగాన్ని రూపొందించడానికి మాత్రమే ఏర్పడింది. ఆ రాజ్యాంగ సభ సిఫార్సుకు రాష్ట్రపతి కట్టుబడి ఉండాల్సిన పనిలేదు" అని ప్రధాన న్యాయమూర్తి చంద్రచూడ్ అన్నారు.

అయితే, రాష్ట్రానికి "అంతర్గత సార్వభౌమాధికారం" లేనప్పటికీ, భారతదేశంలో విలీనమైన తర్వాత ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఎందుకు కొనసాగిందో సుప్రీంకోర్టు వివరించింది.

"రాజ్యాంగ అసెంబ్లీ ఉనికిలో లేనప్పుడు, ఆర్టికల్ 370 ప్రవేశపెట్టిన ప్రత్యేక షరతు కూడా ఉనికిలో లేదు. కానీ రాష్ట్రంలో పరిస్థితులు మాత్రం అలాగే ఉన్నందు ఈ ఆర్టికల్ కొనసాగింది," అని సుప్రీంకోర్టు పేర్కొంది.

"దేశంలోని అన్ని రాష్ట్రాలకు కొద్డి పాటి వ్యత్యాసాలతో శాసన కార్యనిర్వాహక అధికారాలు ఉన్నాయి. ఆర్టికల్ 371A నుండి 371J వివిధ రాష్ట్రాలకు ఉన్న ప్రత్యేక ఏర్పాటు. అయితే ఇది మన అససమాన ఫెడరలిజాన్ని చూపిస్తుంది.జమ్మూ,శ్మీర్‌కు అంతర్గత సార్వభౌమాధికారం ఇతర రాష్ట్రాలకంటే భిన్నంగా ఉండటానికి వీల్లేదు," అని కోర్టు స్పష్టం పరిచింది.

జస్టిస్ చంద్రచూడ్ నాయకత్వంలోని ఈ బెంచ్ లోని మూడు రకాల తీర్పులను వెలువరించింది. ఇందులో ఒకటి తన ప్రధాన న్యాయమూర్తి చంద్రచూడ్ ,జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ సూర్యకాంత్ ల తరఫున జస్టిస్ చంద్రచూడ్ రాశారు. ఇక రెండో తీర్పును జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్ మరొక సమ్మతంగా రాశారు. మిగతా రెండింటితో ఏకీభవిస్తూ జస్టిస్ సంజీవ్ ఖన్నా రాసినది మూడో తీర్పు.

ది పెడరల్ ఈ అంశం మీద ఎన్నో విశ్లేషణలను అందించింది. వాటిని ఇక్కడ చూడవచ్చు.

Tags:    

Similar News