బిక్కనూరులో రోడ్డు ప్రమాదం
మృత్యువాతపడ్డ ముగ్గురు, ఆరునెలల పసికందు పరిస్థితి విషమం
కామారెడ్డి జిల్లా బిక్కనూరు మండలం జంగంపల్లి వద్ద బుధవారం ఘోర ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. రాంగ్ రూట్లో వచ్చిన టిప్పర్ ఎలక్ట్రిక్ స్కూటర్ ని ఢీ కొట్టింది. నలుగురు వ్యక్తులు స్కూటర్ పై ప్రయాణిస్తున్నారు. రాంగ్ రూట్లో వస్తున్న టిప్పర్ ను చూసుకోకపోవడం వల్ల ప్రమాదం సంభవించి ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మరణించారు. ఆరునెలల పసికందు పరిస్థితి విషమంగా ఉంది. చనిపోయిన వారిలో వృద్దుడు, మహిళ, మూడేళ్ల బాలుడు ఉన్నారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. బాధితుల వివరాలు సేకరిస్తున్నారు. మృత దేహాలను కామారెడ్డి ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
బిక్కనూర్ మండలంలో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. బిక్కనూర్ టోల్ గేట్ వద్ద ప్రమాదాలు జరిగి పలువురు మృత్యువాత పడుతున్నారు. జాతీయ రహదారి 44లో ఎక్కువగా రోడ్డు ప్రమాదాలు జరగుతుండటంతో ఈ రోడ్డుపై ప్రయాణించాలంటే వణికిపోయే పరిస్థితి నెలకొంది.