నేడు పార్లమెంట్ లో ‘ఆషరేషన్ సిందూర్’ పై చర్చ

అస్త్ర శస్త్రాలతో సిద్దమైన అధికార విపక్షాలు;

Update: 2025-07-28 06:51 GMT
పహల్గామ్ ఉగ్రవాద దాడి

పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభమైన వారం రోజులలో గందరగోళంతోనే వాయిదా పడుతూ వచ్చాయి. ఈ నేపథ్యంలో అధికార, విపక్షాలు రెండు కూడా కూడా ఆపరేషన్ సిందూర్ పై మారథాన్ చర్చకు అంగీకరించాయి.

పాలక, ప్రతిపక్షాల నాయకుల పార్టీ ఫ్లోర్ లీడర్లు పార్లమెంట్ వ్యాపార సలహ కమిటీ సమావేశంలో లోక్ సభలో సోమ, మంగళవారాల్లో రాజ్యసభలో వరుసగా 16 గంటల చర్చకు అంగీకరించారు.

అయినప్పటికీ కేంద్రం, ప్రతిపక్షాల మధ్య కుదిరిన చర్చ సజావుగా సాగుతుందా? అనేది పెద్ద ప్రశ్న. పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమైన తరువాత రాజ్యసభలో కేవలం ఒకే ఒక బిల్లు మాత్రమే ఆమోదం పొందింది.

వాడీవేడీగా ఉంటుందా?
చర్చ సందర్భంగా మాట్లాడేందుకు ప్రభుత్వం భారీ ఎత్తున సన్నద్దం అయిందని, ప్రధానమంత్రి మోదీ కూడా చర్చలో సమాధానం ఇస్తారని కొన్ని వర్గాలు తెలిపాయి. రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్, హోంమంత్రి అమిత్ షా, విదేశాంగమంత్రి జై శంకర్ కూడా చర్చలో పాల్గొంటారని తెలిపారు.
ఆపరేషన్ సిందూర్, దానికి ముందు, తరువాత జరిగిన సంఘటనలపై చర్చ జరగబోతోంది. ఏప్రిల్ 22 పహల్గామ్ ఉగ్రవాద దాడి, కాల్పుల విరమణ ప్రకటన, సంఘర్షణ సమయంలో భారత్ వ్యవహరించిన తీరుపై సమాధానాలు కావాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.
జూలై 21న వర్షాకాల సమావేశాలు ప్రారంభానికి ముందు మోదీ మీడియాతో మాట్లాడారు. ఇందులో పాకిస్తాన్ పై భారత్ చేపట్టిన సైనిక ఆపరేషన్, ఉగ్రవాద నిరోధక అంశంపై దౌత్యపరమైన చేరికలో ఆపరేషన్ సిందూర్ ను అపూర్వమైన మైలురాయిగా చూపించాలని తన ప్రభుత్వానికి స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు.
ఈ సందర్భంగా మోదీ వర్షాకాల సమావేశాలను విజయోత్సవ్ గా వర్ణించారు. దీనిప్రకారం విపక్షాలు ఏదైన విమర్శలను ప్రభుత్వం ధైర్యంగా ఎదుర్కోవడానికి సిద్దంగా ఉన్నట్లు నిశ్చయించుకుంది.
క్యాబినేట్ హెవీ వెయిట్స్
ఈ చర్చలో రక్షణమంత్రి రాజ్ నాథ్ సింగ్ పాకిస్తాన్ తో వ్యతిరేకంగా సైనిక ప్రతిస్పందన అంశాలు, ప్రధాన మంత్రి మేక్ ఇన్ ఇండియా అంశాలపై దేశం సాధించిన అభివృద్దిని పార్లమెంట్ వేదికగా సమాధానం ఇస్తారని కొన్ని వర్గాలు ఫెడరల్ కు చెప్పాయి.
ఆపరేషన్ సిందూర్ కు కారణమైన పహల్గామ్ ఉగ్రవాద దాడికి దారితీసిన నిఘా వైఫల్యంపై ప్రతిపక్షాలను అంచనా వేసిన విమర్శలను కేంద్ర హోంమంత్రి అమిత్ షా తిప్పికొట్టే అవకాశం ఉంది.
అదే విధంగా విదేశాంగమంత్రి ఎస్ జైశంకర్ ప్రభుత్వ, దౌత్యపరమైన ప్రతిస్పందనను వివరించడానికి సిద్దంగా ఉన్నారు. పాకిస్తాన్ వంటి దేశాలలో నిర్మితమవుతున్న ఉగ్రవాద కేంద్రాలను నిర్మూలించడం ద్వారా మాత్రమే ప్రపంచ శాంతి సాధ్యమవుతుందని ప్రభుత్వం దాదాపు మూడు డజన్ల దేశాలకు ఎంపీల బృందాలను పంపిన సంగతి ఆయన ప్రస్తావించే అవకాశం ఉంది.
అఖిలపక్ష ప్రతినిధులు..
ఆపరేషన్ సిందూర్ తరువాత దౌత్య కార్యకలాపాల కోసం భారత్ నియమించిన అఖిలపక్ష ప్రతినిధులలో భాగమైన బీజేపీ, ఎన్డీఏ మిత్రపక్షాలను సైతం చర్చలలో బరిలోకి దింపే అవకాశం ఉంది.
వీరిలో దూకుడుగా మాట్లాడే స్వభావం ఉన్న ఎంపీ నిషికాంత్ దూబే, అనూరాగ్ ఠాకూర్ వంటి ఎంపీలు ముందు వరసలో ఉంటారు. వీరు ఎంపీల బృందంలో సైతం సభ్యులుగా ఉన్నారు. చర్చను ముగించేది ప్రధాని మోదీ అని, ఆయన కచ్చితంగా ఇందులో ప్రసంగిస్తారని ఎన్డీఏ వర్గాలు తెలిపాయి.
కాంగ్రెస్ పాలనలో భారత్ ఎదుర్కొన్న లెక్కలేనన్నీ ఉగ్రవాద దాడులను 26/11 ముంబై ఉగ్రవాద దాడుల తరువాత పాకిస్తాన్ పై భారత్ సాయుధ దళాలు ఎదురుదాడి చేయడానికి అప్పటి ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ నిరాకరించిన విషయాన్ని ఎత్తిచూపడం ద్వారా మిగిలిన ప్రతిపక్షాల నుంచి కాంగ్రెస్ ను ఒంటరి చేసే ప్రయత్నంలో ప్రధానమంత్రి కాంగ్రెస్ పైనే గురి పెట్టడానికి అవకాశం ఉందని వర్గాలు తెలిపాయి.
భారత్- పాకిస్తాన్ సంబంధాలలో కొత్త స్థితి కోసం తన వాదనను మోదీ వివరిస్తారని, ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో వివిధ సమయాల్లో పాకిస్తాన్ పై ఆయన సర్జికల్ స్ట్రైక్స్ తో ఉగ్రవాదుల పీచం అణచిన తీరును ఈ సందర్బంగా ప్రస్తావిస్తారని కూడా తెలిసింది.
మూడు విస్తృత సమస్యలు..
ప్రతిపక్షం తన వంతుగా ప్రభుత్వాన్ని మూడు విస్తృత అంశాలపై కఠినంగా వ్యవహరించాలని యోచిస్తోంది. మొదటిది ఏప్రిల్ 22న పహల్గామ్ లోని బైసరన్ గడ్డి మైదానాల్లో 26 మంది పౌరులను అది కూడా హిందువులని గుర్తించి వారి భార్యల ముందే భర్తలను గుర్తించి కాల్చి చంపారు.
దీనిని నిఘా వైఫల్యంగా, అలాగే కాల్చి చంపిన ఉగ్రవాదులు ఇప్పటి వరకూ పట్టుబడక పోవడం పై కూడా విపక్షాలు ప్రశ్నలు సంధించి ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే అవకాశం ఉంది.
రెండోవది సైనిక ఘర్షణ జరిగిన మొదటి రోజు పాకిస్తాన్ దళాలు భారత జెట్ విమానాలు కూల్చివేసినట్లు పాకిస్తాన్ చేసిన ప్రకటనలు, తరువాత ట్రంప్ చేసిన వ్యాఖ్యలు కూడా ఇందులో చర్చకు వచ్చే అవకాశం ఉంది.
ముఖ్యంగా భారత్ తో వాణిజ్యాన్ని నిలిపివేస్తామని బెదిరింపును ఉపయోగించి కాల్పుల విరమణ చేసినట్లు ప్రకటించారు. దీనిపై కూడా ప్రభుత్వం నుంచి వివరణ రాబట్టడానికి విపక్షాలు పట్టుబట్టే అవకాశం ఉంది.
రాహుల్ గాంధీ జోక్యం..
లోక్ సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ తన జోక్యంతో ట్రంప్ కాల్పుల విరమణ వాదనలకు వ్యతిరేకగా మోదీ మౌనం వహించడంపై దృష్టి సారించే అవకాశం ఉందని కాంగ్రెస్ వర్గాలు తెలపాయి.
బీజేపీ ఇప్పటికే రాహుల్ గాంధీ వ్యాఖ్యలను భారత వ్యతిరేక భాష, పాకిస్తాన్ భాష వ్యాఖ్యగా చిత్రీకరించడానికి ఎత్తులు వేసే అవకాశం ఉంది. రాహుల్ పక్కన పెడితే చర్చలో సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్, సుప్రియా సూలే, డీఎంకేకు చెందిన కనిమొళి, టీఎంసీకి చెందిన అభిషేక్ బెనర్జీ వంటి ప్రతిపక్ష నాయకులు జోక్యం చేసుకునే అవకాశం ఉంది.
అయితే ఆపరేషన్ సిందూర్ తరువాత మోదీ ప్రభుత్వం విదేశాలకు పంపిన అఖిలపక్ష ప్రతినిధులలో సూలే, కనిమొళి బెనర్జీ అందరూ ఉన్నారు.
థరూర్ ప్రశ్న..
అయితే ఈ అఖిలపక్ష ప్రతినిధుల బృందాలలో భాగమైన తన సభ్యులను చర్చ సమయంలో మాట్లాడనివ్వాలని కాంగ్రెస్ అంగీకరిస్తుందా లేదా అనేది కూడా భారీ ఊహగానాలను దారి తీసింది.
వీరిలో మనీష్ తివారీ, అమర్ సింగ్, శశిథరూర్ ఉన్నారు. వీరిని కాంగ్రెస్ హై కమాండ్ కోరికలకు విరుద్దంగా ప్రభుత్వం ప్రతినిధి బృందాల కోసం నియమించింది.
థరూర్ తన పార్టీ నాయకులతో సరైన సంబంధాలు లేవు. చర్చ సమయంలో అమర్ సింగ్ మాట్లాడటానికి ఎంపికైతే పార్టీ లైన్ నుంచి తప్పుకునే అవకాశం తక్కువగా ఉన్నప్పటికీ పార్టీ హై కమాండ్ కు దగ్గరగా ఉన్న కాంగ్రెస్ నాయకులు థరూర్, తివారీ ఇద్దరిని సమస్యకర్తలుగా చూస్తారు. లోక్ సభ చర్చ సమయంలో వారు రాహుల్ ఇబ్బంది పెట్టవచ్చు.
Tags:    

Similar News