ఏపీలో పనిచేస్తున్న తెలంగాణ ఎన్జీఓలకు శుభవార్త, జీఓ విడుదల
ఆంధ్రప్రదేశ్ లో పనిచేస్తున్న తెలంగాణ ఎన్జీఓలకు సర్కారు శుభవార్త వెల్లడించింది. ఏపీలో పనిచేస్తున్న తెలంగాణ స్థానికులైన ఎన్జీఓలను రిలీవ్ చేసేందుకు అంగీకరించింది.
By : The Federal
Update: 2024-08-13 14:12 GMT
తెలంగాణకు స్థానికులుగా ఉన్నా, తెలంగాణను ఎంచుకున్నా, కానీ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి కేటాయించిన నిర్దిష్ట రాష్ట్ర కేడర్ నాన్-గెజిటెడ్ ఉద్యోగులను రిలీవ్ చేయడానికి ఏపీ సర్కారు అనుమతించింది. తెలంగాణ నివాసులైన ఏపీ ఎన్జీఓలను వారికి ఉపశమనం కల్పిస్తూ తెలంగాణ ప్రభుత్వ అభ్యర్థన మేర వారికి రిలీవింగ్ ఆర్డర్లు జారీ చేయనున్నారు.
- తెలంగాణ నివాసులైన ఎన్జీఓలను రిలీవ్ చేయాలని కోరుతూ తెలంగాణ చీఫ్ సెక్రటరీ ఎ శాంతికుమారి జూన్ 14వతేదీన రాసిన లేఖపై ఏపీ ప్రభుత్వ సాధారణ పరిపాలన శాఖ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది.
- తెలంగాణ నివాసులను ఏపీకి కేటాయించారని, వారిని సొంత రాష్ట్రానికి తీసుకురావాలని కోరుతూ తెలంగాణ నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ యూనియన్ ఈ ఏడాది జనరి 11వతేదీన తెలంగాణ చీఫ్ సెక్రటరీకి లేఖ రాసింది.
- తెలంగాణ వాసులైనా ఏపీలో పనిచేస్తున్న 122 మంది ఎన్జీఓలు రిలీవ్ అయి సొంతరాష్ట్రానికి బదిలీపై రానున్నారు. అన్ని ప్రభుత్వ విభాగాల అధిపతులు 122మంది ఎన్జీఓలను రిలీవ్ చేయాలని ఉత్తర్వుల్లో ఏపీ ప్రభుత్వ సాధారణ పరిపాలనా శాఖ కార్యదర్శి పోలా భాస్కర్ ఉత్తర్వుల్లో కోరారు.15 రోజుల్లోగా ఏపీ సచివాలయం, ఇతర ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న వారిని రిలీవ్ చేయాలని ఏపీ సర్కారు ఆదేశించింది. ఏపీ సర్కారు జారీ చేసిన ఉత్తర్వులపై టీఎన్జీఓల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ముజీబ్ హర్షం వ్యక్తం చేశారు.