ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అరెస్ట్!

ప్రజా సమస్యలను తెలుసుకోవటంలో ప్రయత్నం చేసిన తమ ఎమ్మెల్యేలను, సీనియర్ నాయకులను అరెస్ట్ చేయటాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా ఖండించారు.

Update: 2024-09-23 09:56 GMT

హైదరాబాద్ నగరంలోని గాంధీ ఆసుపత్రిలోనికి వెళ్ళటానికి ప్రయత్నించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మాగంటి గోపీనాథ్, సంజయ్, మాజీ ఉపముఖ్యమంత్రి రాజయ్య తదితరులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆసుపత్రి వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

గాంధీతో సహా, రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రులలోని అధ్వాన్న పరిస్థితులను అధ్యయనం చేయటానికి బీఆర్ఎస్ నిజనిర్ధారణ కమిటీని నియమించిఉంది. దీనిలో భాగంగా ఆ కమిటీ ఇవాళ గాంధీ ఆసుపత్రిని పరిశీలించటానికి వెళ్ళింది. కమిటీ సభ్యులైన డాక్టర్ రాజయ్య, డాక్టర్ మెతుకు ఆనంద్, డాక్టర్ సంజయ్‌లను పోలీసులు ఇవాళ హౌస్ అరెస్ట్ చేశారు. అయినాకూడా వారు ఆసుపత్రికి చేరుకోవటంతో వారిని, మరో ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌ను పోలీసులు అక్కడే అదుపులోకి తీసుకుని వేరే చోటకు తరలించారు. మరోవైపు జనగామ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డిని కూడా పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ఆయన ఇంటివద్ద పోలీసులు భారీగా మోహరించారు.

ప్రజా సమస్యలను తెలుసుకోవటంలో ప్రయత్నం చేసిన తమ ఎమ్మెల్యేలను, సీనియర్ నాయకులను అరెస్ట్ చేయటాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. రాజకీయాలకు అతీతంగా ప్రజా సంక్షేమంకోసమే, స్వయంగా డాక్టర్‌లు అయిన తమ నాయకులు ఆసుపత్రులను పరిశీలిస్తారని కేటీఆర్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం తన తప్పులను కప్పిపుచ్చుకునేందుకే ఇలాంటి పిరికిపంద చర్యలకు పాల్పడుతోందని, అయినా తాము ప్రజారోగ్య వ్యవస్థలోని లోపాైలను ఎత్తిచూపుతామని కేటీఆర్ అన్నారు.

Tags:    

Similar News