HYDRAA | ‘అక్రమ నిర్మాణాలపై కఠినంగానే ఉంటాం’
హైడ్రా.. 2024 జూలై తర్వాత చేపట్టిన అక్రమ నిర్మాణాలను మాత్రమే తొలగిస్తుందని, అప్పటికే పూర్తయిన భవనాల జోలికి వెళ్లదని హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఇటీవల ప్రకటించారు.
హైడ్రా.. 2024 జూలై తర్వాత చేపట్టిన అక్రమ నిర్మాణాలను మాత్రమే తొలగిస్తుందని, అప్పటికే పూర్తయిన భవనాల జోలికి వెళ్లదని హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఇటీవల ప్రకటించారు. దీంతో హైడ్రా కేవం అనుమతులకే పరిమితమవుతుందని, హడ్రా అంటే హడలిపోవాల్సిన పనిలేదంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో హైడ్రా పనితీరుపై కమిషనర్ రంగనాథ్ మరోసారి ఘాటుగా స్పందించారు. ఇప్పటికి, ఎప్పటికీ కూడా అక్రమ నిర్మాణాల విషయంలో హైడ్రా కఠినంగానే వ్యవహరిస్తుందని వెల్లడించారు.
‘‘హైడ్రా ఏర్పడి దాదాపు 5 నెలలు దాటింది. ఐదు నెలల అనుభవాలు, వచ్చే ఏడాది రూట్ మ్యాప్ సిద్దం చేశాం. ఓఆర్ఆర్ వరకు హైడ్రా పరిధి ఉంది. జీహెచ్ఎంసీ చట్టం కింద ప్రభుత్వం ప్రత్యేక అధికారాలు ఇచ్చింది. 200 ఎకరాల ప్రభుత్వ భూమిని రక్షించాం. 12 చెరువులు, 8 పార్కులను అన్యక్రాంతం కాకుండా హైడ్రా రక్షించింది. ఎఫ్టీఎల్, బఫర్‌జోన్‌పై ప్రజల్లో అవగాహన పెరిగింది. 1095 చెరువుల్లో వచ్చే ఏడాది ఎఫ్ టీఎల్ నిర్దారణ చేస్తాం. సాంకేతిక పరిజ్ఞానం, డాటాతో ఎఫ్ టీఎల్ నిర్దారణ చేస్తాం. ఎఫ్ టీఎల్ ను పారదర్శకంగా చేయడం మా బాధ్యత’’ అని తెలిపారు.
‘‘శాటిలైట్ ఇమేజ్ తో అత్యంత రెజల్యూషన్ ఉన్న డేటా తీసుకుంటున్నాం. 2006 నుంచి 2023 వరకు ఏరియల్ డ్రోన్స్ తో తీసిన ఫొటోలను కూడా ఎఫ్ టీఎల్ నిర్దారణ కోసం తీసుకుంటున్నాం. ఎఫ్టీఎల్ మారడానికి గల కారణాలు స్పష్టంగా తెలుస్తుంది. శాస్త్రీయమైన పద్దతుల్లోనే ఎఫ్ టీఎల్ నిర్దారణ జరుగుతుంది. నాలాలపై కిర్లోస్కర్ కంపెనీ చేసిన స్టడీని తీసుకుంటున్నాం. 5800 ఫిర్యాదులు హైడ్రాకు అందాయి. అనధికారిక నిర్మాణాలకు సంబంధించి 27 పురపారక సంఘాల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయి. 27 పురపాలక సంఘాలపై కూడా మాకు అధికారం ఉంది. శాటిలైట్ ఇమేజ్ ల ద్వారా ఆక్రమణలను గుర్తిస్తున్నాం’’ అని వెల్లడించారు.
‘‘భవన నిర్మాణ వ్యర్థాల డంపింగ్‌పై కుడా దృష్టి పెట్టాం. 2025 లో జియో ఫెన్సింగ్ సర్వే. 12 చెరువుల పునరుద్దరణకు సంబంధించిన ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపాం. త్వరలోనే 72 డీఆర్ ఎఫ్ బృందాలు అందుబాటులోకి వస్తాయి. నాగోల్‌లో ఉన్న డీఆర్ ఎఫ్ కేంద్రాన్ని బలోపేతం చేస్తాం. త్వరలోనే నగరంలో మరో డాప్లర్ వెదర్ రాడార్ రాబోతుంది. వెదర్ డాటాను విశ్లేషించేందుకు హైడ్రా లో ఒక టీంను ఏర్పాటు చేస్తున్నాం. హైడ్రా కు త్వరలో ఒక ఎఫ్ ఎం ఛానల్ కు ప్రయత్నిస్తున్నాం. హైడ్రా వల్ల ప్రజల్లో భూములు, ఇల్లు క్రయవిక్రయాలపై అవగాహన పెరుగుతుంది.* నగరంలో అక్రమ నిర్మాణాల కూల్చివేతలపై హైడ్రా కఠినంగానే ఉంటుంది. జులై తర్వాత అనధికారికంగా, వ్యాపార వాణిజ్య కార్యకలాపాలు నిర్వహించేవాటిపై చర్యలు తప్పవు. వచ్చే ఏడాది నుంచి ప్రతిసోమవారం గ్రీవెన్ సెల్ ఏర్పాటు చేస్తున్నాం. ఎఫ్టీఎల్లో ఉన్న షెడ్లపై ప్రజలెవరు అద్దెకు తీసుకోవద్దు.ప్రజల ఇచ్చే ఫిర్యాదులకు ప్రాధాన్యత ఇచ్చి పరిష్కరిస్తున్నాం’’ అని కోరింది.