‘డిజిటల్ అరెస్ట్’ లు ఎప్పుడు అంతం అవుతాయి?
డిజిటల్ అరెస్ట్ గురికాబడే వారందరూ కూడా విద్యావంతులే ఎందుకవుతున్నారు?
By : KS Dakshina Murthy
Update: 2025-12-21 07:38 GMT
‘డిజిటల్ అరెస్ట్’ ఈ మధ్య వార్తా ఛానెల్లు, పత్రికలలో ఎక్కువగా వినిపిస్తున్న పేరు. ఈ అంశంపై వార్తలలో కనీసం ఒక్క కథనం కూడా లేకుండా రోజు గడవడం లేదు. ఫలానా వ్యక్తి లక్షలు పోగొట్టుకున్నాడు. మరెవరో డిజిటల్ అరెస్ట్ భయంతో కోట్లాది రూపాయలు సమర్పించుకున్నాడనే వార్తలు తరుచుగా రావడం పరిపాటిగా మారింది.
ఆశ్చర్యకరంగా బాధితులందరిని తాము కష్టపడి పోగుచేసుకున్నది పోయాకనే జ్ఞానోదయం కలుగుతోంది. డిజిటల్ అరెస్ట్ అనేది సమర్థవంతమైన స్కామర్ల ద్వారా చేయబడే నకిలీ అరెస్ట్. వారు బాధితులను మోసం చేసి, భయపెట్టి నమ్మిస్తారు.
పోలీసులు, సీబీఐ, ఈడీ మరేదైనా ఎన్ ఫోర్స్ మెంట్ ఏజెన్సీ అని చెప్పుకునే స్కామర్లు, బాధితులను మొదట భయపెట్టి, తరువాత మెల్లగా సాయం చేస్తామని హమీ ఇచ్చి, బలవంతంగా డబ్బు లాక్కుంటారు.
తాజాగా బెంగళూర్ లోని ఒక లెక్చరర్ డిజిటల్ అరెస్ట్ చేసింది. కొన్ని వార్తల ప్రకారం ఆమె గత ఆరు నెలలుగా డిజిటల్ అరెస్ట్ లో ఉంది. ఆ సమయంలో తనకు ఉన్న రెండు ప్లాట్లు, ఒక అపార్ట్ మెంట్ అమ్మేసి, స్కామర్లకు చెల్లించడానికి బ్యాంకు లోన్ తీసుకుంది.
వారికి దాదాపుగా రూ. 2 కోట్లు ఇచ్చింది. స్కామర్లు కాల్ చేయడం ఆగిపోవడంతో బాధితురాలు మోసపోయినట్లు గ్రహించి, స్టానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది.
స్కామర్ సదరు లెక్చరర్ కి ఫోన్ చేసి మీరు బుక్ చేసుకున్న కొరియర్ లో డ్రగ్స్ ఉన్నాయని, మిమ్మల్ని అరెస్ట్ చేయడానికి పోలీసులు వస్తారని భయపెట్టినట్లు తేలింది. బెంగళూర్ లోని మరో టెకీ కూడా ఆరు నెలల కాలంలో డిజిటల్ అరెస్ట్ పేరిట రికార్డు స్ఠాయిలో రూ. 31.83 కోట్లు కోల్పోయారు.
పోలీసులు డిజిటల్ అరెస్ట్ లేదని ఎంత ప్రచారం చేస్తున్నా.. వాస్తవానికి వాటి సంఖ్య రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. గడచిన రెండు సంవత్సరాలలో డిజిటల్ అరెస్ట్ కేసులు మూడురెట్లు పెరిగాయి. ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ కు తెలియజేసింది.
2022 లో ఇలాంటి కేసులు 39,925 నమోదు కాగా, మొత్తం మోసం రూ. 91.14కోట్లు, 2024 లో వీటి సంఖ్య మూడు రెట్లు పెరిగి 1,23,672 కు చేరుకుంది. మోసం విలువ రూ. 1935.51 కోట్లకు చేరింది.
తాను ఎటువంటి నేరం చేయలేదని తెలిసిన వ్యక్తి, పోలీసులు ఫోన్ చేస్తున్నామనగానే ఎలా భయపడతారు? ఏమంత బుర్ర పెట్టి ఆలోచించినా.. సమీపంలోని పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఈ కాల్ ఎక్కడిదో అని గుర్తించడానికి ఏమంత సమయం పట్టదు. అయినప్పటికీ దీనిని ఎవరూ చేయడం లేదు.
వ్యంగ్యమైన విషయం ఏంటంటే.. డిజిటల్ అరెస్ట్ కు గురికాబడే వారిలో ఎక్కువ మంది బాగా చదివి, అక్ష్యరాస్యులైన మేధావులే. వారిలో ఉపాధ్యాయులు, వ్యాపారవేత్తలు, ప్రయివేట్ రంగానికి చెందిన రిటైర్డ్ అధికారులు, జర్నలిస్టులు కూడా ఉన్నారు. వారికి బయటి ప్రపంచం మీద అవగాహాన ఉన్నప్పటికీ ఇది జరిగింది.
ప్రజలు మోసపోవడానికి రెండు కారణాలు..
ప్రజలు మోసపోవడానికి ముఖ్య కారణం.. బాధితులు ఎప్పుడూ వార్తా పత్రికలు చదవరు లేదా ఆ అలవాటును వదిలేయడం. ఈ సందర్భంలో వారికి సమాచారం లేకపోవడం ఒకటైతే మరొకటి పోలీస్ అనేపదం వారికి వెన్నులో వణుకు పుట్టించడం.
దేశంలో నివసించే ఎవరైన ఏ కారణం వల్ల నైనా పోలీసులతో జోక్యం చేసుకోవడానికి ఇష్టపడరు. దేశంలో పోలీసులు అంటేనే బెదిరింపులకు పాల్పడే వ్యక్తులుగా కనిపిస్తారు. వాస్తవానికి చాలా సందర్బాలలో వారు అలాగే ప్రవర్తిస్తారు.
రోడ్డు ప్రమాద బాధితులకు సహాయం అందకపోవడానికి కారణం ఇదే. వారు సాయం చేస్తే ఎందులో ఇరుక్కుంటారో అనే భయం వెంబడిస్తుంది. మాదక ద్రవ్యాల అక్రమ రవాణా ఆరోపణలు ఎదుర్కొన్న వ్యక్తి భయాందోళనకు గురికావడం సహజం. ఒక సాధారణ వ్యక్తి అరెస్ట్ చేసి, జైలుకు పంపుతామనే ఆలోచనకే భయపడిపోతాడు.
నేర న్యాయవ్యవస్థపై నమ్మకం లేకపోవడం..
దేశంలో నేర న్యాయ వ్యవస్థపై నమ్మకం లేకపోవడం దారుణం. న్యాయం కోసం స్టేషన్ మెట్లెక్కిన వారికి సహాయం చేయడానికి బదులు పోలీసులు వారిని డబ్బుల కోసం వేధించిన సందర్భాలు కోకొల్లలు.
ఈ సంవత్సరం ప్రారంభంలో ఎంపీ కార్తీ చిదంబరం ‘ది ప్రింట్’ న్యూస్ వెబ్ సైట్ లో రాసిన దాని ప్రకారం.. ఆసుపత్రులు, కోర్టులతో పాటు పోలీసులు రక్షకులను హింసకులుగా మార్చగల సామర్థ్యం కోసం ప్రత్యేకంగా ఉన్నారు. వీరి నుంచి తప్పించుకోవడం అంటే దైవిక ఆశీర్వాదం ఉంటేనే సాధ్యంమని ఆయన అన్నారు.
బాధితులు, నిస్సహాయుల నుంచి డబ్బు వసూలు చేయడానికి వీరు తరుచుగా తమ అధికారాన్ని ఉపయోగించుకున్నారని అనేక నివేదికల్లో తేలింది. రెండు నెలల క్రితం బెంగళూర్ లో ఒక అసిస్టెంట్ సబ్ ఇన్ స్పెక్టర్, ఒక పెట్రోల్ వ్యాన్ డ్రైవర్ కలిసి ఒక వలసకార్మికుడి కుటుంబం నుంచి రూ. 75 వేలు వసూలు చేసినట్లు తేలింది. దీనిని వారు అంగీకరించారు.
పోలీసులు అంటే ఏంటో ప్రజలకు ఉన్న అవగాహానకు ఇలాంటి సంఘటనలు సరిపోతాయి. కాబట్టి ప్రజలు పోలీసులు అంటే దూరం జరుగుతారు. చాలా వరకూ కస్టడీ మరణాలు ప్రశ్నల సమయంలో పోలీసులు చేసే హింస కారణంగానే జరుగుతున్నాయనేది బహిరంగ రహస్యం.
ఈ ఏడాది ఫిబ్రవరిలో లండన్ లోని కోర్టులో మనీలాండరింగ్, పన్ను ఎగవేత ఆరోపణలు ఎదుర్కొంటున్న సంజయ్ భండారి అనే వ్యక్తి అప్పగింత సందర్భంగా మన పోలీసుల ఖ్యాతి మరోసారి ప్రస్ఫూటమైంది.
దేశంలో కస్టోడియల్ మరణాలు సాధారణమైనవని, అందువల్ల అతడిని అప్పగించడం వల్ల మానవ హక్కుల ఉల్లంఘన అవుతుందని కోర్టు అభిప్రాయపడటంతో అతన్ని అప్పగించడానికి నిరాకరించింది.
ది స్టేటస్ ఆఫ్ పోలీస్ రిపోర్టింగ్ ఇన్ ఇండియా-2025 ప్రచురించిన పుస్తకం ప్రకారం.. 2005 నుంచి 2018 వరకూ 13 సంవత్సరాలలో 281 కస్టోడియల్ కేసులు నమోదు చేయబడి, 54 చార్జీషీట్లు దాఖలు చేసినప్పటికీ దాదాపు 500 లాకప్ డెత్ లలో ఒక్క పోలీస్ కూడా దోషిగా లేరని నేషనల్ క్యాంపెయిన్ అగెనెస్ట్ టార్చెర్ 2020 నివేదిక తెలిపింది. ఈ పోలీసుల భయాన్ని స్కామర్లు తమకు అనుకూలంగా ఉపయోగించుకుంటున్నారు.
అంతేకాకుండా ఇటీవల కాలాల్లో తమకు అనుకూలమైన కథనాలు ప్రచురితం కాకపోవడంతో పోలీసులు జర్నలిస్టులపై కూడా కేసులు నమోదు చేయిస్తున్నారు. కాబట్టి ఒక సందర్భంలో తోటి జర్నలిస్ట్ డిజిటల్ అరెస్ట్ కు బెదిరింపు ఫోన్ వచ్చినప్పుడు అతను భయపడ్డాడు. మరొక సహోద్యోగి సకాలంలో జోక్యం చేసుకోవడం వల్ల అతను ఎలాంటి నష్టం లేకుండా తప్పించుకోగలిగాడు.
బాధితురాలిగా మారిన ఆ జర్నలిస్ట్ ఇటీవల కాలాల్లో జర్నలిస్టులను చిన్న చిన్న కారణాలకే అరెస్ట్ చేస్తున్నందున తాను కూడా లక్ష్యంగా మారినట్లు భావించానని చెప్పాడు. సాధారణ బాధితుల లాగానే అతను కూడా పోలీసుల పట్ల తన భయాన్ని వ్యక్తపరిచాడు.
పోలీసులు ఇంకా స్నేహితులుగా మారలేదు
దేశంలో చారిత్రాత్మకంగా పోలీసులు, సామాన్య ప్రజలు ఒక స్పష్టమైన విభజనకు ఇరువైపులా ఉన్నారు. పోలీసులు బలగాలను మరింత పౌర స్నేహపూర్వకంగా పోలీస్ స్టేషన్ ను స్వాగతించే ప్రదేశంగా కనిపించేలా చేయడానికి అర్థ హృదయపూర్వక చర్యలు తీసుకున్నప్పటికీ ఏవీ పనిచేయలేదు.
విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం.. వలసరాజ్యాల కాలం నుంచి 1861 చట్టం ప్రకారం.. పోలీసులు సాధారణ పౌరుడికి జవాబుదారీగా ఉండటానికి బదులుగా ప్రజలను నియంత్రించడానికి, అణచివేయడానికి ఉద్దేశించబడ్డారు. ఇది స్వాతంత్య్ర అనంతర భారత్ లోని పాలకులకు అనుకూలంగా ఉంది కాబట్టి తరువాత కూడా కొనసాగింది.
పోలీసులను అన్ని పోలీస్ స్టేషన్ లలో సీసీటీవీలను ఏర్పాటు చేయాలని వారిని జవాబుదారీగా చేయాలని సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వూలు ప్రభావవంతంగా లేవని తేలింది. సీసీటీవీలు ఏర్పాటు చేయకపోవడం లేదా ఏర్పాటు చేసిన కొన్ని మాత్రమే పనిచేస్తున్నాయి.
సెప్టెంబర్ లో సుప్రీంకోర్టు తన ఆదేశాలను అమలు చేయడానికి సుమోటోగా కేసు నమోదు చేసింది. 2025 మొదటి ఎనిమిది నెలల్లో రాజస్థాన్ లో 11 మంది పోలీస్ కస్టడీలో మరణించారని మీడియా నివేదిక నేపథ్యంలో ఇది జరిగింది. పోలీసులు సీసీటీవీ ఫుటేజీని అందించలేదు.
సీసీటీవీలను ఏర్పాటు చేయాలన్న కోర్టు ఆదేశాన్ని పాటిస్తారా లేదా మున్ముందు తెలియాల్సి ఉంది. ఆ ఆదేశాన్ని అమలు చేయకపోతే ఆశ్చర్యం లేదు. కొన్ని సందర్భాలలో స్కామ్ లలో కోల్పోయిన డబ్బును తిరిగి తీసుకురావడంలో పోలీసులు విజయం సాధించారు. కానీ అది ఒక నియమం కంటే మినహయింపు.
బ్యాంకు ఖాతాలు తెరవడం కేవైసీ ఇతర వాటికి సంబంధించి ఆర్బీఐ కఠినమైన నిబంధనలు ఉన్నప్పటికీ స్కామర్లు మ్యూల్ ఖాతాలు అని పిలవబడే వాటిని సులభంగా తెరవగలుగుతున్నారు. నియమాలు, చట్టాలు కాగితం పైనే ఉంటాయి.
ఈ సంవత్సరం ప్రారంభంలో సీబీఐ, ఉత్తర భారత రాష్ట్రాలలో 42 ప్రదేశాలపై దాడులు నిర్వహించింది. వివిధ బ్యాంకుల 700 శాఖలలో 8.5 లక్షల మ్యూల్ ఖాతాలను గుర్తించింది.
బాధితుల నుంచి సైబర్ మోసం డబ్బును బదిలీ చేయడానికి స్కామర్లు వీటిని ఉపయోగిస్తారు. కాబట్టి ఈ మ్యూల్ ఖాతాలను ఆ పేరుతో పిలుస్తారు.
బాధితుల సహకారం కూడా..
నేర న్యాయ వ్యవస్థ, బ్యాంకింగ్ రంగం, అసమర్థమైన పరిపాలనలో బలహీనత ఉన్నప్పటికీ, ఉద్దేశించిన బాధితుడు స్కామర్లకు సహకరిస్తేనే డిజిటల్ అరెస్ట్ లు పనిచేస్తున్నాయని గుర్తుంచుకోవాలి.
చాలా సందర్భాలలో ఖాతాదారులు తప్ప ఎవరూ భారీ మొత్తంలో డబ్బును బదిలీ చేయలేరు. బాధితుడికి లక్షల రూపాయలు, కోట్ల రూపాయలు కాకపోయినా ఇవ్వాలని చెబుతున్నప్పటికీ తలలో ఎటువంటి హెచ్చరిక గంటలు మోగకపోవడం అనేది వివరణాత్మక మానసిక అధ్యయనం అవసరమయ్యే మనస్తత్వాన్ని గ్రహించడానికి అతిపెద్ద మార్గం.
ప్రస్తుతానికి టెలివిజన్ మొబైల్ ఫోన్ నెట్ వర్క్ లు లేదా మరే ఇతర మీడియాలో డిజిటల్ అరెస్ట్ లకు సంబంధించిన ఎంత సమాచారం అయినా పనిచేయదని తేల్చడం అహంకారం కాదు.
పోలీసింగ్ రంగంలో సంస్కరణలు తీసుకురాకపోతే, పోలీసులు నిజంగా పౌరులకు అనుకూలమైన రీతిలో మారకపోతే మోసాలు కొనసాగుతూనే ఉంటాయి. మరికొంతమంది వ్యక్తులు మోసపోయే ప్రమాదం ఉంది.