కెటిఆర్ ధీటైన ప్రశ్నకు సిద్దారామయ్య ఘాటైన జవాబు

మీ వన్నీ ఫేక్ వాగ్ధానాలు: కెటిఆర్; బిజెపి వాళ్ల ఫేక్ వీడియో షేర్ చేసి 'బి ' టీమ్ కావొద్దు: సిద్ధరామయ్య

Update: 2023-12-19 09:53 GMT
బిఆర్ ఎస్ వర్కింగ్ ప్రెశిడెంట్ కెటిఆర్, కర్నాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య

ఎన్నికల సమమయంలో ఇచ్చిన వాగ్దానాల అమలు మీద భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెశిడెంట్ కెటి రామారావు, కర్నాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్యకు మధ్య ట్టిట్టర్ వాగ్వాదం నడిచింది.

దీనికి కారణం, కర్నాటకలో చేసిన వాగ్దానాలు అమలుచేసేందుకు దుడ్లెక్కడున్నాయని సిద్ధరామయ్య చెప్పినట్లున్న ఒక వీడియో ముక్క సోషల్  మీడియాలో వైరలయ్యింది. దీన్ని చూసి కెటిఆర్ ఆవేశపడి, ఇక తెలంగాణలో కాంగ్రెస్ వాళ్లు ఇలా గే చెబుతారు, సిద్ధరామయ్య ఒక నమూనా స్టేట్ మెంట్ ఇచ్చేశారని వ్యాఖ్యానించారు. ఇది ట్విట్టర్ గొడవ సృష్టించింది.

డిసెంబర్ 9వ తేదీలోగా నెరవేరుస్తామన్న కాంగ్రెస్ గ్యారంటీల పరిస్థితి ఏమైందన్న మాజీ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు (కెటిఆర్) ఘాటైన ప్రశ్నకు కర్నాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య దీటైన జవాబిచ్చారు.

కాంగ్రెస్ పార్టీ పార్టీ ఇచ్చినవన్నీ నకిలీ హామీలని ఇచ్చిన కాంగ్రెస్ నేతలు నకిలీఅని కెటిఆర్ కామెంట్ చేస్తే, నువ్వుబిజెపివాళ్ల నకిలీ వీడియోలు చూసి ఇలా తయారవుతున్నాని, ఆ పేక్ వీడియో లను షేర్ చేయడం మానుకోవాలని సిద్ధరామయ్య సలహా ఇచ్చారు.

బిజెపి వాళ్ల ఫేక్ వీడియోలు షేర్ చేసి కాషాయ పార్టీ కి ‘బి’ టీం కావద్దని కర్నాటక పెద్దాయన సలహా ఇచ్చారు.

అసలేం జరిగిందంటే...

ఈ రోజు ఉదయం సిద్ధరామయ్య వీడియో ఒకటి వైరల్ కావడంతో దాన్ని ప్రస్తావిస్తూ కేటీఆర్ ట్వీట్ చేశారు.  ఎన్నికల్లో ఎన్నో చెబుతాం, కాని అవన్నీ అమలు చేయాలంటే డబ్బులెక్కడున్నాయ్ అని సిద్ధరామయ్య అంటున్నట్లు వీడియోలో ఉంది. 

 దీనిని కెటిఆర్ ప్రస్తావిస్తూ ట్వీట్ చేశారు. దానిని సిద్ధరామయ్య కు టాగ్ చేశారు.

మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో బిఆర్ ఎస్ ఓడిపొవడం, అందునా ఉద్యమనేత కెసిఆర్ నాయకత్వంలో ఉన్న పార్టీ ఓడిపోవడం ఆ పార్టీనేతలకు కొంచెం ఇబందిగా ఉంది. బిఆర్ ఎస్ ఓటమికి కారణం కాంగ్రెసోళ్ల ఫేక్ వాగ్దానాలు కుమ్మరించమే నని కెటిఆర్ అనుమానం. ఆయన దాన్నే ట్వీట్ చేశారు.

తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ సిగ్గు లేకుండా ప్రజలను మోసగించేలా అబద్ధపు హామీలు ఇవ్వడం వలనే మా పార్టీ ఎన్నికల్లో ఓడిపోయిందని ఆయన అనేశారు.

ఇచ్చిన హామీ మేరకు డిసెంబర్ 9వ తేదీ నాటికి నెరవేరుస్తామన్న కాంగ్రెస్ పార్టీ హామీల సంగతి ఏమిటని ప్రశ్నించారు. రైతులకు, కౌలు రైతులకు, రైతు కూలీలకు ఇస్తామన్న రైతు భరోసా ఎక్కడ పోయిందని అడిగారు. రెండు లక్షల రూపాయల వ్యవసాయ రుణమాఫీ ఏమయిందన్నారు. ’4వేల రూపాయల ఆసరా పెన్షన్ ఇంకెపుడిస్తారు?’ అని అడిగారు.

500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ అన్న మాట ఎక్కడ పోయింది?, ప్రతి మహిళకు 2500 ఇస్తామన్నారు కదా ఆ మాట ఏమైంది? మొదటి కేబినెట్ లోనే మెగా డీఎస్సీ పైన ప్రకటన ఉంటుందని చెప్పిన హామీపై చర్యలు ఏవి? మొదటి కేబినెట్ లోనే 6 గ్యారంటీలకు చట్టబద్ధత తీసుకువస్తామని చెప్పిన మాట ఏది? ఇలా మీరు ఇచ్చిన హామీలు నకిలీవా లేదా ఈ మాటలు చెప్పిన మీ కాంగ్రెస్ నేతలు నకిలీలా చెప్పాలి.  సిద్దరామయ్య ను సంబోధిస్తూ కెటిఆర్ చేసి ట్వీట్ ఇది.


ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు డబ్బులు లేవంటున్న కర్ణాటక సీఎం, ఇదే మాట తెలంగాణ రాష్ట్రంలోనూ కాంగ్రెస్ పార్టీ చెబుతుందా అంటూ కేటీఆర్ సందేహం వ్యక్తం చేశారు. ఆర్థిక పరిస్థితి గురించి సాకులు చెబుతున్న కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో హామీ ఇవ్వడానికి ముందు కనీసం అధ్యయనం చేయలేదని కేటీఆర్ అన్నారు.

తెలంగాణలో ఎందుకు ఓడిపోయిందో ముందు తెలుసుకో అని కర్నాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కు కెటిఆర్ కూ సూచించారు.

నువ్వు షేర్ చేస్తున్నవీడియోలో ఎడిట్ చేసినవని, ఫేక్ అని కనీసం వెరిఫై చేసుకోకుండా మాట్లాడతున్నావని ఆయన కెటిఆర్ చెప్పారు.

బిజెపి ఎడిట్ చేసిన వీడియో లను సృష్టిస్తుంది. మీ పార్టీ వాటిని షేర్ చేస్తుంది.  బిజెపి బి టీమ్ కావద్దని ఆయన కెటిఆర్ సలహా ఇచ్చారు.

కేటీఆర్ ట్వీట్ పైన స్పందించిన సిద్ధరామయ్యకు, మరోసారి పలు ప్రశ్నలను కేటీఆర్ సంధించారు

ఎన్నికల వాగ్దానాలను అమలు చేసేందుకు నిధులు లేవని కర్నాటక సిఎం సిద్దరామయ్య అంటున్నారు.

 ఇలాంటి వాగ్ధానాలతో నెగ్గిన తెలంగాణ పార్టీకి ఇదేనా మీరు అందిస్తున్న నమూనా. ఆచరణ సాధ్యం కాని వాగ్దానాలను ఇచ్చే ముందు కనీసం రీసెర్చ్ చేయాల్సిన పనిలేదా అని ఆయన కర్నాటక ముఖ్యమంత్రిని ప్రశ్నించారు.

Tags:    

Similar News