మళ్లీ అధికారంలోకి రాగానే ఆ బిల్లులు మాఫీ: AAP చీఫ్ కేజ్రీవాల్

‘‘ఆప్‌కి ఎందుకు ఓటు వేయాలో ఆలోచించండి. మీ పిల్లలకు బీజేపీ ఏం చేసిందో అడగండి.’’ - AAP చీఫ్ కేజ్రీవాల్

Update: 2024-11-02 11:30 GMT

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైన విషయం తెలిసిందే. ఫిబ్రవరిలో ఎలక్షన్లు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఢిల్లీ ట్రాన్స్‌పోర్ట్ నగర్‌లో విశ్వకర్మ దినోత్సవం సందర్భంగా ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ మాట్లాడారు. మళ్లీ అధికారంలోకి వస్తే పెంచిన నీటి, విద్యుత్తు బిల్లులను మాఫీ చేస్తామని హామీ ఇచ్చారు. ఢిల్లీ లిక్కర్ పాలసీ కుంభకోణం కేసుకు సంబంధించి కేజ్రీవాల్ జైలులో ఉన్నప్పుడు నగర పాలక సంస్థకు లెఫ్టినెంట్ గవర్నర్ సారథ్యం వహించారు. ఆయన హయాంలో నీటి, విద్యుత్ బిల్లులు పెంచారు.

బీజేపీని నిలదీయండి

 "చింతించకండి. ఇప్పుడు నేను బయటకు వచ్చాను. ఇతర పార్టీల రాజకీయ నాయకుడిగా నేను వ్యవహరించను. ఉన్నతంగా చదువుకున్నా. నాకు ఎప్పుడు ఏ పని చేయాలో తెలుసు. ఫిబ్రవరిలో ఆప్ అధికారంలోకి రాగానే మీ బిల్లులు మాఫీ అవుతాయి. ఢిల్లీలోని ప్రభుత్వం దేశ రాజధానిలో విద్య నుంచి ఆరోగ్యం వరకు ఎంతో కృషి చేసింది. గత 10 ఏళ్లుగా ప్రజల అభ్యున్నతికి కృషి చేశా. పనిచేసిన వారికే ఓటు వేయండి. ఆప్‌కి ఎందుకు ఓటు వేయాలో ఆలోచించండి. మీ పిల్లలకు బీజేపీ ఏం చేసిందో అడగండి. ఢిల్లీ ప్రజల కోసం చేసిన ఒక్క పని చూపించమని వాళ్లను నిలదీయండి’’ అని ఆప్ చీఫ్ పేర్కొన్నారు.

వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఢిల్లీ శాసనసభకు ఎన్నికలు జరగనున్నాయి.  

Tags:    

Similar News