పత్రాలు లేని శరణార్థులకు పరిష్కారం కనుగొంటాం: షా

ఏ పత్రాలను చూపలేని శరణార్థులకు పౌరసత్వం ఎలా కల్పిస్తారన్న ప్రశ్నకు షా సమాధానమిస్తూ.. అలాంటి వారికి పిలిచి ముఖాముఖి ఇంటర్వ్యూ చేస్తారని చెప్పారు.

Update: 2024-03-14 13:31 GMT

పౌరసత్వ సవరణ చట్టం (సిఎఎ) కింద భారత పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకోవడానికి అవసరమైన పత్రాలు లేని శరణార్థులకు త్వరలో పరిష్కార మార్గాన్ని కనుగొంటామని కేంద్ర హోం మంత్రి అమిత్ షా చెప్పారు. డిసెంబర్ 21, 2014లోపు ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, బంగ్లాదేశ్ నుంచి వచ్చిన లేదా అంతకు ముందు భారతదేశానికి వచ్చిన ముస్లిమేతరులకు భారత పౌరసత్వాన్ని కల్పించనున్న విషయం తెలిపిందే.

85% శరణార్థుల వద్ద ఉన్నాయి..

‘‘భారత పౌరసత్వం పొందడానికి రెండు పత్రాలు తప్పనిసరి. అర్హత ఉన్న దేశాల నుంచి వచ్చినట్లుగా ఒక పత్రాన్ని చూపాలి. రెండోది వారు డిసెంబర్ 31, 2014న లేదా అంతకు ముందు దేశంలోకి ప్రవేశించినట్లు ఆధారం చూపాలి. భారత పౌరసత్వాన్ని కోరుకుంటున్న శరణార్థులలో 85 శాతం మంది వద్ద ఇప్పటికే అవసరమైన పత్రాలు ఉన్నాయి. లేని వారి కోసం త్వరలో మరో మార్గాన్ని ఆలోచిస్తాం’’ అని షా చెప్పారు.

వారిని ఇంటర్వ్యూ చేస్తారు..

ఏ పత్రాలను చూపలేని శరణార్థులకు పౌరసత్వం ఎలా కల్పిస్తారన్న ప్రశ్నకు షా సమాధానమిస్తూ.. అలాంటి వారికి పిలిచి ముఖాముఖి ఇంటర్వ్యూ చేస్తారని చెప్పారు.

ఎన్‌ఆర్‌సికి సంబంధించి ఏ నిబంధన లేదు..

జాబితా నుంచి ముస్లింలను మినహాయించడంపై షా మాట్లాడుతూ.. ముస్లింలకు కూడా పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకునే హక్కు ఉందన్నారు. ప్రభుత్వం తమను అక్రమ వలసదారులుగా ప్రకటించి వారి పౌరసత్వాన్ని తొలగిస్తుందని ముస్లిం సమాజానికి చెందిన చాలా మంది భయపడుతున్నారని, వాస్తవానికి వారు భయపడాల్సిన పనిలేదన్నారు. ఎవరికీ కూడా తలుపులు మూసివేయలేదు అని చెప్పారు. AIMIM అధినేత అసదుద్దీన్ ఒవైసీ వంటి కొందరు రాజకీయ నాయకులు పేర్కొన్నట్లుగా.. ముస్లింల పౌరసత్వాన్ని రద్దు చేయదని స్పష్టం చేశారు. చట్టంలో ఎన్‌ఆర్‌సికి సంబంధించి ఎలాంటి నిబంధన లేదన్నారు.

గిరిజన ప్రాతినిధ్యాన్ని ప్రభావితం చేయదు.

ఈ చట్టం గురించి అస్సాం వంటి ఈశాన్య రాష్ట్రాల ఆందోళనలను షా ప్రస్తావించారు. “సీఏఏ గిరిజన ప్రాంతాల కూర్పు, హక్కులను మార్చదు లేదా పలుచన చేయదు. చట్టంపై తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తోందని ఆరోపిస్తూ, ప్రతిపక్ష భారత కూటమిపై కూడా విరుచుకుపడ్డారు. లోక్‌సభ ఎన్నికలకు ముందు నిబంధనలను నోటిఫై చేశారు. ఇప్పటికే చట్టం ఆమోదించబడింది. COVID-19 మహమ్మారి కారణంగా ఆలస్యమైందని చెప్పారు.

అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు..

రాహుల్ గాంధీ, మమతా బెనర్జీ, అరవింద్ కేజ్రీవాల్ లాంటి నాయకులు సీఏఏ గురించి అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని చెప్పారు. వాస్తవానికి ‘‘బీజేపీ తన 2019 మేనిఫెస్టోలో CAAని తీసుకువస్తుందని, శరణార్థులకు (పాకిస్తాన్, బంగ్లాదేశ్ మరియు ఆఫ్ఘనిస్తాన్ నుండి) భారత పౌరసత్వాన్ని అందిస్తామని స్పష్టం చేసింది. బిజెపికి స్పష్టమైన ఎజెండా ఉంది. ఆ వాగ్దానం ప్రకారం పౌరసత్వ (సవరణ) బిల్లు 2019 లో పార్లమెంటు ఉభయ సభలలో ఆమోదం పొందింది. కోవిడ్ కారణంగా ఆలస్యమైంది.’’ అని షా వివరించారు.

Tags:    

Similar News