గెలుపు అంకెలపై మోడీకి ఆందోళనా? ఎందుకు?

పార్లమెంటులో తన ప్రధాని పదవిపై బీజేపీ నుంచే సవాలు ఎదురవుతుందని ప్రధానమంత్రి ఆందోళన చెందుతున్నారా? ఆయన్ని ఒప్పించడానికి రాజకీయ అసమ్మతి గాలులు వీస్తున్నాయా?

By :  TK Arun
Update: 2024-04-26 06:21 GMT

మూలం : టికె అరుణ్

అనువాదం : రాఘవ శర్మ


పార్లమెంటులో తన ప్రధాని పదవిపై బీజేపీ నుంచే సవాలు ఎదురవుతుందని ప్రధానమంత్రి ఆందోళన చెందుతున్నారా? ఆయన్ని ఒప్పించడానికి రాజకీయ అసమ్మతి గాలులు వీస్తున్నాయా?

బన్స్ వారాలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మాట్లాడుతూ ‘మంగళ సూత్రాలు సహా , హిందూ మహిళల బంగారాన్నంతా కాంగ్రెస్ లాగేసుకుని పిల్లలు ఎక్కువగా ఉన్న చొరబాటు దారులకు ఇచ్చేయడానికి కాంగ్రెస్ సిద్ధంగా ఉంది’ అని ఆరోపించారు.

భారత జాతీయ కూటమిని మాటలతో ఇలా అవమానించడమే కాకుండా, మైనారిటీల పట్ల తప్పుడు అభిప్రాయాలను వ్యాపింప చేయడం, కాంగ్రెస్ పార్టీని తప్పుగా చూపించడం, తన సభలో ఉన్న ప్రేక్షకులను అవమానించడం, తన పార్టీ గెలుపు గురించి అందరినీ ఆశ్చర్య పరిచేలా తన మానసిక బలహీనతను బహిర్గతం చేయడం కనిపిస్తుంది.

దీనికెలా భాష్యం చెప్పాలి మనం ?

మైనారిటీలకు పిల్లలు ఎక్కువగా ఉన్నారని అంటూ వారినే ధ్యేయంగా ప్రధానమంత్రి మాట్లాడారా? దేశం మొత్తంలో బీహార్లోనే అత్యధిక సంఖ్యలో పిల్లలు పుడుతున్నారని, హిందూ మహిళల ఆస్తులను కాంగ్రెస్ పార్టీ లాగేసుకుని మైనారిటీలకు పంపిణీ చేస్తుందని ప్రధాని సిద్ధాంతీకరించారు.

బీహార్ లో మహిళలకు సగటున ముగ్గురు పిల్లలు పుడుతున్నారు. ముస్లిం మహిళలకు సగటున పుడుతున్న పిల్లల సంఖ్య 2.3.

ప్రధాన మంత్రి ‘గుస్పేటియన్’ అన్న పదాన్ని వాడడం ద్వారా, సహజంగా మైనారిటీలు అని కాకుండా, విదేశాల నుంచి అక్రమంగా చొరబడే వారికి కాంగ్రెస్ ఈ సంపదను పంపకం చేస్తుందనా?

ఇలాంటి సంజాయిషీలు నిలబడవు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ మైనారిటీలకు అనుకూలంగా ఉందని దాని పైన దాడి చేయడానికే ఇదంతా. సమాజంలో అట్టడుగున ఉన్న వారికే తొలుత జాతి వనరులను అందివ్వాలని మాజీ ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ అన్న మాటను ప్రస్తుత అవాంఛనీయంగా తీసుకున్న ప్రధాని ఈ వ్యాఖ్యలు చేశారు.

మైనారిటీలు, ప్రత్యేక ప్రయోజనాలు

ఈ మాటను మన్మోహన్ సింగ్ 2006లో అన్నారు. ఆ తరువాత ఆయన ఎనిమిదేళ్ళు యూపీఏ ప్రభుత్వాధినేతగా కొనసాగారు. యూపి ఏ ప్రభుత్వమేమైనా మైనారిటీలకు ప్రత్యేకమైన ప్రయోజనాలను చేకూర్చిందా? జాతి వనరులను కట్టబెట్టడంలో వారికేమైనా ప్రాధాన్యతనిచ్చిందా?

ఆర్థిక మాంధ్యం సంభవించిన 2008-2014 మధ్య పెద్ద ఎత్తున పేదరికాన్ని తగ్గించడం కోసం ఆరు సంవత్సరాలు గ్రామీణ కూలీల వేతనాలను నాటి ప్రభుత్వం సవరించింది.

దీని వల్ల గ్రామీణ పేదల్లో కేవలం ముస్లింలకే వేతనాలు పెరిగాయా? ఇతర వర్గాలతో పోల్చుకున్నట్టయితే విద్యాహక్కు చట్టం ప్రకారం స్కూళ్ళలో ఎక్కువ మంది ముస్లిం పిల్లలే చేరారా? మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి పథకం కింద ఎక్కువ పనిని ముస్లింలు పొందారా? సమాచార చట్టం కింద ఎక్కువ మంది ముస్లింలు ప్రశ్నలు వేసి సమాచారాన్ని రాబట్టారా?

యూపీ ఏ ప్రభుత్వంలో గ్రామీణ టెలిడెన్సిటీ జూమ్ కింద 2004లో రెండు శాతం కంటే తక్కువగా , 2010లో యాభైశాతం కంటే ఎక్కువగా ఇచ్చిన ప్రాధాన్యతలో ముస్లింలకు ఏమైనా ప్రాధాన్యత ఇచ్చారా?

ప్రభుత్వ భూముల్లోకి చొరబడకుండా నిరోధించే చట్టం నుంచి గిరిజనులకు మినహాయింపు నిస్తూ చేసిన అటవీహక్కుల రక్షణ చట్టం ద్వారా ముస్లిం గిరిజనలు మాత్రమే రక్షణ పొందారా? కాంగ్రెస్ పార్టీ ముస్లింలకు ప్రాధాన్యతనిచ్చిందని ఏ ప్రాతిపదికన చెప్పగలుగుతున్నారు?

మరింత బలమైన ఆరోపణలు

దీనికి భిన్నంగా ముస్లిం మేధావులు, మత పెద్దలు కోరడానికి భిన్నంగా భారత ప్రజాస్వామిక రాజ్యాంగం బహిరంగంగా అందరికీ కల్పించిన ప్రజాస్వామిక ప్ర్రక్రియలో పాల్గొనడంలో కాంగ్రెస్ పార్టీ పేద ముస్లింలను , ముఖ్యంగా ముస్లిం మహిళలను మోసగించింది.

కాంగ్రెస్ పార్టీ మైనారిటీలను ఓటు బ్యాంకు కింద ఉపయోగించుకుంది. అత్యధిక సంఖ్యాకుల విశ్వాసాలకు అనుగుణంగా సంప్రదాయంగా వస్తున్న ముస్లిం పురుషుల గౌరవాన్ని కాపాడడంలో, వివక్షకు గురవుతున్న మహిళలను కాపాడడంలో కాంగ్రెస్ పార్టీ విఫలమైంది.

భారత అమెరికా అణు ఒప్పందం

ఇప్పుడు జరుగుతున్న బీజేపీ ఎన్నికల ప్రచారంలో విదేశాలలో భారత ప్రతిష్ట పెరిగిపోయిందని, ప్రపంచ ఆర్థిక రంగంలో భారతదేశ ప్రాధాన్యత పెరిగిందని మోడీ చెపుతున్నారు.

భారత దేశం అణుపరీక్ష జరిపాక, పౌర అణు ఒప్పందాన్ని చేసుకోవడానికి అమెరికా అధ్యక్షుడుగా జార్జి బుష్ అనుమతివ్వడంతో ప్రపంచంలో భారతదేశానికి గుర్తింపు రావడం ఒక బలమైన సూచన.

అమెరికా-భారత్ అణు ఒప్పందాన్ని నరేంద్ర మోడీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో తీవ్రంగా విమర్శించారు. అణు ఒప్పందం పై వ్యతిరేకంగా ఓటు వేయడంలో బీజేపీ, దాని మిత్ర పక్షాలు విజయవంతమయ్యాయి. ఆ ప్రభుత్వం కొనసాగడానికి కాంగ్రెస్ తెలివిగా ప్రవర్తించింది.

పెద్ద పెద్ద అమెరికా బహుళజాతి కంపెనీలు భారత ఆర్థిక వ్యవస్థను విశ్వసించి , ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి 2008లో చేసుకున్న భారత-అమెరికా అణు ఒప్పందం దోహదపడింది. సాంకేతికతను అదుపు చేసే భిన్న వ్యూహాత్మక సంస్థలలో సభ్యత్వానికి భారతదేశం మార్గాన్ని ఏర్పాటు చేసుకుంది. అలాంటి సంస్థల్లో మిజైల్ టెక్నాలజీ కంట్రోల్ రిజైమ్, రెండువైపులా సాంకేతికతను ఉపయోగించుకోవడానికి పనికి వచ్చే వాస్సెన్నార్ అరేంజ్ మెంట్స్, ఆస్ట్రేలియా గ్రూప్ ఆఫ్ కెమికల్ వెపన్స్, భవిష్యత్తు రసాయనాలు వంటివి అందులో ఉన్నాయి.

యూపి ఏ సాధించిన విజయాలు

అణుఒప్పందం వల్ల ఆయుధ సంపత్తి ఉన్న చైనాకు దీటుగా అణు విస్తరణ వ్యతిరేక ఒప్పందంలో సంతకం చేయకుండానే అణు సరఫరా దేశాల కూటమిలో భారత దేశానికి సభ్యత్వం లభించింది. భారత దేశం క్వాడ్ (అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా, ఇండియా కూటమి) దేశాల కూటమిలో సభ్యత్వం లభించింది. బీజేపీ, దాని మిత్రపక్షాల ఆకాంక్షలకు వ్యతిరేకంగా ఇవ్వన్నీ జరిగాయి.

అత్యాధునిక ప్రపంచ డిజిటల్ ప్రజా మౌలిక సదుపాయాలలో ప్రస్తుత భారత దేశం పాలుపంచుకుంటోంది. దాని పునాదిని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వేసింది. దాని ప్రధానమైన ప్రాజెక్టులలో ఆధార్ ముఖ్యమైంది. ఆధార్ ను బీజేపీ, ఆనాటి గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ తీవ్రంగా వ్యతిరేకించిన విషయం విదితమే. ప్రధానిగా అవతారమెత్తాక మోడీ ఆదార్ ను తానే ప్రవేశ పెట్టానని చెప్పుకుంటున్నారు.

మోడీ విషపూరిత అలజడి

ముస్లింలను చొరబాటు దారులని మిగతా దేశం దృష్టి లో వారిని అవమానపరిచే పదజాలంతో ప్రధాన మంత్రి నరేంద్రమోడీ అలజడిని సృష్టి స్తున్నారు. మైనారిటీ వ్యతిరేక సెంటిమెంటును రెచ్చగొడుతున్నారు.

ప్రధాని ఈ ఎత్తుగడను ఎందుకు ఉపయోగిస్తున్నారు? తరువాత ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి తగినంత సంఖ్యాబలం రాదని భయపడుతున్నారా? 543 మంది సభ్యులున్న లోక్ సభలో బీజేపీకి సాధారణ మెజారిటీ 273 స్థానాలు రావడం పెద్ద కష్టం కాదు.

బీజేపీకి బొటాబొటి మెజారిటీ వస్తుందనేది ఊహాజనితమైనది. ఒక్క ఉత్తర ప్రదేశ్ నుంచే ఆ పార్టీ 70 స్థానాలు సాధించవచ్చు. కేంద్రంలో వచ్చే ప్రభుత్వంలో తాను ఉంటానని ఉత్తర ప్రదేశ్ కు చెందిన నాయకుడు యోగీ ఆదిత్యనాథ్ ఒత్తిడి చేస్తున్నారు.

ఇలాంటి సవాళ్ళను ఎదుర్కొనడానికి ప్రధాని బీజేపీకి భారీ మెజారిటీ తీసుకురావడం అవసరం. నాలుగు వందల స్థానాలు తీసుకురాలేకపోతే బహిరంగంగా ఆయన పైనే విమర్శలు వెల్లువెత్తుతాయి. అంత భారీ మెజారిటీ తీసుకు వస్తానని ఒప్పించడానికి ప్రధాని ఉద్దేశ్య పూర్వకంగానే రాజస్థాన్ లోని బన్స్ వారాలో ఇలాంటి విషపూరితమైన ప్రచారాలు చేస్తున్నారా?

Tags:    

Similar News