ఇజ్రేల్ దాడిలో విరిగిపోతున్న పాలస్తీనా కలాలు, ఈ రోజు మహిళా జర్నలిస్టు హతం
ఇంతవరకు ఇజ్రేల్, హమాస్ యుద్ధంలో 95 మంది జర్నలిస్టు హతమయ్యారు. హనీస్ అలి అల్ ఖుస్తాన్ అనే మహిళా జర్నలిస్టు 95 వ వ్యక్తి
ఈ రోజుకి గాజా నేల మీద ఇజ్రేల్ సేనలు ప్రవేశించి విధ్వంసం మొదలుపెట్టి 73 రోజులయింది. ఈ విషాదం క్లుప్తంగా
• 2023 అక్టోబర్ 7న హమాస్ అకస్మికంగా ఇజ్రేల్ మీద దాడి చేసి 242 మందిని బందీలు పట్టుకున్న తర్వాత ఇజ్రాయెల్ గాజా స్ట్రిప్‌ను ముట్టడించింది
• గాజాపై ఇజ్రాయెల్ చేస్తున్న బాంబు దాడికి పాశ్చాత్య మిత్రదేశాలు మద్దతు ఇచ్చాయి. అయితే, UN దేశాలు పాలస్తీనియన్లపై సాగుతున్న దాడిని ఖండించాయి. ప్రపంచదేశాలలో అనేక చోట్ల నిరసనలు చెలరేగాయి
• గాజా జనాభాలో 85 శాతం మంది ఇజ్రేల్ దాడి వల్ల నిరాశ్రయులయ్యారు; 60 శాతం ఇళ్లు నేలమట్టమయ్యాయి
• ఇరు పక్షాల మధ్య కుదిరిన ఎనిమిది రోజుల సంధి ప్రకారం డిసెంబర్ 1న 105 మంది బందీలను హమాస్ విడుదల చేస్తే, 240 మంది పాలస్తీనా ఖైదీలను ఇజ్రేల్ విడుదల చేసింది.
• ఇజ్రాయెల్, హమాస్ మధ్య అక్టోబర్ 7న వివాదం చెలరేగినప్పటి 95 మంది జర్నలిస్టు కాల్పుల్లో, బాంబు దాడుల్లో చనిపోయారు. వీరిలో హనీన్ అలీ అల్-ఖుష్తాన్ (Haneen Ali Al-Qashtan) 95వ పాలస్తీనా జర్నలిస్టు లేదా మీడియా కార్యకర్త
హనీస్ వివరాలు
న్యూయార్క్‌కు చెందిన జర్నలిస్టుల రక్షణ కమిటీ రూపొందించిన ప్రత్యేక జాబితాలో అల్-కుత్షాన్ పేరు ఇంకా చేర్చలేదు. ఈ సంస్థ లెక్కించిన మృతుల వివరాల ప్రకారం చనిపోయిన వారిలో కనీసం 57 మంది పాలస్తీనియన్లు, నలుగురు ఇజ్రాయెలీలు, ముగ్గురు లెబనీస్ జర్నలిస్టులు మీడియా కార్యకర్తలు ఉన్నారు. మిగతవారు వివిధ సంస్థలకు చెందిన మీడియా ఉద్యోగులు.
పాలస్తీనా మీడియా ట్టిట్టర్ లో హనీస్ ఫోటో ట్వీట్ చేస్తూ ఆమె గాజాలోని FM రేడియో స్టేషన్‌లో పని చేసినట్లు సూచించింది. ఇతర పాలస్తీనా మీడియా ఆమెను అల్-ఖుష్తాన్ అనే ఇంటిపేరుతో గుర్తించింది.
BREAKING | Journalist Haneen Ali Al-Qashtan was killed along with members of her family during the occupation bombing of the Nuseirat camp Central Gaza pic.twitter.com/y3YVuoBM6S
— TIMES OF GAZA (@Timesofgaza) December 17, 2023