బీజేపీ ఆఫీసులో వేడెక్కిన వాతావరణం.. కొట్టుకున్న నేతలు..
రాష్ట్ర బంద్‌కు బీజేపీ మద్దతు ఇవ్వాలని నేతలను కోరిన కృష్ణయ్య.
హైదరాబాద్ బీజేపీ ఆఫీసులో వాతావరణం హీటెక్కింది. బీసీ సంఘాల నేతలు, బీజేపీ నేతల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఒకరిపై ఒకరు పిడిగుద్దులు విసురుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. అయితే బీసీ రిజర్వేషన్లను డిమాండ్ చేస్తూ అక్టోబర్ 18న రాష్ట్రబంద్‌కు బీసీ జేఏసీ ఛైర్మన్ ఆర్ కృష్ణయ్య ప్రకటించారు. ఆ బంద్‌కు మద్దతు ఇవ్వాలని బీజేపీని కోరారు. ఈ మేరకు బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు రామచందర్ రావు, ఆర్ కృష్ణ కలిసి బీసీ నేతలు, బీజేపీ నేతలతో సమావేశం నిర్వహించారు. ఇందులో రాష్ట్ర బంద్‌కు బీజేపీ మద్దతు ఇవ్వాలని నేతలను కోరారు. ఆ తర్వాత నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఫొటోల కోసం ఈ రెండు వర్గాల నేతల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. అది కాస్తా ఘర్షణకు దారితీసింది. ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు. ఒకవైపు నుంచి రామచందర్ రావు, ఆర్ కృష్ణ వారిస్తున్నా ఎవరూ పట్టించుకోలేదు. తమ గొడవలో నిమగ్రమైపోయి ఉన్నారు. దీంతో మిగిలిన నేతలు వెంటనే కలుగజేసుకుని గొడవను సర్దుమణిగించారు. దీనికి సంబంధించి ఓ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.
జీవో ఎంఎస్ 9 అమలుపై స్టే కు నిరసనగా రాష్ట్రంలోని బీసీ సంఘాలు(BC Associations) ఈనెల 14వ తేదీన బంద్ పాటించాలని డిసైడ్ అయ్యాయి. అయితే ఇదేవిషయమై ఆదివారం సమావేశమైన 33 బీసీ సంఘాలు సుదీర్ఘంగా చర్చించాయి. చర్చలో బంద్(Telangana Bandh) ను 14వ తేదీనుండి 18వ తేదీకి వాయిదా వేయాలని నిర్ణయమైంది. అలాగే బీసీ సంఘాలన్నీ కలిసి జాయింట్ యాక్షన్ కమిటీ(జేఏసీ)గా ఏర్పాటవ్వాలని కూడా నిర్ణయించాయి. ఈ జేఏసీకి ఛైర్మన్ గా బీసీ జాతీయ సంక్షేమసంఘం అధ్యక్షుడు, బీజేపీ ఎంపీ ఆర్ కృష్ణయ్యను ఛైర్మన్ గా సమావేశం నియమించింది. వైస్ ఛైర్మన్ గా వీజీఆర్ నారగోని, వర్కింగ్ ఛైర్మన్ గా జాజుల శ్రీనివాస గౌడ్, కో ఛైర్మన్ గా దాసు సురేష్, రాజారామ్ యాదవ్ ను సమావేశం నియమించింది.