అమ్మాయిలకు హగ్గులిస్తున్న మణికంఠకు నాగ్ వార్నింగ్, అభయ్ ఎలిమినేట్!

హౌస్‌లో ఉన్న అమ్మాయిలు అందరినీ వెనుకగా వెళ్ళి హగ్గులు చేసుకోవటం మానేయాలని, లేదంటే బయటకు పంపించాల్సి వస్తుందని మణికంఠకు నాగార్జున హెచ్చరించారు.

Update: 2024-09-23 08:10 GMT

బిగ్ బాస్ ఎనిమిదవ సీజన్‌‌లో సింపతీ కార్డ్‌తో ముందుకు సాగుతున్న నాగమణికంఠకు హోస్ట్ నాగార్జున సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. హౌస్‌లో ఉన్న అమ్మాయిలు అందరినీ వెనుకగా వెళ్ళి హగ్గులు చేసుకోవటం మానేయాలని, లేదంటే బయటకు పంపించాల్సి వస్తుందని హెచ్చరించారు.

బిగ్ బాస్ వేదికపైకి వచ్చినప్పటినుంచి సినిమా కష్టాలు అన్నీ చెప్పుకుని భోరుమంటూ సింపతీ కొట్టేసిన నాగమణికంఠ, ఈ మధ్య అమ్మాయిలందరినీ హగ్ చేసుకోవసాగాడు. యష్మిని, సోనియాను, ప్రేరణను… ఇలా అందరినీ హగ్ చేసుకున్నాడు. తనకు ఇష్టం లేదని, వద్దని చెప్పినా వినకుండా హగ్ చేసుకుంటున్నాడని హష్మి బిగ్ బాస్‌కు చెప్పుకుని ఏడ్చింది. నిన్న నాగార్జున మణికంఠను కన్ఫెషన్ రూమ్‌కు పిలిచి హష్మి ఏడ్చిన వీడియోను చూపించారు. ఇంకోసారి ఇలా చేస్తే, బయటకు వెళతావు అని హెచ్చరించారు. దీనికి, మణికంఠ స్పందిస్తూ షాక్ అయినట్లు ఏదో కవరింగ్ చేశాడు.

మరోవైపు, పెళ్ళిచూపులువంటి అనేక సినిమాలలో నటించిన అభయ్, మూడు వారాల తర్వాత నిన్న ఎలిమినేట్ అయ్యాడు. దీనికి రెండు కారణాలు చెబుతున్నారు. ఒకటి - అతని ఓవర్ కాన్ఫిడెన్స్ అని, రెండు - బిగ్ బాస్‌ను తిట్టటం అని అంటున్నారు. హౌస్‌కు చీఫ్‌లుగా ఉన్న అభయ్, నిఖిల్‌లలో ఎవరో ఒకరు నామినేట్ అవ్వాలని బిగ్ బాస్ సూచించినప్పుడు, నిఖిల్ తాను అవుతానంటే, వద్దులే, నేను అవుతాను, జనం నన్ను రక్షిస్తారు అంటూ తానే సెల్ఫ్ నామినేట్ చేసుకున్నాడు.

మరోవైపు బిగ్‌బాస్‌ను అభయ్ పలు సందర్భాలలో విపరీతంగా తిట్టాడు. అవి అన్నీ ఒక వీడియోగా చేసి నిన్న టెలికాస్ట్ చేసి చూపించారు.

ఈ రెండు కారణాలతో అభయ్ ఎలిమినేట్ అయ్యాడు. అయితే, ఎలిమినేట్ అయ్యానని తనకు దిగులు ఏమీ లేదని చెబుతూ అతను బయటకు వచ్చిన తర్వాత ఒక వీడియో విడుదల చేశాడు. లోపలకు వెళ్ళేముందే తాను లోపల దిల్‌దార్‌గా ఉంటానని చెప్పానని, అలాగే ఉన్నానని అన్నాడు. తనకు ఓట్లు వేసిన అందరికీ ధన్యవాదాలని చెప్పాడు.

Tags:    

Similar News