లారెన్స్ బిష్ణోయ్‌ ఇంటర్వ్యూ ఎఫెక్ట్.. పోలీసులపై సస్పెన్షన్ వేటు

నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన జైలు సిబ్బంది, పోలీసులపై సస్పెన్షన్ వేటు పడింది.

Update: 2024-10-26 06:50 GMT

పోలీసు కస్టడీలో ఉన్న గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్‌ను ఇంటర్వ్యూ చేసిన కేసులో ఇద్దరు డిప్యూటీ సూపరింటెండెంట్ ర్యాంక్ ఆఫీసర్లతో పాటు ఏడుగురు సిబ్బందిపై పంజాబ్ హోం సెక్రటరీ సస్పెండ్ ఆర్డర్స్ జారీ చేశారు.

పంజాబ్ పోలీసుల కస్టడీలో ఉన్నప్పుడు మొహాలిలోని ఖరార్‌లో ఒకసారి, రెండోసారి రాజస్థాన్‌ జైపూర్‌ సెంట్రల్ జైలులో ఉన్నప్పుడు ఓ ప్రైవేటు ఛానల్‌కు 2022 సెప్టెంబర్ 3, 4వ తేదీ మధ్య రాత్రి వీడియో కాన్ఫరెన్స్‌లో ఇంటర్య్వూ ఇచ్చినట్లు పోలీసు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) గుర్తించింది. దీంతో విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఏడుగురు పోలీసు సిబ్బందిని సస్పెండ్ చేసింది. శుక్రవారం పంజాబ్ హోం సెక్రటరీ సస్పెన్షన్ ఉత్తర్వులు జారీ చేశారు. ఎస్పీ గుర్షేర్ సింగ్ సంధు, డీఎస్పీ సమ్మర్ వనీత్, సబ్ ఇన్‌స్పెక్టర్ రీనా (సీఐఏ ఖరార్), సబ్ ఇన్‌స్పెక్టర్ జగత్‌పాల్ జంగు, సబ్ ఇన్‌స్పెక్టర్ షాగంజిత్ సింగ్, అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్ ముఖ్తియార్ సింగ్‌, హెడ్ కానిస్టేబుల్ ఓం ప్రకాష్‌ను సస్పెండ్ చేశారు. జైలు ఆవరణలో ఖైదీలు మొబైల్ ఫోన్‌లను వినియోగించడాన్ని సిట్ జూలైలో పంజాబ్, హర్యానా హైకోర్టు దృష్టికి తీసుకెళ్లింది. 2022లో పంజాబీ గాయకుడు సిద్ధూ మూసేవాలా హత్య కేసులో నిందితుల్లో బిష్ణోయ్ ఒకరు. 

Tags:    

Similar News