హాస్యానికి ప్రభుత్వాన్ని కూల్చే శక్తి ఉందా?
చరిత్రలో హింసకు గురయిన హాస్య కళాకారుల జాబితాలో కునాల్ కమ్రా చేరినట్టేనా?;
By : KS Dakshina Murthy
Update: 2025-03-25 12:20 GMT
సమాజం ఉన్నంతకాలం హాస్యం అనేది ఉంటుంది. ఛలోక్తులతో ఉల్లాసంగా సాగే ప్రసంగాలతో ప్రజలను తమ వైపు ఆకర్షించుకునే గుణం వ్యంగ్యానికి ఉంది. ఇవి తరుచుగా లోకంలో ఉన్న దుర్గుణాలను లక్ష్యంగా చేసుకుని పాలకులకు ప్రశ్నించే విధంగా ఉంటాయి.
నాజీలు రాజ్యమేలుతున్న హిట్లర్ కాలంలో కానీ, ఈజిప్ట్ వంటి ఊహాత్మక ప్రజాస్వామ్యం ఉన్న ప్రాంతాలలో ఈ హాస్యమే అణచివేతను తగ్గించి వారి అధికార దర్ఫాన్ని తొలగించింది.
భారత్ లో ప్రస్తుత పాలక బీజేపీని సమర్థిస్తూ టీవీ షోలు చేస్తూ అరెస్ట్ అయిన టెలివిజన్ ఛానెల్ యజమాని అర్నాబ్ గోస్వామికి సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది.
అయితే ఈ నిర్ణయం పై స్టాండ్ అప్ కమెడియన్ కునాల్ కమ్రా సామాజిక మాధ్యమాల్లో వ్యంగ్యంగా ట్వీట్లు చేశాడు. ప్రస్తుతం ఆయన రాష్ట్రం నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నాడు. ఈ విమర్శలతో ఆయన వ్యంగ్య రచయిత జాబితాలో చేరినట్లు అయింది.
ఈ కేసును కేంద్ర ప్రభుత్వం తరఫున కేసులు చూసే అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ సుప్రీంకోర్టులో వాదించారు. దీనిపై కునాల్ కామ్రా నవ్వులు పూయించే విధంగా కొన్ని వ్యాఖ్యలు చేశారు.
ప్రస్తుతం ఈ అంశం పై కోర్టు ధిక్కార చర్యలకు అనుమతి ఇచ్చారు. అయితే కామ్రా వీటికి బెదరకుండా తన వ్యాఖ్యలకు కట్టుబడి ఉంటానని స్పష్టం చేశారు.
కామ్రా చేసిన ట్వీట్లను సుప్రీంకోర్టు ఎలా చూస్తుందో తెలియదు కానీ అతను మాత్రం విచారణ ఎదుర్కొబోతున్నాడని మాత్రం చెప్పవచ్చు. ఈ తెలివి తక్కువ హాస్యపు మాటలను కోర్టు ముందు నేరారోపణ చేయడానికి వ్యవస్థ సిద్ధమైంది.
దేశంలో ఉన్న బలమైన ప్రభుత్వాన్ని రాజకీయ ప్రతిపక్షం, మేధావులు ఎవరూ ప్రభావం చూపలేకపోయినా హస్యనటులు, హాస్య రచయితలు, వ్యంగ్య రచయితలు చాలా సార్లు ఆ పనిచేశారు. ఇప్పుడు వారి జాబితాలో కామ్రా చేరినట్లే. ఇది నిజంగా గర్వపడే అంశం.
సుప్రీంకోర్టు తీర్పుపై మీడియాలో వచ్చిన వివిధ వ్యాఖ్యానాలు, సంపాదకీయాలు, అభిప్రాయాలలో ప్రతిబింబే విషయం ఏంటంటే.. కేంద్ర ప్రభుత్వానికి మద్దతుగా వార్తలు ప్రసారం చేసే ఆర్నాబ్ గోస్వామి కేసును కోర్టు అంత త్వరగా వినడానికి ఒప్పుకోవడం ఏంటీ? దేశంలో ఉన్న కోర్టులలో ఎన్నో కేసులు ఏళ్లుగా మూలుగుతూ మోక్షానికి నోచుకోవడం లేదు.
అనేక మంది జైళ్లలో మగ్గుతున్నారు. అయితే వాటికి ప్రాధాన్యం ఇవ్వకుండా తక్షణమే కేసును విచారించి బెయిల్ ఇవ్వడం అసాధారణమే. ఆర్నాబ్ బెయిల్ కు అర్హుడే అయినప్పటికీ అంత ప్రాధాన్యం ఇవ్వడం పైనే ఇక్కడ ప్రశ్నలు సంధిస్తున్నారు. కునాల్ కామ్రా చేసిన వ్యంగ్యంతో ఇప్పుడు ఇది వ్యవస్థ లోతుల్లోకి ఈ సమస్యను తీసుకెళ్లింది.
సెమాంటిక్ జర్నల్ ‘ఎట్ సెటేరా’ లో ‘ది పొలిటికల్ యూసెస్ ఆఫ్ హ్యూమర్’ అనే వ్యాసంలో రోనాల్డ్ జి వెబ్ తన అభిప్రాయాన్ని ఇలా వ్యక్తం చేశారు. ‘‘ హాస్యం, ఒక వ్యవస్థ, దాని ఆలోచన పాతతరం కంటే తక్కువ స్థాయికి దిగజారుతున్నప్పుడూ దానిని గుర్తించి బెదిరించే ప్రయత్నం చేస్తారు. ఇది ఆ వ్యవస్థను ఎగతాళి చేయడానికి, కించపరచడానికి ఉపయోగించినప్పుడూ ఎక్కువ ముప్పును కలిగిస్తుంది’’ అని అభిప్రాయపడ్డారు.
ఇటవంటి హాస్యం ఆ వ్యవస్థను ఆరాధించే వారికి, న్యాయం జరగుతుందున్న ఆశగా ఉన్నవారికి ద్వేషంగా, హానికరంగా కనిపిస్తుంది. ఇప్పుడు కామ్రా అటువంటి పనే చేశారు. ఒకప్పటి విమర్శనాత్మక హాస్యం కాలక్రమేణా ఇప్పుడు ‘జోక్’ గా మారింది. పెద్ద వ్యాసాలు, గ్రంథాలు, వాదనలతో పోలిస్తే తీసుకెళ్లాల్సిన సందేశాన్ని ప్రజలకు నేరుగా తీసుకెళ్తుంది. అది కూడా క్లుప్తంగా, చాలా చురకు పెట్టే విధంగా చేరుస్తుంది.
హాస్యం అనేది ఒక భావజాలం కాదు. ఏ ఒక్క ప్రాంతానికో పరిమితం కాదు. కానీ కొన్ని సందర్భాలలో ఇది ప్రాణాంతకంగా కూడా పరిణమించవచ్చు.
జర్మన్ డెర్ స్పీగెల్ మ్యాగజైన్ ప్రకారం.. నాజీయుగం నాటి హాస్యం గురించిన ఒక పుస్తకం లోని జోక్ ను చెప్పాడు. బెర్లిన్ ఆయుధ కార్మికురాలు, మరియాన్ ఎలిస్ కే. తన తోటి ఉద్యోగికి ఒక జోక్ చెప్పడం విన్నాడు.
అదేంటంటే.. నాజీ అధినేత హిట్లర్ ఒక రేడియో టవర్ నుంచి నిలబడి ప్రసంగిస్తున్నాడు. బెర్లిన్ ప్రజలను ఉత్సాహపరిచేందుకు తాను ఏదైనా చేయాలని అనుకుంటున్నానని చెప్పాడు.
దానిని బదులుగా గోరింగ్ ‘‘నువ్వు అక్కడి నుంచి ఎందుకు దూకకూడదు’’ అని సూచించాడు. తరువాత ఈ హాస్య కథకురాలు అరెస్ట్ చేయబడి ఉరితీయబడింది.
సాధారణంగా ప్రభుత్వాలు ఎప్పుడూ నవ్వకుండా, మౌనంగా ఉండే తీవ్రమైన వ్యక్తులతో నిండే ఉంటుందనే అభిప్రాయం ఉంటుంది. అయితే వాస్తవం ఏంటంటే.. ఇవి హాస్యాన్ని ప్రాణాంతకంగా ఉపయోగించగలవు. మీడియా చేతగానితనం, సోషల్ మీడియా వ్యవస్థలు ఉన్నప్పటికీ పాలక వర్గం, తమ ప్రత్యర్థులను అప్రతిష్ట పాలు చేయడానికి హాస్యం, వ్యంగ్యాన్ని ఎంపిక చేసి ఉపయోగిస్తాయి.
ఉదాహారణకు గాంధీ కుటుంబం పై ఆర్ఎస్ఎస్- బీజేపీ దాడులు చేస్తూ రాహుల్ గాంధీపై పప్పూ అని ముద్రవేశాయి. ఇది రైట్ వింగ్ వారిచే విపరీతంగా ట్రోల్స్ చేసి ఓ అపరిపక్వ నాయకుడిగా ముద్ర వేశాడు.
గాంధీ ఎప్పుడూ పరిపాలనలో భాగం కాలేదు. అతని పరిపాలన సామర్థ్యం కూడా ఎవరికి తెలియదు. కానీ అతడిపై మాత్రం బలంగా ఓ ముద్ర వేశారు.
ఇది కేవలం రాహుల్ గాంధీతో ఆగలేదు. తన సైద్దాంతిక ప్రత్యర్థులందరికి ఇదే విధమైన ట్యాగ్ లు తగిలించారు. వారిలో కొందరిని అర్భన్ నక్సల్స్ గా, మరికొందరిని చెక్కలర్లు, లిబ్టార్డ్స్, లవ్ జిహాద్ లుగా ముద్ర వేసింది. ఇంకా చాలా వ్యంగ్య పదాలను సృష్టించారు. ఇవి వారి ప్రత్యర్థులను పూర్తిగా ఆత్మరక్షణలో పడేశాయి.
సాధారణంగా మనదేశంతో సహా ప్రపంచంలోని అనేక ప్రాంతాలలో పెరుగుతున్న సామాజిక- రాజకీయ సంక్షోభానికి అనుగుణంగా హాస్యం లేదా వ్యంగ్యం మరింత పదునుగా మారుతుంది.
దీనికి ప్రత్యక్ష ఉదాహారణ ఒక్కటే.. ఈజిప్టు యాంకర్ హాస్య ప్రదర్శన హోస్ట్ అయిన బాసెం యూసుఫ్.. 2011 లో హోస్నీ ముబారక్ పై తిరుగుబాటు సందర్భంలో చిన్న చిన్న వీడియోలు చేసి యూట్యూబ్ లో పోస్ట్ చేసేవారు.
ఇది కొన్ని మిలియన్ల వ్యూస్ ను సాధించిపెట్టింది కానీ.. ఆయన మాత్రం ప్రభుత్వ ఆగ్రహానికి గురయ్యారు. కానీ అదృష్టవశాత్తూ అప్పటికే హోస్నీ ముబారక్ పారిపోయాడు. తరువాత అతని స్థానంలో ముస్లిం బ్రదర్ హుడ్ కు చెందిన మహ్మద్ మోర్సీ వచ్చాడు.
ఈ సందర్భంగా నిర్వహించిన మరో కార్యక్రమంలో యూసుఫ్ వచ్చాడు. అయితే అందులో అధ్యక్షుడిని, ఇస్లాంను అవమానించాడని మోర్సీకి కోపం వచ్చింది. తరువాత అతను అరెస్ట్ అయ్యాడు.
కోర్టులో ఈ ఆరోపణలను యూసుఫ్ సవాల్ చేశాడు. కానీ ఈ లోపే మోర్సీపై సైన్యం తిరుగుబాటు చేసింది. మోర్సీ పదవీత్యుడిగా మారడంతో యూసుఫ్ కు తిరిగి విముక్తి లభించడంతో తన షోను తిరిగి ప్రారంభించాడు.
అయితే సైనిక నియంత అల్ సీసీ కూడా ఈ వ్యంగ్య రచయితతో మనస్థాపం చెందాడు. అయితే ఈసారి అతను అరెస్ట్ అయ్యే సమయానికే దేశం విడిచిపారిపోయాడు. నిజానికి అతను ఒక కార్డియాలజిస్టు. ప్రస్తుతం అతను సురక్షితంగా ఉన్నాడు. వ్యంగ్య రచయితలు ప్రభుత్వాలను ప్రశ్నిస్తే వారికి నచ్చదు.
దేశానికి చెందిన కునాల్ కామ్రా తన హాస్యాన్ని అర్నాబ్ గోస్వామి నుంచి న్యాయ వ్యవస్థ వరకూ విస్తరించాడు. ఇప్పుడు అతని వ్యంగ్యం ఎక్కడికి దారి తీస్తుంది. నాశనం వైపు వెళ్తుందా.. నిర్ధోషిత్వానికి దారి తీస్తుందా .. దేశం తెలుసుకోవాలని అనుకుంటోంది. అన్ని ప్రశ్నలకు సమాధానం కాలం ఏవిధంగా సమాధానం చెబుతుందో చూడాలి.
( ఈ వ్యాసం 2020 నాటిది. కామ్రా మీద సుప్రీంకోర్టు ధిక్కార కేసు నమోదు చేయాలని నిర్ణయించినపుడు ఫెడరల్ మేనేజింగ్ ఎడిటర్ కె.ఎస్ దక్షిణామూర్తి రాసిన వ్యాసం. నేటికీ ఇది ప్రస్తుతమే. )