ఇదేంది మచ్చా, ఇట్టా చేశావా?
`వురే.. మచ్చా.. నేను సంతోషంగా ఉంటం నీకస్సలు ఇష్టం లేదు కదరా..’ ఈ సినీ డైలాగ్ గుర్తుందిగా. తక్కువ టైంలో ఎక్కువ ఫేమ్ తెచ్చుకున్న కేశవ్ ఇప్పుడు కటకటాల పాలయ్యాడు.
`వురే.. మచ్చా.. నేను సంతోషంగా ఉంటం నీకస్సలు ఇష్టం లేదు కదరా..’ ఈ సినీ డైలాగ్ గుర్తుందిగా. పుష్ప సినిమాలో అల్లు అర్జున్ తన అసిస్టెంట్ కేశవ్ తో అనే డైలాగ్ అది. తక్కువ టైంలో ఎక్కువ ఫేమ్, నేమ్ తెచ్చుకున్న నటుడు. సహయ నటుని పాత్రలో అద్భుతంగా ఒదిగే పోయే నటుడు జగదీశ్ అలియాస్ కేశవ. అలాంటోడు ఓ యువతి బలవన్మరణానికి కారణమయ్యాడట. ఈ వ్యవహారమై హైదరాబాద్ పంజగుట్ట పోలీసు స్టేషన్ లో కేసు నమోదైంది. పోలీసులు అదుపులోకి కూడా తీసుకున్నారు. కాకినాడకు చెందిన యువతి ఏదో సంస్థలో పని చేస్తూనే సినిమాల్లో జూనియర్ ఆర్టిస్టుగా నటించేదట.
పోలీసులు చెప్పిన వివరాలివి..
ఆ కాకినాడ యువతి పంజగుట్ట పోలీస్‌స్టేషన్ పరిధిలోని సంగీత్‌నగర్‌లో ఉంటున్నారు. తల్లి దండ్రులు కాకినాడలోనే ఉంటారు. భర్తతో విడాకులు తీసుకున్నారు. కొంతకాలం కిందట ఆ యువతికి మణికొండలో నివసించే నటుడు జగదీశ్ పరిచయమయ్యాడు. పరిచయం కాస్తా ప్రేమగా మారి కొద్దిరోజులు లివింగ్ రిలేషన్‌లో ఉన్నారు. జగదీశ్ ఆ యువతిని కాదని మరో యువతిని వివాహం చేసుకోవడంతో ఆమె జగదీశ్‌ను దూరం పెట్టసాగింది. ఫోన్ చేసినా లిఫ్ట్ చేసేది కాదు.
రహస్యంగా ఫొటోలు తీసి బ్లాక్ మెయిల్ చేసి..
నవంబర్ 27న జగదీశ్ ఆ మహిళ నివసించే ఫ్లాట్ వద్దకు వెళ్లాడు. గుట్టుచప్పుడు కాకుండా ఆమె పడకగదిలో దృశ్యాలను పోటో తీశారు. ఆ తర్వాత డోర్‌కొట్టి లోనికి వెళ్లి మీ బాగోతం మొత్తం రికార్డ్ చేశానంటూ వారిని బెదిరించాడు. ఫొటోలు డిలీట్ చెయ్యా లని ఎంత బతిమిలాడినా వినలేదు. దీంతో ఆ యువతి, యువకుడు పోలీసులకు ఫోన్ చేస్తామనడంతో అక్కడ నుంచి వెళ్లిపోయాడు. మరుసటి రోజు కూడా ఫోన్‌లో వేధించాడు. 29వ తేదీ ఉదయం ఆ యువతి మరొకరితో సన్నిహితంగా ఉన్న ఫొటో పంపించి.. ఇలాంటి ఫొటోలు ఇంకా చాలా ఉన్నాయనీ, అవన్నీ బయటపెడతానని బెదిరించాడు. దీంతో తీవ్ర ఆందోళన, ఒత్తిడికి గురైన యువతి ఫ్యాన్‌కు ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారన్నది పోలీసులు చెబుతున్న కథనం.
పరారీలో జగదీశ్..పోలీస్ ఛేజ్
పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. ఆ యువతి బంధువులు జగదీశ్ వేధింపులను పోలీసులకు వివరించారు. ఆ మేరకు కేసు పెట్టారు. అప్పటి నుంచి పరారీలో ఉన్న నిందితుడు జగదీశ్‌ను పోలీసులు బుధవారం అరెస్టు చేసి రిమాండ్‌కు పంపారు. ప్రస్తుతం ఈ విషయం కాస్త ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయిపోయింది. క్యారెక్టర్ ఆర్టిస్టుగా పలు సినిమాలు చేస్తున్న ఈ నటుడు ఇప్పుడు పోలీసుల అదుపులో ఉండటం షాకింగ్‌గా అనిపించింది.
అసలు ఏం జరిగింది
ఆ జూనియర్ ఆర్టిస్టు.. ఆత్మహత్యకు కారణం 'పుష్ప' నటుడు జగదీష్ అని నిర్ధారించుకున్నారు పోలీసులు. ఇక జగదీశ్ కెరీర్ విషయానికొస్తే.. మల్లేశం, జార్జిరెడ్డి, పలాస 1978 తదితర చిత్రాల్లో సహాయ పాత్రలు చేసి గుర్తింపు తెచ్చుకున్నాడు. అలా సుకుమార్ దృష్టిలో పడి 'పుష్ప' లాంటి పాన్ ఇండియా మూవీలో అవకాశం దక్కించుకున్నాడు. మచ్చ మచ్చ అని అల్లు అర్జున్ కూడా ఉండే పాత్రలో కామెడీ పండించాడు. 'సత్తిగాని రెండెకరాలు' అనే సినిమాలో హీరోగానూ నటించాడు. 'పుష్ప 2'తో బిజీగా ఉన్న ఇతడు అరెస్ట్ ఇప్పుడు ఒక్కసారిగా అందరినీ అవాక్కయ్యేలా చేసింది.