కాలుష్యం కోరల్లో ఢిల్లీ..

రెండో స్థానంలో చండీగఢ్..

Update: 2025-11-25 12:11 GMT
Click the Play button to listen to article

దేశ రాజధాని ఢిల్లీ(Delhi)లో గాలి కాలుష్యం(Air Pollution) బాగా పెరిగిపోయింది. దేశంలోని 33 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలతో పోలిస్తే ప్రధమ స్థానంలో ఉంది. PM2.5 స్థాయి క్యూబిక్ మీటర్‌కు 101 మైక్రోగ్రాములుగా నమోదయ్యింది. ఇది సాధారణం (2.5) కంటే 20 రెట్లు ఎక్కువ అని సెంటర్ ఫర్ రీసెర్చ్ ఆన్ ఎనర్జీ అండ్ క్లీన్ ఎయిర్ (CREA) తన తాజా నివేదిక(మార్చి 2024 - ఫిబ్రవరి 2025)లో పేర్కొంది. రెండో స్థానంలో చండీగఢ్ (క్యూబిక్ మీటర్‌కు 70 మైక్రోగ్రాముల), మూడో స్థానంలో హర్యానా (63), నాలుగో స్థానంలో త్రిపుర (62) నిలిచింది. ఆ తర్వాత అస్సాం (60), బీహార్ (59), పశ్చిమ బెంగాల్ (57), పంజాబ్ (56), మేఘాలయ (53), నాగాలాండ్‌లో 52 మైక్రోగ్రాములుగా రికార్డయ్యింది.

ఢిల్లీలోని 11 జిల్లాలు, అస్సాంలో 11 జిల్లాలు, బీహార్‌లో 7, హర్యానాలో 7, ఉత్తరప్రదేశ్‌లో 4, త్రిపురలో 3, రాజస్థాన్లో 2, పశ్చిమ బెంగాల్‌లో 2 జిల్లాల్లో అధిక కాలుష్యం ఉన్నట్లు నివేదికలో పేర్కొన్నారు.  

Tags:    

Similar News