పోలీసులు ‘అదుపు’ లోకి తీసుకోవడమంటే అర్థమేంటో తెలుసా?

మన కొత్త నేరాల చట్టం (బిఎన్ ఎస్ ఎస్)తో పోలీసులు ఇంకా బలవంతులవుతాను. ప్రజలు మరింత నిస్సహాయులవుతారంటున్న న్యాయశాస్త్ర నిపుణుడు ప్రొఫెసర్ మాడభూషి శ్రీధర్

Update: 2024-08-18 14:33 GMT

1973 క్రిమినల్ ప్రొసీజరల్ కోడ్ కింద నిందితుడు కోర్టుముందు లేకపోయినా ట్రయల్ (Trial) చేయడం నేరం. ఇది మన పాత చట్టం, గొప్ప చట్టం. ఇది నిజమైన, అర్థవంతమైన, అవసరమైన అంశం అని 1973 చట్టం చెబుతున్నది. చాలా కాలం చర్చించిన తరువాత రూపొందించిన చట్టం.  ఇపుడు  బి ఎన్ ఎస్ ఎస్ (Bharatiya Nagarik Suraksha Sanhita) కొత్త నేర చట్టం తెచ్చి నెత్తిన పెట్టారు. మొత్తం ప్రపంచంలో ఎక్కడ ఇంత దారుణమైన క్రిమినల్ లా లేదు. నిందితుడు లేకుండానే,  ట్రయల్ ఎవరు చేస్తారటు. కాదనేది ఎవరు?

న్యాయవిజ్ఞానానికి సవాల్

సి ఆర్ పి సి సెక్షన్ 204 కింద నిందితుడు లేకుండా నేర విచారణ (ప్రాసిక్యూషన్) మొదలు చేయకూడదనేది కీలకమైన నేర న్యాయవిజ్జాన నియమాలు.  బిఎన్ ఎస్ ఎస్  సెక్షన్ 228 కింద  నిందితుడు కోర్టులో లేకపోయినా నేరనిర్ధారణ చేసి, జైలుపాలు చేయవచ్చ. పాత 204 సెక్షన్ స్థానంలో రాజ్యాంగ వ్యతిరేక కొత్త 228 సెక్షన్ ఎందుకు తెచ్చారు?  ఈ సెక్షన్ వల్ల  పోలీసులకు విపరీత అధికారం సంక్రమిస్తుంది.

ఉదాహరణకు మొన్నటి హైదరాబాద్ షాద్ నగర్ లో ఒక మహిళను దారుణంగా కొట్టిన కేసును తీసుకుందాం. ఈ కేసులో ఒక మహిళ కాళ్లు విరిగిపోయేలా క్రూరంగా హింసించారు. కేవలం అనుమానం ఆధారంగా ఆమెను అరెస్టు చేయడానికి ఒక నలుగురు పోలీసులు వెళ్లారు. అందులో ఉన్న డిటెక్టివ్ సబ్ ఇన్స్ పెక్టర్ రామ్ రెడ్డి  అద్భుతమైన పోలీసు పరిశోధకుడైపోయారు.    ఈ టార్చర్ లో ఆమె  అదృష్టం వల్ల ఆమె బతికి పోయారు. లేకపోతే చంపేసి ఎక్కడో నక్సలైట్ అని కట్టుకథలు పత్రికల్లో రాస్తే దిక్కు ఉండేది కాదు. ఇదంతా పోలీసుల ‘అదుపు’లో సాగింది.

అదుపు అంటే తన్ని చంపడమా?

అదుపు అంటే ఏమిటి?

 షాద్ నగర్ అంబేడ్కర్ కాలనీకి చెందిన సునీత, భీమయ్య దంపతులను పోలీసులు ఓ దొంగతనం ఆరోపణలపై ‘అదుపు’లోకి తీసుకున్నారట. పక్కింట్లో నివాసముంటున్న నాగేందర్ అనే వ్యక్తి వీరిపై జులై 24న బంగారు పోయిందని షాద్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడట. దానితో అమె అదుపులో తీసుకున్నారు.   ప్రపంచంలో ఎక్కడ లేదీ ‘అదుపు’ అనే ముదనష్టపు మాట. అదుపు అంటే ఇష్టం వచ్చినప్పుడు చట్టబద్దమైన రాజ్యాంగ సమ్మతి లేకుండా వారంట్ లేకుండా, 24 గంటల్లో కోర్ట్ ముందు హాజరు చేయకుండా కొట్టడానికి ,హింసించడానికి ఈ అదుపు ఒక చక్కటి సాకు. ఆమె చీర విప్పి నిక్కర్ తొడిగి మరీ కర్రలతో కొట్టి హింసించే అధికారం పోలీసులకు ఎక్కడుంచి వచ్చింది. ఎఫ్ ఐ ఆర్ ఎప్పుడు చేసారు? తమ ఇంట్లో బంగారం దొంగతనం జరిగిందని పోలీసులకు ఫిర్యాదు చేస్తే బట్టలు విప్పేసి తన్నడమేనా, కొట్టడమేనా; ఇది ఆ ప్రభుత్వం ఈ ప్రభుత్వం అనే తేడా లేకుండా జరుగుతూ ఉంటుంది. అందరూ సిగ్గుపడాలి. కేంద్రంలో రాష్ట్రాల్లో ఉన్న మంత్రులు, చట్టాలు చేసే శాసన సభ్యులు, పార్లమెంటు సభ్యులు సిగ్గుపడవలసిన సంఘటన.

ఎవరీ క్రిమినల్స్

డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ రామిరెడ్డి, మరో నలుగురు పోలీసు కానిస్టేబుళ్లు రఫీ, మోహన్ లాల్, కరుణాకర్, అఖిల సునీత, భీమయ్య దంపతులను అదుపులోకి తీసుకున్నారట. అదుపు అనేది కొత్త నేరం చట్టంలో లేదు. పాత క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ లో లేదు. ఎక్కడా ఏదేశంలోనూ లేదు. పోలీసుకు హద్దు పద్దు లేకుందా అధికారం ఇచ్చేది. ఈ అదుపులోకి తీసుకున్నా కొట్టే అధికారం ఎవరికీ లేదు. మరొక ఉదాహరణకు గత ఆంధ్రప్రదేశ్ శాసనసభ కాలంలో రూలింగ్ పార్టీ రెబెల్  ఎంపి రాఘురామరాజుని కూడా పార్లమెంటు సభ్యుడని కూడా చూడకుండా   పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు  ఆయన్నిబాగా బాదారని సుప్రీంకోర్టు సలహా మేరకు జరిగిని ఇన్వెస్టిగేషన్ లో తేలింది. తెలంగాణలో ఇప్పుడు షాద్ నగర్ దళిత మహిళకు థర్డ్ డిగ్రీ దారుణ నిష్కారణంగా హింసకు గురిచేసారు. దానికి ఈ బాధ్యత ఎవరిది. ఈ దేశంలో రాష్ట్రంలో జిల్లాలో నగరంలో దళిత మగవారికి ఆడవారికి చిత్రహింసలకు గురిచేసిన వారిని ఏం కేసులు పెట్టారు? కాని అతను నేరస్తులు ఎవరు, ఏ హొం మంత్రి, లేదా ఏదో మంత్రి జవాబు ఇస్తారా? ఎప్పుడు ఏ రాష్ట్రంలో ఇస్తున్నారా? ఈ రెండు సంఘటనలు ప్రజలను భయత్పాతానికి గురిచేస్తాయి. ప్రభుత్వాలకు నచ్చక పోతే, ప్రభుత్వానికి వ్యతిరేకంగా మారితే, ఎవరినైనా, చివరకు ఎంపినైనా సరే అదుపులోకి తీసుకుంటారు, చితకబాదుతారు,జైల్లో తోస్తారు. అందుకే బిఎన్ ఎస్ ఎస్ పౌరుల భద్రతకోసం తెచ్చిన చట్టాల్లాగా కనిపించవు. పదవిలో ఉన్నవారిని కాపాడేందుకు, ప్రజలన జడిపించేందుకు చేసిన రాజకీయ ఏర్పాటనిపిస్తుంది.

మళ్లీ షాద్ నగర్ కేసులోకి వస్తే...

ఆ తర్వాత భర్త భీమయ్యను వదిలేసిన పోలీసులు. 13 ఏళ్ల కుమారుడి ముందే సునీతను చిత్రహింసలకు గురి చేసారు. చీరవిప్పి నిక్కర్ తొడిగి రబ్బర్ బెల్టుతో, బూటుకాళ్లతో విచక్షాణారహితంగా కొట్టారు. దొంగతనం ఒప్పుకోకపోవడంతో తన కుమారుడిని కూడా అరికాళ్ళపై రబ్బర్ బెల్ట్‌ తో కొట్టినట్లు బాధితులు ఆరోపించారు. పోలీసులు కొట్టిన దెబ్బలకు తాళలేక మూర్చపోయి స్పృహ తప్పి పడిపోగా.. సునీతను ఇంటికి పంపించారు. కాగా, ఈ ఘటన బయటకు పొక్కటంతో తీవ్ర దుమారం రేగింది. దళిత మహిళపై దాడి వ్యవహారంపై జాతీయ మానవ హక్కుల కమిషన్‌లో పిటిషన్‌ కూడా దాఖలైంది. సిఐ రామిరెడ్డితో సహా నలుగురు కానిస్టేబుళ్లపై తాజాగా ఎస్సీ, ఎస్టీ కేసు పెట్టారట.

ఎంత పరిహారం ఇస్తారు, ఒప్పుడు ఇస్తారు?

సునీతపై దాడికి పాల్పడ్డ డీఐ రామిరెడ్డి నలుగురు కానిస్టేబుళ్లను సర్వీసు నుంచి తొలగించాలని, అరెస్టు చేసి శిక్షించాలని న్యాయవాది, సమతా సైనిక్‌ దళ్‌ న్యాయ సలహాదారు డాక్టర్‌ బీ కార్తీక్‌ నవయన్‌ ఎన్‌హెచ్‌ఆర్‌సీలో ఫిర్యాదు చేశారు. కేసు సీబీఐకి అప్పగించి దర్యాప్తు నిష్పక్షపాతంగా జరిగేలా చూడాలన్నారు. బాగానే ఉంది. ప్రతిదానికి సీబిఐ విచారణ చేయాలంటే ఇక ఈ పోలీసు డిపార్ట్ మంట్ ఎందుకు? ఎస్సీ, ఎస్టీ వేధింపుల నిరోధక చట్టం కింద బాధితురాలికి పరిహారంతో ఉపాధి కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ఇప్పుడు ఆమెకు చాలా పెద్ద హాస్పిటల్ లో చికిత్స ఇస్తున్నారా? ఈ డిపార్ట్ మెంట్ లో మొత్తం పోలీసు మహానుభావులు ఎంత డబ్బు ఇస్తారు?

ఎన్నేళ్ల కారాగారం ఇస్తారు?

మనకు పోలీస్ చట్టం అని ఒకటి ఉంది. బిఎన్ ఎస్ ఎస్ చట్టం ఉన్నా లేకపోయినా, ఈ నేరాలు చేసినవారికి శిక్షలు ఉన్నాయి. ఇది THE POLICE ACT, 1861 (5 of 1861). గత శతాబ్దంలో ఉంది అంటే ఐ పి సి ఉన్న 1860 తరువాత సంవత్సరంలో ఈ 1861 చట్టం తెచ్చారు. ఎందుకంటే పోలీసులు తప్పులు చేస్తారు, నేరాలు చేస్తారు కనుక వారిని రెగ్యులేట్ చేయడం ఈ చట్టం ఉంది. ఎంతమంది పోలీసు నేరస్తులు అందరికీ శిక్ష వేయడం సాధ్యమా. రోజు ప్రతి పోలీసు స్టేషన్ లో చేసిన నేరాలను ఎవరు విచారణ చేస్తారు? కనీసం ఈ చట్టం 1861 నాటి న్యాయమైన చట్టం కోట్ల లక్షలమందికి ఉందని కూడా తెలియదు. ఏతా వాతా తేలిందేమింటే, ఈ చట్టాలత్ పోలీసులు ఇంకా బలవంతులవుతారు. ప్రజలు నిస్సహాయులవుతారు.

కొత్త ప్రభుత్వం పాత చట్టాలను తీసేసి అంత కన్నా దారుణమయిన  చట్టాలు చేస్తూ ఉంటే రామరాజ్యం ఎట్లా అవుతుంది.  


Tags:    

Similar News