విపక్ష,అధికార పార్టీల రెండేళ్ల ప్రోగ్రెస్ రిపోర్ట్

ప్రతిపక్ష పార్టీ మాటలకే పరిమితం అయిపోతుంది అని నిర్మాణాత్మకంగా పనిచేయడం లేదు.

Update: 2025-12-19 07:03 GMT

    తెలంగాణ రాష్ట్రంలో రెండేళ్లు ప్రజా పాలన పూర్తి చేసుకున్న అధికార కాంగ్రెస్ పార్టీ తమ నాయకుడి మంత్రివర్గ సహచరుల పాలన ఎలా ఉంది అనే ప్రశ్నలను ప్రజల దృష్టికి తీసుకుపోతే కొందరు శభాష్ అని, మరి కొందరు పెదవి విరిస్తే,, ఇంకా కొందరు బాగాలేదని అభిప్రాయం వ్యక్తపరిచినారు ప్రతిపక్ష పార్టీ మాటలకే పరిమితం అయిపోతుంది అని నిర్మాణాత్మకంగా పనిచేయడం లేదు. రాజకీయాల్లో శాశ్వత మిత్రుడు శాశ్వత శత్రువు ఉండడన్నట్టు మరోసారి రాష్ట్ర రాజకీయాలు చూస్తే పై ఉవాచ నిజమే అనిపిస్తుంది.

విపక్షం తీరుతెన్నులు :-- 2023 డిసెంబర్ లో జరిగిన ఎన్నికలలో ఒటమి చెందిన పిదప భారతీయ రాష్ట్ర సమితి అలియాస్ తెలంగాణ రాష్ట్రం సమితి పార్టీలో ఇప్పటివరకూ అంతర్మధనం జరిగిన ఆత్మ పరిశీలన చేసుకున్న దాఖలాలు ఏమాత్రం నాయకులలో కాన రావడం లేదు . పైపెచ్చు ఆ పార్టీలోని ముఖ్యమైన నాయకులు నెపాన్ని ప్రజల మీద నెట్టేయడం విడ్డూరంగా ఆశ్చర్యకరంగా ఉంది. అధికారానికి రెండు సంవత్సరాలు దూరం అయ్యేసరికి పార్టీలో నాయకుల మధ్య లుకలుకలు ఒకరిపై ఒకరు ఆరోపణలు తమ తమ వర్గాలతో ప్రత్యారోపణలు చేసుకోవడం జరుగుతూనేవుంది. వీరి బిఆర్ఎస్ పార్టీలోని నాయకుల మధ్య తలుపు చెక్కతో నేను ఇట్లా అంటే పీట చెక్కతో తాను ఇట్లానే బాగా ఏదో వీరు మాట్లాడితే ఏదో మునిగిందన్నట్లు ప్రాముఖ్యత ఇచ్చే మీడియాకు పత్రికలకు మేతను ప్రజలకు బోలెడు వినోదాన్ని పంచుతున్నారు.

ఆ పార్టీ నాయకులు పదేళ్ల పరిపాలనలో తాము చేసిన తప్పులను నాయకులు ఎవరికి వారే కనీసం ఆత్మ పరిశీలనతో సరి చేసుకొని గ్రాస్ రూట్ లెవెల్ నుండి పార్టీ నిర్మాణం చేసుకోవాల్సిన వాతావరణం ఉంది. దానికి బదులు తెల్లార్లేస్తే ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అధికార పార్టీ పైన అవినీతి ఆరోపణలు చేయడాన్ని చూస్తుంటే ఆవు గట్టుమీద మేస్తే, దూడ చేనులో మేసినట్టుగా ఉంది. ఈయన వైఖరి వల్ల తమ పదేళ్ల పరిపాలన లో వీళ్లు చేసిన ఘనకార్యాలన్నీ ఇప్పుడు చెప్పకనే చెప్తున్నట్టుగా ప్రజలు భావిస్తున్నారు తప్ప అసమ్మతిని రాజేసెలా లేదు. ఈయన రెండేళ్ల ప్రతిపక్ష హోదా పాత్రలో నిర్వహించిన నిర్వహిస్తున్న పాత్రను గమనిస్తే , విధానాలు వాదనలు వైఖరులను లోతుగా పరిశీలించి చెప్పాలంటే ఆత్మరక్షణలో పడినట్టుగా ఉంది .

అన్నిటికన్నా మిక్కిలి బిఆర్ఎస్ పార్టీ నాయకులకు దేశంలోనే మొదటి స్థానంలో పార్టీ నిధులు కలిగి ఉన్నా బిఆర్ఎస్ పార్టీ నాయకులు ఇంకా తమ పాలనలో చేసిన వాస్తవాలను ఆలోకన చేసుకోలేకపోతున్నారు తమ ప్రభుత్వంలో తాము చేసిన తప్పులను అంగీకరించే దశలో కూడా వారు లేరు , పైగా కార్యనిర్వకాధ్యక్షుడు తనకు తెలువనివి ఏమీ లేదనే రెట్టించిన అహం భూషణంగా, హావ భావాలలో బాడీ లాంగ్వేజ్ లో ద్యోతకమవుతుంది. లెక్కకు మిక్కిలి కూడబెట్టిన స్వంత ఆస్తుల వలన కళ్లుండీ చూడలోని కబోదిలా చూసేవారికి ఇతని అడుగడుగునా తెంపరితనం ప్రవర్తనా కనిపిస్తుంది. ఇవన్నీ కలిపి ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకుపోవడానికి తగినంత సమర్థత ప్రదర్శించడం లేదు. పైగా ఆ పార్టీ నాయకులు గత చేదు అనుభవాల నుంచి గుణపాఠం పాఠం నేర్చుకోవడానికి సిద్ధంగా . పదేళ్ల కాలం పాటు ఏకఛత్రాధిపత్యంగా ఏలిన కుటుంబ సభ్యులు మందికి చూడ అంతర్గత విభేదాలతో కుమ్ములాడుకుంటున్నట్టు మీడియాలోకి ఎక్కి ప్రజలకు కావలసినంత వినోదం పంచుతున్నారు. కానీ ఆ పార్టీకి ప్రజలలో గ్రాఫ్ మాత్రం పెద్దగా పెరగడం లేదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అంతేకాకుండా ప్రతిపక్షాలకు అందించిన రోశయ్య బాలసుబ్రమణ్యం విగ్రహాల ఆవిష్కరణ పరిస్థితులను ఉపయోగించడంలో పూర్తిగా విఫలమైంది. ఒకవేళ టిఆర్ఎస్ పార్టీ శాసనసభ సభ్యులు పెద్ద మొత్తంలో ధర్నా చేస్తే హైదరాబాదులోని ఇందులో ప్రజల ఓట్లన్నీ వీళ్ళ వైపు మళ్లేవి. కానీ వీళ్ళు హైదరాబాదులో నివాసం ఉంటున్న ఐదారు లక్షల సెటిలర్ల ఓట్ల కోసం ఆశపడడం చూస్తే, అంది వచ్చిన వచ్చిన అవకాశాలను రాజకీయంగా వినియోగించుకోలేక విఫలం చెందుతున్నారు.

ఇకపోతే ఆ పార్టీ అధినాయకుడు 20 23 ఎన్నికల ప్రచార సభలలో కెసిఆర్ చెప్పినట్టు తమను ఓడిస్తే విశ్రాంతి తీసుకుంటానని చెప్పాడు. ఈ ఒక్క చెప్పిన మాటను మాత్రం అక్షరాల నిలబెట్టుకుంటున్నాడు.

అధికార పార్టీ హంగుఆర్భాటాలు:-- రెండేళ్ల పాలనను రాజకీయంగా పరిశీలిస్తే,వీడిని విడిచిపెట్టి వాని కట్టేయమన్నట్టుగా ఉంది. తెలంగాణ పిసిసి అధ్యక్షుడిగా ఎన్నికల ప్రచార సభలలో మాట్లాడిన మాటలకు ముఖ్యమంత్రిగా చేతలకు మధ్య పొంతన లేదు.ఎందుకంటే విద్యుత్తు కొనుగోళ్లు కాలేశ్వరం ప్రాజెక్టు ధరణి పేరు మీద భూముల ఆక్రమణ ఇంకా చర్లపల్లి జైల్లో కుటుంబ అవినీతిపరులకు డబుల్ బెడ్ రూమ్ నిర్మిస్తానని శాసన సభ ఎన్నికల ప్రచార సభ లో రాహుల్ గాంధీ అవినీతి సొమ్మును రికవరీ చేసి తెలంగాణ ప్రజల పరం చేస్తానని ప్రజలు అడగకుండా చెప్పారు. రెండు సంవత్సరాలలో పదే పదే రాష్ట్ర ముఖ్యమంత్రిగా నేను ప్రతిపక్షాల మీద నేను కక్ష సాధింపు చర్యలు తీసుకోదల్చుకోలేదు అంటున్నాడు. ఇలా మాట్లాడుతుంటే తెలంగాణ ప్రజలకు ఎన్నికలలో దుమ్ము దుమ్ముగా ఏమి చెప్పి చేపట్టగానే ఏమి మాట్లాడుతున్నాడో ఏం చేస్తున్నాడో అర్థమవుతుంది తెలంగాణ ప్రజలు అమాయకంగా ముఖం పెడతారు కానీ అవకాశం వచ్చినప్పుడు తడాఖా చూపిస్తారు. వారు వీరు అయినట్టు, వీరు వారు అయినట్టు ప్రవర్తిస్తే ప్రజలకు ఇంకిత జ్ఞానంతో విషయాన్ని ఆలోచిస్తారని అధికార పార్టీ ఎరుకలో ఉంచుకుంటే మంచిది. కేసిఆర్ ను మించి అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు కూడా కేవలం మాటల గాంబీర్యం, రాజకీయ చాతుర్యం ఉన్నట్టుగా ప్రవర్తిస్తే ఆలోచిస్తే తెలంగాణ సామాన్యులు అవకాశం వచ్చినప్పుడు భవిష్యత్తులో పక్కాగా స్పష్టమైన నిర్ణయం తీసుకుంటారు. తెలంగాణ గత ప్రజాస్వామ్య రాజకీయ చరిత్రను చూస్తే ఇది రూడీ మరింత అవుతుంది .

మీ హామీలను నెరవేర్చడంలో మీరు చెబుతున్న అప్పుల గురించి అవగాహన చేసుకుని తెలంగాణ ప్రజలు మెదులుతున్నారు. మీరు ఎన్నికల మేనిఫెస్టో ద్వారా తెలంగాణ ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను గత పది ఏళ్ల పాలకుడు లాగే మా ఇష్టం ఉన్నట్టు ప్రర్థిస్తామంటే రానున్న కాలం నిర్ణయిస్తుంది.

ఎన్నికల నోటిఫికేషన్ ముందు బిసి రిజర్వేషన్ల గురించి ఏం మాట్లాడినా, గ్రామపంచాయతీ సర్పంచ్ ఎన్నికలలో అనేక సమీకరణల కారణంగా గెలుపు ఓటములు ఉంటాయి తప్ప మేలైన పరిపాలన ప్రజలకు అందిస్తున్నారని భావిస్తే బొక్క బోర్ల పడ్డట్టే లెక్క న్నట్టు లెక్క వాపును చూసి బలుపు అనుకుంటే పొరపాటు.

ఇప్పటికైనా రాహుల్ గాంధీ బహిరంగ సభలలో చేసిన భాషణలను, తెలంగాణ ముఖ్యమంత్రీ ఆయన సహచరమంత్రులు ఎన్నికలలో చెప్పిన మాటలను నెరవేర్చడంలో, విరుద్ధంగా గత పాలకుల వలె మీరు కూడా ప్రజల మనోభావాలతో ఆటలాడితే ప్రధమంగా తెలంగాణ మేధావి వర్గంలో కవులలో కళాకారులలో వ్యతిరేకత వచ్చి క్రమక్రమంగా ప్రజలలోకి ఆ భావాలు పోతాయి. గత ప్రభుత్వంపై ఇలాగే జరిగింది.

మాటలకు కట్టుబడి గత పాలకుల నిర్వాకాలపై తగిన చట్టబద్ధమైన చర్యలు తీసుకొని మీ నిజాయితీని నిరూపించుకోవాల్సిన సమయం ఆసన్నమైనది. ధరణి సమస్యలను భూమాతలు పరిష్కరించిన సంఖ్య ఎంత రికవరీ చేసిన భూమి ఎంత కేరళ పోల్సరీకి విభాగంతో పోల్సరిక్ విభాగంతో జరిపి అక్రమ భూమిని చేసినది ఎంత కౌలు రైతులకు మహిళలకు నిరుద్యోగులకు ఇస్తానన్న పెన్షన్ల విషయంలో ఇప్పటివరకు ఎందుకు అమలు చేయలేక పోయారో చెప్పలేదు . పాలకుల మార్పు కోరుకున్నప్పుడల్లా అదేమిటో కానీ తెలంగాణ ప్రజల బతుకులు ప్రతిసారి పెనం మీదినుంచి పొయ్యిలో పడ్డట్టే అవుతుంది . మొత్తానికి సారాంశంలో ప్రతిపక్ష పార్టీ , అధికార పార్టీ పనితీరు కొలమానలు హళ్లికి హళ్లి సున్నకు సున్నా అన్నట్టుగా వుంది .

Tags:    

Similar News